Harish Rao: పోలవరం, పోతిరెడ్డిపాడు, పులిచింతల లాంటి ఆంధ్రప్రదేశ్ అక్రమ ప్రాజెక్టులను నిరసిస్తూ 20 ఏళ్ల క్రితం ఇదే రోజున (04/07/2005) మంత్రి పదవులకు రాజీనామాలు చేశామని మాజీ మంత్రి హరీష్ రావు గుర్తు చేశారు. కేసీఆర్ ఆదేశాలతోనే.. ఉమ్మడి రాష్ట్రంలోనే తెలంగాణ నీటి హక్కుల కోసం పదవులను గడ్డి పోచలుగా భావించి వదులుకున్నామని పేర్కొన్నారు.
తన చెల్లిని ప్రేమిస్తున్నాడని ఓ యువకుడిపై కోసం పెంచుకున్న యువకుడు.. పార్టీ అంటూ పిలిచి.. దారుణంగా హత్య చేసి.. పాతిపెట్టిన కాకినాడ జిల్లాలో కలకలం సృష్టిస్తోంది..
మూడు దాడులు, ఆరు తప్పుడు కేసుల్లా.. రాష్ట్రంలో పాలన ఉంది అంటూ కూటమి సర్కార్‌పై మండిపడ్డారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు.. ప్రతిరోజూ వైసీపీ కార్యకర్తలపై దాడులు చేస్తూనే ఉన్నారు. మన్నవ సర్పంచ్ నాగమల్లేశ్వరరావును చంపేందుకు ప్రయత్నించారు. పొన్నూరు ఎమ్మెల్యేకి తెలియకుండానే ఈ హత్యాయత్నం జరిగిందా? అని ప్రశ్నించారు.
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో దారుణం జరిగింది. శ్రీ కీర్తన స్కూల్ బస్సు కింద పడి నాలుగేళ్ల చిన్నారి గిలాగిలా కొట్టుకుంటూ ప్రాణాలు కోల్పోయింది. చిన్నారి రాకను తల్లి చూస్తుండగానే ఆమె కళ్ల ముందే బస్సు చక్రాల కింద నలిగి ప్రాణాలు కోల్పోయింది. శ్రీ కీర్తన హైస్కూల్ లో చిన్నారి హరి ప్రియ యూకేజీ చదువుతోంది. స్కూల్ ముగిసిన అనంతరం బస్సు దిగి ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జర్నలిస్టులకు శుభవార్త చెప్పింది.. జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. నేడు అధికారులతో రెవెన్యూ శాఖ సమీక్ష సమావేశంలో నిర్వహించారు సీఎం చంద్రబాబు.. ఈ సందర్భంగా ఆదేశించారు.. ఇందు కోసం ముగ్గురు మంత్రులతో మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. మంత్రులు అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, పొంగూరు నారాయణతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం.
మీరు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా..? ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసిన ఇంకా పెళ్లి కాలేదా..? ఉద్యోగంలో ప్రమోషన్ కావాలని అనుకుంటున్నారా..? ఇవన్నీ జరగాలంటే మీరు వెంటనే నెల్లూరుజిల్లాకి వచ్చేయండి.. ఎందుకంటే ఈ నెల 6 నుంచి నెల్లూరులో రొట్టెల పండుగ ప్రారంభం కాబోతుంది.. ఇక్కడ కోరుకుంటే అన్నీ కోర్కెలు నెరవేరుతాయాట.. ఇంతకీ దాని చరిత్ర.. ఏర్పాట్లు ఎలా ఉన్నాయో చూద్దామా..
గత ప్రభుత్వం రీ సర్వే సరైన పద్ధతిలో చేయలేదు.. కేవలం ఫొటోల పిచ్చితో రీసర్వే చేశారు అని విమర్శించారు ఏపీ రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్.. అయితే, పారదర్శకంగా భూముల రీ సర్వే జరుగుతుంది.. హక్కులకు భంగం లేకుండా భూ సర్వే జరుగుతుంది.. ఆగస్టు 15న కొత్త పాస్ బుక్స్ ఇస్తామని వెల్లడించారు..
మామిడి రైతులకు అండగా నిలిచింది కూటమి ప్రభుత్వం.. మామిడి రైతుల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనవసర రాజకీయాలు చేస్తుందంటూ మండిపడుతున్నారు ప్రభుత్వ పెద్దలు.. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా కిలోకి 4 సబ్సిడీ ఇచ్చి రైతులకు అండగా నిలబడిందనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. నష్టాన్ని ముందుగానే అంచనా వేసి మామిడి రైతులను ఆదుకోవాలని సబ్సిడీ ఇచ్చామంటున్నాయి ప్రభుత్వ వర్గాలు..
సిబ్బంది లేరు.. ఫ్యాకల్టీ లేదు.. డాక్టర్లు అంతకంటే కూడా లేరు.. కేవలం అద్దె ప్రాతిపదికన డాక్టర్లను తీసుకువచ్చి తనిఖీల సమయంలో తూతూ మంత్రంగా వ్యవహరించి పంపించి వేస్తున్నారు.. అద్దె డాక్టర్లు అద్దె సిబ్బంది తో నేషనల్ మెడికల్ కౌన్సిల్ అధికారులను మభ్య పెడుతున్నారు ..అయితే అక్కడితో సరిపోయేది.. మెడికల్ కాలేజీల అనుమతి కోసం ఏకంగా నేషనల్ మెడికల్ కౌన్సిల్ సిబ్బందికి లంచాలు ఇస్తున్నారు ..అది కూడా కోట్లల్లో డబ్బులు చెల్లిస్తున్నారు. ఆంధ్ర నుంచి ఢిల్లీ వరకు ఈ…