మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు మరోసారి యత్నాలు చేశారు.. దీని కోసం అనుమతి కోరుతూ ఎస్పీ జగదీష్ కు లేఖ రాశారు కేతిరెడ్డి పెద్దారెడ్డి.. రీకాలింగ్ చంద్రబాబు మ్యానిఫెస్టో కార్యక్రమానికి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చిన విషయం విదితమే కాగా.. తాను తాడిపత్రి నియోజకవర్గంలో రీకాలింగ్ చంద్రబాబు మ్యానిఫెస్టో కార్యక్రమాన్ని నిర్వహించాలి, అనుమతి ఇవ్వాలని ఎస్పీని కోరారు పెద్దారెడ్డి..
ప్రపంచ స్థాయి నాణ్యత ప్రమాణాలతో కూడిన ఆధునిక టెక్నాలజీతో ఏపీ రహదారులు పటిష్టంగా మారనున్నాయి, రాష్ట్రంలో మొట్ట మొదటి సారిగా డెన్మార్క్ డానిష్ ఫైబర్ టెక్నాలజీతో ఆర్ అండ్ బీ శాఖ వినూత్న ప్రయోగంతో రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టింది.
కంబదూరు మండల కేంద్రం లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పని చేసే ఉపాధ్యాయుడు హనుమంతురాయుడు మరొక పాఠశాలకు బదిలీ అయ్యారు.. దీంతో, పాఠశాలలో వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు 'మమ్మల్ని వదిలి వెళ్లకండి సార్' అంటూ కన్నీరు పెట్టుకున్నారు.
సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంది ఏపీ ప్రభుత్వం. నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరగనుంది. టీడీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి మరీ... అందుకు సంబంధించిన దిశా నిర్దేశం చేశారు సీఎం చంద్రబాబు. ఈ నెల రెండు నుంచి మొదలైన కార్యక్రమాన్ని ఖచ్చితంగా నెల రోజుల పాటు సిన్సియర్‌గా నిర్వహించాలన్న ఆదేశాలున్నాయి పార్టీ పెద్దల నుంచి.
మాఫియా తరహాలో రాష్ట్రాన్ని నడుపుతున్న చంద్రబాబుకు అసలు పదవిలో ఉండే అర్హత ఉందా? రాజకీయ నాయకులకు, పౌరులకు రక్షణ లేని ఈ రాష్ట్రంలో, రాజ్యాంగాన్ని, చట్టాన్ని ఉల్లంఘిస్తూ, లా అండ్ ఆర్డర్ కాపాడలేని పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టకూడదు అంటూ ప్రశ్నించారు.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించింది. రెడ్‌బుక్, పొలిటికల్ గవర్నన్స్‌లతో ఆంధ్రప్రదేశ్ రక్తమోడుతోంది
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూటమి ఎమ్మెల్యేలకు, అందులోనూ ప్రత్యేకించి టీడీపీ వాళ్ళకు ఏమైందని హాట్ హాట్‌గా చర్చించుకుంటున్నాయి జిల్లా రాజకీయవర్గాలు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉండడమే కాకుండా కనీసం వైసిపి విమర్శలకు సైతం కౌంటర్ ఇవ్వాలన్న స్పృహ కూడా ఎందుకు ఉండటం లేదని పార్టీ కేడరే మాట్లాడుకుంటున్న పరిస్థితి.
ఇంటర్ విద్యలో యూడైస్.. యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేష్ ఎన్‌రోల్‌మెంట్‌ను సమర్థవంతంగా చేపట్టాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఇంటర్మీడియట్ విద్యపై ఉండవల్లి నివాసంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి లోకేష్.. అయితే, ఇంటర్మీడియట్ మొదటి ఏడాదిలో 5 లక్షల 965 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారని ఈ సందర్భంగా అధికారులు మంత్రికి వివరించారు.