కరోనా సెకండ్ వేవ్ ఏపీలో కల్లోలమే సృష్టిస్తోంది… ఇక, చిత్తూరు జిల్లాలో వరుసగా పెద్ద సంఖ్యలో కోవిడ్ కేసులు వెలుగు చూస్తున్నాయి… దీంతో.. చిత్తూరు జిల్లాలోని పుంగనూరు ప్రభుత్వ ఆస్పత్రిని కోవిడ్ హాస్పిటల్ గా ప్రకటించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఆ ఆస్పత్రిలో వంద ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో తెస్తామని హామీ ఇచ్చారు మంత్రి… రెండు మూడు రోజుల్లో ప్రభుత్వ హాస్పిటల్‌లో కోవిడ్ కు సంబంధించిన అన్ని వసతులు కల్పిస్తామని స్పష్టం చేశారు.. మరోవైపు.. గుజరాత్ నుండి 150 ఆక్సిజన్ సిలండర్లతో ఇప్పటికే ఓ వాహనం పుంగనూరుకు బయల్దేరినట్టు అధికారులు చెబుతున్నారు.. కాగా, పుంగనూరు కోవిడ్ సెంటర్లో కనీస వసతులు లేక కరోనా బాధితులు ఇబ్బందులు పడుతూ వచ్చారు.. ఆక్సీజన్ బెడ్లు లేకపోవడంతో రోజుకు 20 నుండి 30 మంది పేషంట్లు పుంగనూరు నుండి మదనపల్లి, తిరుపతి, చిత్తూరు, బెంగళూరు లాంటి ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి.. ఈ వ్యవహారం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో.. ఆయన కీలక హామీ ఇచ్చారు.