తెలంగాణలో లాక్డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు. పొరుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు అధికంగా ఉండటంతో ప్రభుత్వం అప్రమత్తం అయ్యి లాక్డౌన్ను విధించింది. బోర్డర్ల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది ప్రభుత్వం. బోర్డర్ వద్ద ఏపీ నుంచి వచ్చే అంబులెన్స్ లను హైదరాబాద్ కు వెళ్లేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు. దీంతో కర్నూలు జిల్లాలోని పుల్లూరు చెక్ పోస్ట్ వద్ద ఏపీ నుంచి వచ్చే అంబులెన్స్ లు పెద్ద సంఖ్యలో బారులు తీరాయి. దీంతో చెక్ పోస్టుల…
ఏపీలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలమే సృష్టిస్తోంది. అయితే ఈరోజు 20 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కోవిడ్ బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రంలో 96,446 శాంపిల్స్ పరీక్షించగా 22,399 మందికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. 24 గంటల్లోనే కోవిడ్తో 89 మంది మృతి చెందడం కలకలం రేపుతోంది. ఇదే సమయంలో 18,638 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్…
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా ఏపీ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో ఏపీలో కొత్తగా 21,452 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 13,44,386 కు చేరింది. ఇందులో 11,38,028 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా 1,97,370 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా కారణంగా 89 మంది…
2020 నుంచి దేశం కరోనా మహమ్మారితో ఇబ్బందులు పడుతున్నది. గతేడాది కరోనా లాక్ డౌన్ కారణంగా ఏపీలో జరగాల్సిన అసెంబ్లీ సమావేశాలు అనేక మార్లు వాయిదా వేస్తూ వచ్చాయి. కరోనా కంట్రోల్ లోకి రావడంతో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు. ఆ తరువాత వరసగా ఎన్నికలు జరిగాయి. మే నెలలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని అనుకున్న సమయంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. దీంతో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ విషయంలో ప్రభుత్వం ఆలోచనలో పడింది. బడ్జెట్ సమావేశాలను జూన్ 3 లోగా తప్పనిసరిగా…
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో లాక్డౌన్ ను విధించారు. ఉదయం 10 గంటల నుంచి లాక్డౌన్ అమలులో ఉండటంతో తెలంగాణ నుంచి వేలాదిమంది ఏపీకి వెళ్తున్నారు. భారీ సంఖ్యలో వాహనాల్లో ప్రజలు తరలి వెళ్తున్నారు. ఏపీలో మద్యాహ్నం 12 గంటల తరువాత కర్ఫ్యూ అమలులో ఉండటంతో 12 గంటలలోగా సొంత ప్రాంతలకు చేరుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఉదయం 10 గంటల తరువాత లాక్డౌన్ అమలులో ఉంటుంది కాబట్టి ఉదయం 10 గంటల తరువాత వాహనాల రాకపోకలు…
ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారిని అడ్డుకోవడానికి వ్యాక్సిన్ కార్యక్రమం వేగవంతంగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. వ్యాక్సిన్ కొరత ఉన్నప్పటికి వ్యాక్సిన్ అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కేంద్రం నుంచి వ్యాక్సిన్ ను తెప్పించుకోవడానికి అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నది. ఇక మే 1 నుంచి వ్యాక్సిన్ ను రాష్ట్రాలు నేరుగా కొనుగోలు చేసే అవకాశం ఉండటంతో ప్రభుత్వం ఆ దిశగా కూడా అడుగులు వేస్తున్నది. ఇక ఇదిలా ఉంటె, ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి విజయవాడలోని గన్నవరం ఎయిర్…
ఆంధ్రప్రదేశ్ లో కరోనా టీకా పంపిణి వేగవంతంగా జరుగుతున్నది. కరోనా టీకా కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు వ్యాక్సిన్ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. ప్రస్తుతం 45 సంవత్సరాలు నిండిన వారికి వ్యాక్సిన్ అందిస్తున్నారు. అయితే, వ్యాక్సిన్ కేంద్రాల వద్ద రద్దీ, తోపులాట అధికంగా ఉండటంతో ఈరోజు రేపు వ్యాక్సిన్ కార్యక్రమాన్ని నిలిపివేసింది ఏపీ ప్రభుత్వం. టీకా కేంద్రాల వద్ద రద్దీని తగ్గించేందుకు పక్కా ప్రణాళికను సిద్ధం చేసింది. ఓటర్ స్లిప్పుల తరహాలో వ్యాక్సిన్ స్లిప్పులను ఓటర్లకు అందించేందుకు…
ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో కర్ఫ్యూ ఆంక్షలు కఠినంగా అమలవుతున్నాయి. మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఒడిశా నుంచి ఎవరూ రాకుండా బోర్డర్ క్లోజ్ చేసేశారు ఏపీ పోలీసులు, అధికారులు. ఇచ్ఛాపురం ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టు వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మెడికల్ ఎమర్జెన్సీకి మాత్రమే మినహాయింపులు ఇస్తున్నారు అధికారులు. ఇది ఇలా ఉండగా.. ఆంధ్రా – ఒడిశా సరిహద్దుల్లో ఒడిశా అధికారులు ఓవరాక్షన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఒడిశాలో లాక్ డౌన్ అమల్లో ఉంది. ఆంధ్రా ప్రాంతం నుంచి…
ఏపీలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలమే సృష్టిస్తోంది. అయితే ఈరోజు 20 వేలకు దిగువగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కోవిడ్ బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రంలో 1,00,424 శాంపిల్స్ పరీక్షించగా 17,188 మందికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. 24 గంటల్లోనే కోవిడ్తో 73 మంది మృతి చెందడం కలకలం రేపుతోంది. ఇదే సమయంలో 12,749 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్…
తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. టీటీడి ఉద్యోగులకు ఇంటిస్థలాల కేటాయింపుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ఉద్యోగుల కోసం 400 ఎకలరాల ప్రభుత్వ స్థలం కేటాయించాలని గత ఏడాది డిసెంబర్లో టిటిడీ పాలకమండలి తీర్మానం చేసింది. టీటీడి తీర్మానాన్ని రాష్ట్రప్రభుత్వానికి అప్పట్లో పంపింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ తీర్మానానికి అంగీకారం తెలిపింది. దానికి సంబందించి ఉత్తర్వులను జారీ చేసింది ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని టీటీడీ ఉద్యోగులు స్వాగతించారు.