నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య తయారు చేసే కరోనా మందు కోసం వేలాది మంది ఎదురుచూస్తున్నారు.. కొందరు మందుకు తీసుకోవడానికి వెళ్లకపోయినా.. ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు.. ఆనందయ్య మందు పంపిణీకి ప్రభుత్వం ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? అనే ఉత్కంఠ నెలకొంది.. మరోవైపు.. సోషల్ మీడియాలో కొందరు కేటుగాళ్లు.. కృష్ణపట్నంలో ఆనందయ్య కరోనా మందును తిరిగి ప్రారంభించారంటూ తప్పుడు ప్రచారానికి తెరలేపారు.. ఇవాళ్టి నుంచే మందు పంపిణీ చేస్తున్నారంటూ పుకార్లు సృస్టించారు.. దీంతో.. వందలాది మంది…
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ ఏ మాత్రం తగ్గడంలేదు. రోజువారీ పాజిటీవ్ కేసులతో పాటు మరణాల సంఖ్య సైతం ఆంధోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కేసులతో పాటు ఇప్పుడు బ్లాక్ ఫంగస్ కేసులు కూడా భయపెడుతున్నాయి. దేశంలో ఇప్పటికే ఈ కేసులు 12 వేలకు పైగా నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో ఈ బ్లాక్ ఫంగస్ కేసులు నానాటికి పెరుగుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో ఇప్పటికే ఈ కేసులు 50 కి చేరాయి. బాదితులు కాకినాడలోని జీజీహెచ్ లో…
గుంటూరు జిల్లాలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. గుంటూరు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్మహ్మానాయుడు తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే జీవీపై ఆరోపణలు చేశారు. జీవీ స్వచ్చంధ సంస్థకు ఎన్నారై నిధులు వస్తున్నాయని ఆరోపించారు. దీనిపై జీవీ ఘాటుగా స్ఫందించారు. తన సంస్థకు ఎలాంటి ఎన్నారై నిధులు రావడంలేదని తాను కొటప్పకొండలో ప్రమాణం చేస్తానని అన్నారు. జీవీ ప్రమాణంపై పోలీసులు స్పందించారు. ప్రస్తుతం 144 సెక్షన్ అమలులో ఉందని, ఎవరూ కూడా బయటకు వెళ్లేందుకు వీలులేదని జీవీకి…
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై సెటైర్లు వేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్.. ఓటుకు నోటు కేసులో భయపడి అప్పట్లో హైదరాబాద్ నుంచి విజయవాడకు పారిపోయి వచ్చారని.. సినిమా డైరెక్టర్లను తీసుకువచ్చి విఠాలాచార్య అట్టముక్కలు, గ్రాఫిక్స్ లు ప్రజలకు చూపించిన వ్యక్తి చంద్రబాబేన్న ఆయన.. ఇక్కడ ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించడంతో.. మళ్లీ హైదరాబాద్ కు పారిపోయారని ఎద్దేవా చేశారు.. ఇక, కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నం చేశారు.. ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే కుట్రలు…
కరోనా కష్టకాలం కనీసం మానవత్వాన్ని చూపకుండా.. అందినకాడికి దండుకునే దందా కొనసాగిస్తున్నాయి ప్రైవేట్ ఆస్పత్రులు.. అయితే, ప్రైవేట్ ఆస్పత్రుల కోవిడ్ దందాపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయ్యింది.. తప్పిదాలకు పాల్పడిన ప్రైవేట్ ఆస్పత్రులపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు సిద్ధమవుతోంది.. ఈ వ్యవహారంపై మీడియాతో మాట్లాడిన ఏపీ వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్.. ఇప్పటికే నిబంధనలు పాటించని చాలా ఆస్పత్రులపై చర్యలు తీసుకున్నాం.. ఫైన్లు కూడా వేశామన్నారు.. కోవిడ్ పేషంట్ల నుంచి ఎక్కువ డబ్బులు…
కరోనా కల్లోలం సృష్టిస్తున్న సమయంలో.. ఓవైపు ప్రైవేట్ ఆస్పత్రులు కరోనా బాధితులను పట్టిపీడిస్తున్నాయి.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్లు కూడా దొరకని పరిస్థితి.. అప్పుడే.. అందరికీ నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య కనబడ్డాడు.. ఆయన తయారు చేసిన కరోనా మందును వేలాది మంది తీసుకున్నారు. కానీ, దీనిపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.. ఓవైపు ఇంకా అధ్యయనం కొనసాగుతూనే ఉంది.. మరోవైపు.. ఆనందయ్య ఇచ్చిన మందు తీసుకున్నవారు చాలా మంది ఇతర అనారోగ్య సమస్యల బారినపడినట్టు…
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి.. తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 84,224 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 16,167 మందికి పాజిటివ్గా తేలింది.. అయితే, మరోసారి మృతుల సంఖ్య వంద దాటింది.. తాజాగా 104 మంది కరోనాతో మృతిచెందారు.. చిత్తూరులో 14, పశ్చిమ గోదావరిలో 13, విశాఖలో 11, అనంతపూర్లో తొమ్మి ది, నెల్లూరులో తొమ్మి ది, గుంటూరు లో ఎనిమిది, విజయనగరం లో ఎనిమిది, ప్రకాశం లో ఏడుగురు, తూర్పు…
కరోనా వైరస్తో ఇప్పుడు పరీక్షలు వాయిదా వేసినా.. పరిస్థితి అనుకూలించిన తర్వాత టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించడం తప్పనిసరి అన్నారు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.. జూన్ 7వ తేదీ నుంచి జరగాల్సిన 10వ తరగతి పరీక్షలను వాయిదా వేయాల్సిందిగా సీఎం వైఎస్ జగన్ ఆదేశించారన్న ఆయన.. ఇంటర్ పరీక్షలపై కూడా నిర్ణయం తీసుకుంటామన్నారు.. అయితే, టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించడం తప్పనిసరి అని స్పష్టం చేశారు.. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకుంటున్నామని…
జూన్ మొదటి వారంలోగా ఆంధ్రప్రదేశ్లో 42 ఆక్సిజన్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తామని ఏపీ హైకోర్టుకు తెలిపింది కేంద్ర ప్రభుత్వం.. కోవిడ్ కేసులపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది.. అయితే, నోడల్ ఆఫీసర్లు ఉన్నా ఆసుపత్రుల్లో పట్టించుకోని పరిస్థితి నెలకొందన్న పిటిషన్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.. ఇక, బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్ల కొరత ఉందని.. ఇప్పటి వరకు 4 వేల ఇంజక్షన్లు రాష్ట్రానికి వచ్చాయని, మరిన్ని కొనుగోలుకి సిద్ధంగా దరఖాస్తు చేశామని కోర్టుకు విన్నవించింది ప్రభుత్వం. గ్రామ…