దేశంలో ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా పెరిగిన ధరలతో ఏపీలోని గుంటూరులో పెట్రోల్ ధర సెంచరీ దాటేసింది. గుంటూరులో ప్రస్తుతం లీటరు పెట్రోల్ ధర రూ. 100.06 కు చేరింది. నిత్యం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యులు, వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే ఇంధన ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ఇంకా పెరుగుతూ పోతుండడంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు.
ఏపీలో అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా.. మరో రెండు, మూడు జిల్లాల్లో మాత్రం అదుపులోకి రావడం లేదు.. అందులో చిత్తూరు జిల్లా ఒకటి.. దీంతో.. జిల్లాలో జూన్ 15వ తేదీ వరకు కర్ఫ్యూ అమలు చేయాలని నిర్ణయించారు.. తిరుపతి వెటర్నరీ యూనివర్సిటీ లో కోవిడ్ నియంత్రణపై మీడియాతో మాట్లాడారు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మేకపాటి గౌతం రెడ్డి, నారాయణస్వామి.. చిత్తూరు జిల్లాలో కర్ఫ్యూ ఆంక్షలు మరింత కఠినతరం చేస్తున్నట్టు ప్రకటించారు పెద్దిరెడ్డి.. ఉదయం 6…
మరో రెండు వారాల పాటు కర్ఫ్యూ పొడిగించే ఆలోచనలో ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఈ నెల 31వ తేదీన రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులపై సమీక్ష నిర్వమించనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఈ సమీక్షా సమావేశంలోనే కర్ఫ్యూ పొడగింపుపై నిర్ణయం తీసుకుంటారు. కొన్ని రోజులుగా ఉభయగోదావరి, చిత్తూరు జిల్లాలు మినహా మిగతా జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి.. మే 31 తర్వాత క్రమంగా కొన్ని మినహాయింపులు ఇవ్వడం లేదా యథాస్థితిని కొనసాగించడమా? అనే దానిపై సోమవారం…
కరోనా మందు కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్యకు ఎంత పేరు తెచ్చిందో.. అన్ని చిక్కులు కూడా తెచ్చిపెట్టింది.. ఆయన తయారు చేస్తున్న కరోనా మందుపై తేల్చేపనిలో ఉన్న ప్రభుత్వం.. అదే సమయంలో.. ఆయనకు భద్రత కల్పించి.. ఇంటి నుంచి తీసుకెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేయడంతో శుక్రవారం.. ఆయనకు కృష్ణపట్నం తీసుకొచ్చిన పోలీసులు.. మళ్లీ అజ్ఞాతంలోకి తరలించారు.. అయితే, వారం రోజుల తర్వాత తన ఇంటికి వచ్చిన ఆనందయ్య.. తాను ఎక్కడికీ పోనని ఇక్కడే ఉంటానని చెప్పారు..…
కరోనా మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పో్యి అనాథలుగా మారిన చిన్నారులను ఆదుకోవడానికి ప్రత్యేక చర్యలు చేపట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. వారి పేర్లతో రూ.10 లక్షల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని నిర్ణయం తీసుకుంది.. ఇక, అందులో భాగంగా.. కోవిడ్ కారణంగా తల్లిదండ్రులు మరణించి అనాథలైన చిన్నారులను ఇప్పటి వరకు 78 మందిని గుర్తించారు అధికారులు.. వారిలో ఇప్పటికే 10 మంది పేర్లపై రూ.10 లక్షల చొప్పున డిపాజిట్ కూడా చేశారు.. ఇవాళ కరోనా పరిస్థితులపై సమీక్ష నిర్వహించిన…
ఆంధ్రప్రదేశ్లో కరోనా కట్టడి కోసం కర్ఫ్యూను కఠినంగా అమలు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.. ఈ నెలాఖరు వరకు రాష్ట్రంలో కర్ఫ్యూ కొనసాగనుంది.. ఈ నెల 5వ తేదీన ఏపీలో కర్ఫ్యూ ప్రారంభించగా.. కొత్త కేసులు కంట్రోల్ కాకపోవడంతో.. కర్ఫ్యూను మరింత టైట్ గా అమలు చేస్తున్నాయి. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో కేసుల తీవ్రతను బట్టి లాక్డౌన్ కూడా అమలు చేస్తున్నారు.. తాజాగా, కరోనా కేసుల కట్టడికి అనంతపురం జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ కీలక నిర్ణయం తీసుకుంది……
కోరోనా మహమ్మారిపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష ముగిసింది… నెల్లూరు కృష్ణపట్నంలో ఆనందయ్య మందు పంపిణీపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది.. ఆ మందుపై ఆయుష్ కమిషనర్ రాములు వివరాలు తెలియజేశారు.. ఇప్పటికే ఆనందయ్య మందు పరీక్షలకు సంబంధించి పలు నివేదికలు వచ్చాయన్న ఆయన.. రేపు చివరి నివేదిక రానుందన్నారు.. నివేదికలను అధ్యయన కమిటీ చూసి మరోసారి పరిశీలిస్తుందని స్పష్టం చేశారు.. ఇక, కేంద్రం సంస్థ సీసీఆర్ఏ అధ్యయన నివేదిక కూడా రేపు వచ్చే అవకాశం…
‘యాస్’ అతి తీవ్ర తుఫాను బలహీనపడగా మిగిలి ఉన్న భాగం తీవ్ర అల్పపీడనంగా తూర్పు ఉత్తర ప్రదేశ్ ఈ యొక్క తూర్పు ప్రాంతాలు మరియు దానిని ఆనుకుని ఉన్న బీహార్ ప్రాంతంలో విస్తరించి ఉంది. ఇది రాగల 12 గంటలలో బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం : ఈరోజు ఉత్తర కోస్తాఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండుచోట్ల కురిసే అవకాశం ఉంది. మరియు…
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు తగ్గుతున్నాయి. తాజాగా ఏపీ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో ఏపీలో కొత్తగా 14,429 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 16,57,986 కు చేరింది. ఇందులో 14,66,990 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా 1,80,362 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా కారణంగా 103 మంది…