కరోనా కల్లోలం సృష్టిస్తున్న సమయంలో.. ఓవైపు ప్రైవేట్ ఆస్పత్రులు కరోనా బాధితులను పట్టిపీడిస్తున్నాయి.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్లు కూడా దొరకని పరిస్థితి.. అప్పుడే.. అందరికీ నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య కనబడ్డాడు.. ఆయన తయారు చేసిన కరోనా మందును వేలాది మంది తీసుకున్నారు. కానీ, దీనిపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.. ఓవైపు ఇంకా అధ్యయనం కొనసాగుతూనే ఉంది.. మరోవైపు.. ఆనందయ్య ఇచ్చిన మందు తీసుకున్నవారు చాలా మంది ఇతర అనారోగ్య సమస్యల బారినపడినట్టు ప్రచారం జరగుతోంది.. అందులో 88 మంది నెల్లూరులోని జీజీహెచ్ లో చికిత్స పొందుతున్నారని చెబుతున్నారు. అయితే, దీనిపై జీజీహెచ్ కోవిడ్ నోడల్ ఆఫీసర్ నరేంద్ర కాస్త క్లారిటీ ఇచ్చారు..
జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న 88 మంది ఆనందయ్య మందు వాడి ఉండొచ్చు అని వ్యాఖ్యానించిన నోడల్ ఆఫీసర్ నరేంద్ర…. అయితే, వాళ్లంతా ఆనందయ్య మందు వాడారని ఖచ్చితంగా చెప్పలేం అన్నారు.. కానీ, గుచ్చిగుచ్చి అడిగితే కొందరు చెబుతున్నారు.. మరికొందరు చెప్పడం లేదని తెలిపారు.. ఇక, వీరిలో కొందరికి స్వల్పంగా కంటి సమస్యలు వచ్చి తగ్గిపోయాయని.. ప్రస్తుతం ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేదన్న ఆయన.. ఆనందయ్య మందు వాడినవాళ్లు ఎవరూ జీజీహెచ్‌లో చనిపోలేదని స్పష్టం చేశారు. మరోవైపు.. కోటయ్య ఆరోగ్యం నిలకడగా ఉంది. చికిత్సకు రెస్పాండ్ అవుతున్నారు.. ఆయనలోని కంటి సమస్య తొలగిపోయినట్టు వెల్లడించారు నరేద్రం.