టెన్త్, ఇంటర్ పరీక్షలు తప్పనిసరి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా వైరస్‌తో ఇప్పుడు పరీక్షలు వాయిదా వేసినా.. పరిస్థితి అనుకూలించిన తర్వాత టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించడం తప్పనిసరి అన్నారు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.. జూన్ 7వ తేదీ నుంచి జరగాల్సిన 10వ తరగతి పరీక్షలను వాయిదా వేయాల్సిందిగా సీఎం వైఎస్ జగన్ ఆదేశించారన్న ఆయన.. ఇంటర్ పరీక్షలపై కూడా నిర్ణయం తీసుకుంటామన్నారు.. అయితే, టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించడం తప్పనిసరి అని స్పష్టం చేశారు.. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకుంటున్నామని తెలిపిన మంత్రి.. ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని కేంద్రం కూడా సంప్రదింపులు చేస్తోందని… ఈ పరీక్షల్లో వచ్చే మార్కులు రేపటి విద్యార్థి భవిష్యత్తుకు చాలా అవసరం అన్నారు. ఇక, చాలా మంది తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సంఘాలు కూడా పరీక్షలు నిర్వహించాలని సూచించాయన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్.. జేఈఈ, నీట్ వంటి పరీక్షలతో పాటు రాష్ట్రంలో నిర్వహించే ఎంట్రెన్స్ టెస్టులకూ మార్కులు అవసరం అని.. మనుగడ కోసం విమర్శలు చేయడం తప్ప వాళ్ళకి పిల్లల భవిష్యత్తుపై శ్రద్ధ లేదని మండిపడ్డారు.. రాజకీయాలు చేయడం ఆపి పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలని ప్రతిపక్షాలకు హితవు పలికారు మంత్రి సురేష్.
Also Read
తాజావార్తలు
-
El Nino: 150ఏళ్లలో తొలిసారి.. మహా విధ్వంసం తప్పదు! భయపెడుతున్న సైంటిస్టుల అంచనా
-
Star Daughters Debut : కొడుకుల టాస్క్ ఫినీష్.. ఇప్పుడు కూతుళ్ల వంతు
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
Leonardo DiCaprio: ఒక్క టిప్‌తో వెయిటర్ జీవితాన్ని మార్చిన ‘టైటానిక్’ హీరో… కన్నీళ్ళు పెట్టించిన ఉదారత
-
Vivo T5 Lite: వివో T5 లైట్ 44W 5G ఫోన్ రిలీజ్.. 6500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే, MediaTek Dimensity 6300 ప్రాసెసర్
ట్రెండింగ్
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్‌ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!