బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తుఫాన్ యాస్‌గా మారింది. ఇది ఇప్పుడు తూర్పు మద్య బంగాళాఖాతంలో తీవ్రమైన తుఫాన్‌గా మారింది. 9 కి.మీ వేగంతో కదులుతూ మరింత బలపడుతున్నది. అతి కొద్ది గంటల్లో ఈ యాస్ తుఫాన్ అతి తీవ్రమైన తుఫాన్‌గా మారి బెంగాల్ ఒడిశా తీరాలవైపు దూసుకుపోయో అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ పేర్కొన్నది. పారాదీప్‌కు 360 కీలోమీటర్లు, డిగాకు 450 కి.మీ దూరంలో ఈ యాస్ తుఫాన్ కేంద్రీకృతమైంది. దీంతో ఒడిశా బెంగాల్‌కు ఆరెంజ్…
వైసీపీ రెబల్ నేత, ఎంపీ రఘురామకృష్ణంరాజు సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి కమాండర్‌కు లేఖ రాశారు… పెయిన్ కిల్లర్స్, యాంటీ బయాటిక్స్ వాడుతున్నా.. అయినా, నా కాలి నొప్పి ఇంకా తగ్గలేదన్న ఆయన.. బీపీలో కూడా హెచ్చుతగ్గుదల కనిపిస్తోందని.. నోరు కూడా తరచుగా పొడారిపోతోందని లేఖలో పేర్కొన్నారు.. రెండు, మూడు రోజులు ఆస్పత్రిలోనే.. డాక్టర్ల పర్యవేక్షణలో తనకు చికిత్స అందించాలని కోరిన ఎంపీ… అయినా మీరు డిశ్చార్జ్ చేయాలనుకుంటే.. డిశ్చార్జ్ సమ్మరీలో నా ఆరోగ్య పరిస్థితిని స్పష్టంగా తెలియజేయాలని…
అనందయ్య విషయంలో సీఎం వైఎస్ జగన్‌పై మెడికల్ మాఫియా ఒత్తిడి చేస్తుందనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయన్నారు మాజీ ఎంపీ హర్షకుమార్.. ఇక, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మరణాల సంఖ్యను దాచిపెట్టడం సరికాదని హితవు పలికిన ఆయన.. ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో బులిటెన్ ప్రకారం 13 మంది చనిపోయినట్లు చూపించారు.. అదేరోజు జిల్లాలో 200 మందికి పైగా కోవిడ్ తో చనిపోయారని ఆరోపించారు.. ప్రస్తుతం ప్రజలు కరోనా గురించి భయపడటం లేదన్న ఆయన.. అమెరికాలో కరోనాతో చనిపోయిన…
నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య ఇచ్చే మందు వల్ల హాని లేదని ఆయుష్ డైరెక్టర్ రాములు అధికారికంగా ప్రకటించారు. ఆనందయ్య ఆ మందు తయారీలో 18 మూలికలను ఉపయోగిస్తున్నారని, వాటిని దగ్గరుండి పరీక్షించి నిర్ధారించుకున్నామని ఆయన చెప్పారు. అవన్నీ ఇంట్లోనూ మనచుట్టూ దొరికేవేననీ, అయితే వాటి మిశ్రమంలో వచ్చే ప్రభావం ఏమిటో మాత్రం అధ్యయనం చేయాలని తెలిపారు. ఇక, దాన్ని ఆయుర్వేద ఔషధంగా పరిగణించలేమని, అందుకు సంబంధించిన యాభై గ్రంథాల్లో ఈప్రసక్తి లేకపోవడం ఇందుకు కారణమని స్పష్టం…
కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందు కోసం న్యాయపోరాటానికే దిగేవారి సంఖ్య కూడా పెరిగిపోతోంది.. ఇప్పటికే ఆనందయ్యకు వ్యతిరేకంగా కొంత.. అనుకూలంగా చాలా వరకు సోషల్ మీడియాలో మద్దతు లభిస్తుండగా.. వెంటనే ఆనందయ్య తయారు చేసిన కరోనా మందు పంపిణీ చేయాలంటూ.. అనంతపురానికి చెందిన ఓ వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు.. మరోవైపు.. ఆ మందు పంపిణీపై హైకోర్టులో మరో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది.. కరోనా బాధితులకు వెంటనే మందు పంపిణీ జరిగేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ పేర్కొన్నాడు..…
కరోనా విజృంభణ కొనసాగుతోన్న సమయంలో.. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య తయారు చేసిన ఆయుర్వేద మందు.. ఎంతోమంది కరోనా రోగులను నయం చేసింది.. దీంతో.. క్రమంగా అటు పరుగులు పెట్టారు జనం.. అయితే, ఎప్పుడైతే.. దానిపై పూర్తిస్థాయిలో అధ్యయనం మొదలైందో.. అప్పటి నుంచి మందు పంపిణీ నిలిచిపోయింది.. ఇక, ఆనందయ్య ఆయుర్వేద మందుపై ఆయుష్ పరిశోధన చేస్తున్న విషయం తెలిసిందే కాగా.. ఆయుష్ కమిషనర్ రాములు… ఇవాళ ఆనందయ్య మందుపై నివేదికను ఏపీ సీఎం వైఎస్…
జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాల పనులను అధికారులు వేగవంతం చేయాలని ఆదేశించారు ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి… కడప జిల్లా రాయచోటి మండలం నారాయణరెడ్డిగారిపల్లెలో వైస్సార్ జగనన్న కాలనీని సందర్శించిన ఆయన.. ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించి.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాల పనులను వేగవంతం చేయాలన్నారు.. వాటితో పాటు త్వరితగతిన ఇసుక డంప్ ను ఏర్పాటు చేయాలన్న ఆయన.. యుద్ధప్రాతిపదికన…
ఏపీలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలమే సృష్టిస్తోంది. అయితే ఈరోజు కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కోవిడ్ బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రంలో 58,835 శాంపిల్స్ పరీక్షించగా 12,994 మందికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. 24 గంటల్లోనే కోవిడ్‌తో 96 మంది మృతి చెందడం కలకలం రేపుతోంది. ఇదే సమయంలో 18,373 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య…
కరోనా విజృంభిస్తోన్న సమయంలో.. ఆనందయ్య కరోనా మందు పంపిణీ చేయడం.. దానిపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేపట్టడంతో.. మందు తయారీ, పంపిణీ ఆగిపోయాయి.. అయితే, చాలా మంది ఆనందయ్యకు సపోర్ట్ చేస్తున్నారు.. ప్రభుత్వం వెంటనే ఆనందయ్యతో మందు పంపిణీ చేయించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.. మరోవైపు.. ఆనందయ్య ఆయుర్వేద మందు కొనసాగించాలని కోరుతూ.. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు అయ్యింది… అనంతపురానికి చెందిన ఉమా మహేశ్వర నాయుడు అనే వ్యక్తి తరపున పిటిషన్ దాఖలు చేశారు…
కరోనా కట్టడి కోసం ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది… ప్రతి గ్రామ పంచాయతీలో కోవిడ్ ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి… పాఠశాలలు, వసతి గృహాలు, ఇతర భవనాల్లో ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్న ఆయన.. వాటి గుర్తింపు బాధ్యత పంచాయతీ కార్యదర్శులకు అప్పగించినట్టు తెలిపారు. ఇక, ఐసోలేషన్ కేంద్రాల నిర్వహణ బాధ్యత సర్పంచులదేనని స్పష్టం చేసిన మంత్రి.. ఆయా గ్రామాల్లో కరోనా కేసుల…