కరోనా సమయంలో చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. చిన్న చిన్న వ్యాపారులు వ్యాపారాలు లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వీరిని ఆదుకోవడానికి సీఎం… జగనన్న తోడు పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకం కింద చిరు వ్యాపారులను అదుకోబోతున్నారు. చిరువ్యాపారులకు రూ.10వేల రూపాయల వడ్డీలేని రుణాలను మంజూరు చేయబోతున్నారు. తాడెపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి 11 గంటలకు వర్చువల్ విధానంలో నగదును బదిలీ చేయనున్నారు. ఈ పథకం ద్వారా 3.7 లక్షల మంది చిరువ్యాపారులకు లబ్ది చేకూరబోతున్నది.…
రాష్ట్రంలో పేదల కోసం ప్రభుత్వం ఇళ్లను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇళ్ల నిర్మాణం కోసం ఇప్పటికే పేదలకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేసింది. ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో ఇళ్లు నిర్మించుకోలేని వారికి ప్రభుత్వమే పక్కాగా ఇళ్లను నిర్మించి ఇచ్చేందుకు సిద్దమైన విషయం తెలిసిందే. ఇటీవలే దీనికి సంబందించిన కార్యక్రమం అధికారికంగా ప్రారంభించారు. ఇక ఇదిలా ఉంటే, సీఎం వైఎస్ జగన్ ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆ…
ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్ల (జూడా) సంఘం బుధవారం నుంచి విధుల బహిష్కరణకు పిలుపునిచ్చింది. తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ రేపటి నుంచి నాన్ కోవిడ్ విధులను బహిష్కరిస్తామని పేర్కొంది. ఫ్రంట్ లైన్ వారియర్లందరికీ ఆరోగ్య బీమా కల్పించాలని, కోవిడ్ ప్రోత్సాహకం ఇవ్వాలని, ఆసుపత్రుల్లో భద్రతా ప్రమాణాలు పెంచాలని డిమాండ్ చేస్తూరాష్ట్ర వైద్య విద్య సంచాలకుడికి సమ్మె నోటీసు పంపించింది.
కరోనా కష్టకాలంలో ప్రభుత్వ ఆదాయం పడిపోయినా.. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే ఉంది ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్.. మంగళవారం రోజు జగనన్న తోడు పథకం కింద నగదు జమ చేయనున్నారు.. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో నగదు బదిలీని ప్రారంభించనున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఈ పథకం ద్వారా చిరు వ్యాపారులకు రూ.10 వేల వరకు వడ్డీ లేని రుణాలు అందించనున్నారు.. వరసగా రెండో ఏడాది…
సమ్మెకు సిద్ధం అవుతున్నారు సీనియర్, జూనియర్ రెసిడెంట్ వైద్యులు… ఈ మేరకు ఏపీ సర్కార్కు సమ్మె నోటీసులు ఇచ్చారు… ఈనెల 9వ తేదీ నుంచి విధులు బహిష్కరించాలని జూనియర్ రెసిడెంట్ వైద్యులు నిర్ణయించారు.. ఆరోగ్య బీమా, పరిహారం కల్పించాలని కోరుతున్న వైద్యులు.. జూనియర్ రెసిడెంట్ డాక్టర్లకు కోవిడ్ ప్రోత్సాహకాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.. ఆస్పత్రుల్లో భద్రతా ఏర్పాట్లు మరింత పెంచాలని కూడా మరో డిమాండ్ ఉంది.. స్టైఫండులో టీడీఎస్ కట్ చేయకూడదని కోరుతున్న వైద్యులు.. ఈ నెల…
ఋతుపవనాలు తెలంగాణా, ఆంధ్రా రాష్ట్రలలో మెదక్, నల్గొండ, రెంటచింతల, శ్రీహరికోట వరకు (నిన్న) 6వ.తేదీన ప్రవేశించినవి. నిన్నటి నైరుతి ఋతుపవనాలు మధ్య ప్రదశ్ నుండి మరత్ వాడ , తెలంగాణ, రాయలసీమ మీదగా ఉత్తర తమిళనాడు వరకు ఉన్న ఉపరితల ద్రోణి ఈ రోజు బలహీన పడినది. ఈ రోజు ఉపరితల ద్రోణి, మరత్వాడ నుండి ఉత్తరా ఇంటీరియర్ కర్ణాటక వరకు సముద్ర మట్టానికి 1.5కి మి వరకు వ్యాపించింది. అల్పపీడనం సుమారుగా 11వ తేదీన ఉత్తర…
ఏపీలో కరోనా కేసులు భారీగా నమోదవుతుండటంతో ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. ఆ కర్ఫ్యూ కారణంగా కేసులు తగ్గుముఖం పట్టడంతో దానిని కొనసాగిస్తూ వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కర్ఫ్యూను పొడిగించింది. ఈరోజు సీఎం వైఎస్ జగన్ కోవిడ్ పై నిర్వహించిన సమీక్షలో… స్వల్ప మార్పులు చేస్తూ జూన్ 20 వరకు కర్ఫ్యూను పొడిగించారు. అయితే జూన్10 తర్వాత ఉదయం 6 గంటలనుంచి మధ్యాహ్నం 2 గంటవరకూ కర్ఫ్యూ సమయంలో సడలింపు చేసారు. ఇక ప్రభుత్వ కార్యాలయాల పనిదినాల్లో…
ఆనందయ్య మందును పంపిణీ చేసేందుకు ఏపీ హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తక్షణమే కరోనా బాదితులకు మందును పంపిణీ చేయాలని ఆదేశించింది. ఇక కంటి చుక్కల మందుపై రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 21 వ తేదీకి వాయిదా వేసింది హైకోర్ట్. ఇక ఇదిలా ఉంటే, ఇప్పటికే ఆనందయ్య మందును ఈరోజు నుంచి పంపిణీ చేస్తున్నారు. మొదటగా సర్వేపల్లి నియోజక వర్గంలోని ప్రజలకు అందించబోతున్నారు. ఆ…
విశాఖలో వెలుగు చూసిన ఎక్సయిజ్ స్కామ్ పై ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. నేడు అన్ని జిల్లాలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాలను ఏకకాలంలో ఫిజికల్ వెరైఫికేషన్ చేయనున్నారు అధికారులు. సర్కిల్-4 పరిధిలో నాలుగు షాపుల్లో 33లక్షలు మాయం చేసిన విషయం తెలిసిందే. సిఐ ప్రమేయంతో ప్రభుత్వ సొమ్మును పక్కదారి పట్టించారు సిబ్బంది. ఇప్పటికే సిఐను విధుల నుంచి తప్పించిన అధికారులు… 12మంది వైన్ షాప్ సిబ్బందికి నోటీసులు ఇచ్చారు. గోల్ మాల్ అయిన నగదు…