ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు ఢీల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కాబోతున్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబందించిన నిధులు, పెండింగ్‌లో ఉన్న అంశాలపైన, విభజన చట్టంలో అమలు చేయాల్సిన హామీల పైన సీఎం వైఎస్ జగన్ కేంద్ర మంత్రి షాతో చర్చించబోతున్నారు. షాతో భేటీ తరువాత ఢిల్లీలో అందుబాటులో ఉన్న కేంద్రమంత్రులతో కూడా సీఎం వైఎస్ జగన్ సమావేశం అయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. కరోనా కారణంగా పోలవరం…
ఏపీ ప్రైవేటు పాఠశాలల సంఘం జాతీయ విద్యావిధానంపై నిర్వహించిన వర్చువల్ సమావేశంలో సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ మాతృభాష ప్రాముఖ్యతపై మాట్లాడారు. భావ వ్యక్తీకరణకు మాతృభాషపై పట్టు ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీ ప్రభుత్వం కొత్తగా సీబీఎస్ఈ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. దీన్ని అమలు చేయాలంటే పాఠశాలల్లో కొన్ని ప్రమాణాలు ఉండాలి. ఇందుకోసం సహకార వ్యవస్థలా మారాలి. ఈ విధానంలో వసతులు ఎక్కడ ఉన్నా వాటిని వినియోగించుకునే వెసులుబాటు ఉంటుంది అని సూచించారు.…
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను ఆయిల్ కంపెనీలు మరోసారి పెంచాయి. రోజురోజుకు పెరుగుతున్న రేటుతో పెట్రోల్ బంకుకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా పెట్రోల్‌పై 27 పైసలు, డీజిల్‌పై 28 పైసలు చొప్పున పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ ధరలు సెంచరీ మార్క్ దాటి దూసుకెళ్తున్నాయి. ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.100.98, డీజిల్ రూ.92.99కు పెరిగింది. ఆంధ్రప్రదేశ్ విజయవాడలో పెట్రోల్ ధర రూ.101.52 గా ఉండగా.. డీజిల్ రూ. 95.91…
ఏపీ రాష్ట్రంలో నేటి నుంచి జూనియర్ డాక్టర్లు సమ్మె బాట పట్టనున్నారు. తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఏపీ జూనియర్ డాక్టర్లు (జూడా) సంఘం నేటి నుంచి విధుల బహిష్కరణకు పిలుపునిచ్చింది. ఫ్రంట్‌లైన్ వారియర్లందరికీ ఆరోగ్య బీమా కల్పించాలని, కొవిడ్ ప్రోత్సాహకం ఇవ్వాలని, ఆసుపత్రుల్లో భద్రతా ప్రమాణాలు పెంచాలని డిమాండు చేస్తున్నారు. కాగా ప్రభుత్వంతో జూడాలు రెండు సార్లు జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. నేడు మరోసారి ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. ఈరోజు ఆరోగ్య మంత్రి,…
తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ… భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన తిరుమలకు రావడం ఇదే తొలిసారి.. ఆయన షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 10వ తేదీన తిరుమలకు రానున్నారు.. రాత్రికే అక్కడే బసచేసి.. 11వ తేదీన శ్రీవారిని దర్శించుకోనున్నారు.. ఆ తర్వాత ఢిల్లీకి తిరుగుప్రయాణం కానున్నారు ఎన్వీ రమణ.. కాగా, ఆయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా నియమితులైన తర్వాత కూడా తిరుమలకు వచ్చి శ్రీ వెంకటేశ్వరుని…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్యులకు శుభవార్త చెప్పింది… మెడికల్ కళాశాలలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలందిస్తున్న సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు, పీజీలకు, రెసిడెంట్ స్పెషలిస్టులకు గౌరవ వేతనం పెంచుతూ నిర్ణయం తీసుకుంది.. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఏపీ వైద్యారోగ్యశాఖ… ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం… సీనియర్ రెసిడెంట్ వైద్యులకు రూ. 70 వేలు , రెసిడెంట్ డెంటిస్టులకు రూ. 65 వేలు, రెసిడెంట్ సూపర్ స్పెషలిస్టులకు రూ. 85 వేల మేర వేతనం పెంచుతూ నిర్ణయం తీసుకుంది……
గ్రామ పంచాయతీల్లో అక్రమ లేఅవుట్లను గుర్తించాల్సిందిగా అధికారులను ఆదేశించారు ఏపీ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి… జగనన్న స్వచ్ఛసంకల్పం, గ్రామపంచాయతీల పరిధిలో లేఅవుట్లపై సమీక్ష నిర్వహించిన ఆయన… ఈ సందర్భంగా మాట్లాడుతూ… గ్రామ పంచాయతీల్లో అక్రమ లేఅవుట్లను గుర్తించాలని… ప్రభుత్వపరంగా వాటి క్రమబద్దీకరణకు చర్యలు తీసుకోవాలని.. అనుమతి లేని లేఅవుట్ల రెగ్యులరైజ్ తో ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుందని స్పష్టం చేశారు.. ఇక, జగనన్న స్వచ్ఛసంకల్ప్ ద్వారా ఆరోగ్యవంతమైన గ్రామాణాలుగా తీర్చిదిద్దాలన్న ఆయన.. పారిశుధ్యం, గ్రామాల్లో…
గంగవరం పోర్టులోని ప్రభుత్వ వాటాలను తమకు అప్పగించాల్సిందిగా ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది అదానీ గ్రూప్.. దీనిపై అధ్యయనానికి ఉన్నతస్థాయిలో అధికారులతో కమిటీ కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం.. దీంతో.. గంగవరం పోర్టు శాశ్వతంగా అదానీ గ్రూప్‌కు వెళ్లిపోతుందనే ప్రచారం ఊపందుకుంది.. దీనిపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి.. గంగవరం పోర్టు శాశ్వతంగా అదానీ సంస్థకు వెళ్లి పోతుందన్నది అవాస్తవం అన్నారు.. గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం అప్పటి నుంచి…
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో మహిళలకు గౌరవం లేదు, రక్షణలేదు, సంక్షేమ పథకాలు కూడా లేవని విమర్శించారు వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ ఆర్కే రోజా… వైఎస్ జగన్ రెండేళ్ల పాలనపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆమె… వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాతే మహిళలకు భద్రత కల్పించారు, రాజకీయంగా ప్రాధాన్యత ఇచ్చారు.. కానీ, చంద్రబాబు వ్యాఖ్యలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు.. ఆయనకు చిన్నమెదడు చితికిపోయిందా..? అని ప్రజలు అనుకుంటున్నారని సెటైర్లు వేశారు.. మరోవైపు.. ప్రతీ అంశంలో…
చిరువ్యాపారుల కోసం జగనన్న తోడు పథకాన్ని ప్రారంభించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కోసం రూ.370 కోట్ల రూపాయలను రిలీజ్ చేశారు. 3.7 లక్షల మందికి ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. చిరు వ్యాపారులకు బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని, గత్యంతరం లేక వ్యాపారులు అధిక వడ్డీకి రుణాలు తీసుకుంటున్నారనీ, వాటిని చెల్లించలేక పేదలు అష్టకష్టాలు పడుతున్నారని, వ్యవస్థలను పేదలకు ఉపయోగపడేలా తీసుకురావాలని, లేకపోతే ప్రభుత్వాలు విఫలం అయినట్టే అని…