Annamalai: బీజేపీతో అన్నామలైకి ఎక్కడ చెడింది, కారణాలేంటి.?
- బీజేపీకి రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్న అన్నామలై.
- ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో కీలక సమావేశాలు.
- పార్టీలో కొనసాగాలని ఒప్పించే ప్రయత్నాల్లో బీజేపీ నాయకత్వం.
- అన్నాడీఎంకే పొత్తుపై అసంతృప్తి ప్రధాన కారణమనే ప్రచారం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Annamalai: బీజేపీతో తెగదెంపులు చేసుకునేందుకే అన్నామలై సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆయన తన రాజీనామా ఇచ్చేందుకు మంగళవారం ఢిల్లీకి వెళ్లారు. ఇప్పటికే, జాతీయాధ్యక్షుడు నితిన్ నబీన్, అమిత్ షా, బీఎల్ సంతోష్ వంటి అగ్రనేతలతో భేటీ అయ్యారు. తన రాజీనామా ఇప్పటికే సమర్పించినట్లు వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు అన్నామలై పార్టీలో కొనసాగేలా ఒప్పించేందుకు బీజేపీ పెద్దలు ప్రయత్నిస్తున్నారు. బుధవారం వరకు ఆయన ఢిల్లీలోనే ఉండనున్నారు.
బీజేపీకి తమిళనాడులో ఆశాకిరణంగా కనిపించిన అన్నామలై, రాష్ట్రంలో పార్టీని పటిష్టం చేసేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. పాదయాత్రతో గ్రామాల నుంచి పట్టణాల వరకు బీజేపీకి ఊపు తెచ్చారు. అయితే, ఎన్నికల ముందు అగ్ర నాయకత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలతో అన్నామలై అసంతృప్తికి గురైనట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే సొంత పార్టీ ఏర్పాటు చేసి, రాజకీయాల్లో ముందుకు సాగాలని ఆయన నిర్ణయించుకున్నట్లు సమాచారం.
Also Read
- Mamata Banerjee: ‘‘ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నా’’.. బీజేపీపై మమత ఆగ్రహం..
- INDIA Bloc: ‘‘ఓట్ చోరీ’’పై ఇండీ కూటమి యాక్షన్ ప్లాన్..
- Central Cabinet Decision: అన్నదాతలకు గుడ్‌న్యూస్.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
- Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
అన్నాడీఎంకేతో పొత్తుతో అసంతృప్తి:
కర్ణాటక కేడర్ ఐపీఎస్ అధికారి అయిన అన్నామలై, ‘‘సింగం’’గా పేరు తెచ్చుకున్నారు. 2020లో బీజేపీలో చేరారు. అనతికాలంలోనే బీజేపీ తమిళనాడు అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు. ఈయన హాయాంలో బీజేపీ ఓట్ బ్యాంక్ గణనీయంగా పెరిగింది. కానీ, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకోవడంతోనే అన్నామలై అసంతృప్తికి గురయ్యారు. ఇదే సమయంలో, పొత్తులో భాగం కావాలంటే అన్నామలైని జాతీయాధ్యక్షుడి పదవి నుంచి తొలగించాలని ఎడప్పాడి పళనిస్వామి బీజేపీపై ఒత్తిడి తెచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే అన్నామలైని తొలగించి నైనార్ నాగేంద్రన్ను బీజేపీ తమిళనాడు అధ్యక్షుడిగా నియమించింది.
ఇంత చేసినా అన్నాడీఎంకే ఈ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. ఇదే కాకుండా బీజేపీ మొత్తం 234 సీట్లలో కేవలం ఒక స్థానం మాత్రమే సాధించింది. పార్టీ ఓటు శాతం కూడా గణనీయంగా తగ్గిపోయింది. ఇదే సమయంలో విజయ్ టీవీకే పార్టీ తమిళనాడు రాజకీయాల్లో ప్రధాన శక్తిగా అవతరించింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే అన్నామలై కొత్త పార్టీ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఆయన ఏర్పాటు చేసే కొత్త పార్టీ ద్రావిడ రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా, జాతీయవాద రాజకీయాలు చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
తాజావార్తలు
-
Mamata Banerjee: ‘‘ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నా’’.. బీజేపీపై మమత ఆగ్రహం..
-
Koffee With Karan: రెండు దశాబ్దాల సంచలనాలకు ఎండ్ కార్డ్.. ‘కాఫీ విత్ కరణ్’కు గుడ్‌బై చెప్పిన కరణ్!
-
El Nino Effect: ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన పూలు!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
LPG Subsidy: మీకు ఎల్పీజీ సబ్సిడీ రావడం లేదా..? అయితే రేపటి లోగా ఇలా చేయండి..
ట్రెండింగ్
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!