ఆంధ్రప్రదేశ్ క్రమంగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతూ వస్తున్నాయి.. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 4,250 పాజిటివ్ కేసులు నమోదు అయ్యియి.. మరో 33 మంది కరోనాతో మృతిచెందారు.. ఇదే సమయంలో 5,570 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. రాష్ట్రం నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 18,76,977కు చేరుకోగా… రికవరీ కేసులు సంఖ్య 18,19,605కు పెరిగింది.. ఇక, ఇప్పటి వరకు కోవిడ్ బారినపడి మృతిచెందినవారు 12,599 మంది కాగా.. ప్రస్తుతం 44,773 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది ప్రభుత్వం.. తాజా మరణాల విషయానికి వస్తే.. కృష్ణ జిల్లాలో ఎనిమిది మంది, చిత్తూరులో ఆరుగురు, తూర్పు గోదావరి, శ్రీకాకుళంలో నలుగురు చొప్పున, నెల్లూరులో ముగ్గురు, గుంటూరు, కర్నూల్‌లో ఇద్దరు చొప్పున, అనంతపురం, ప్రకాశం, విజయనగరం, పశ్చిమగోదావరిలో ఒక్కరు చొప్పున మరణించారు.. అత్యధికంగా తూర్పు గోదావరిలో 890 పాజిటివ్ కేసులు వెలుగుచూవాయి.