వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి తన సొంత జిల్లా.. కడప జిల్లాలో పర్యటించబోతున్నారు.. నేటి నుంచి రెండు రోజులు కడప జిల్లాలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన కొనసాగనుంది.. రేపు దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించనున్నారు జగన్..
మంత్రి సత్య ప్రసాద్ మాట్లాడుతూ.. బీసీలు అంటే బలం, చైతన్యం కలిగి ఉన్నారు.. బీసీలు అంటే ముందుండి నడిపించే వాళ్ళని నిరూపించిన ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీసీలకు పూర్వవైభవం వచ్చిందన్నారు. గత పాలకులు బీసీల ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీసేలా వ్యవహరించారు అని ఆరోపించారు.
Srisailam Project: శ్రీశైలం జలాశయాన్ని గేట్ల నిపుణుడు, రిటైర్డ్ ఇంజినీర్ కన్నయ్య నాయుడు ఈరోజు (జూలై 6) పరిశీలించారు. ఈ సందర్భంగా ఆనకట్ట రేడియల్ క్రస్ట్ గేట్ల పరిస్థితిని క్షుణ్ణంగా చెక్ చేశారు.
Minister Janardhan Reddy: పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి మిగులు జలాలను మాత్రమే వాడుకుంటున్నాం.. దీనిపై తెలంగాణ ప్రభుత్వం, స్థానిక పార్టీలు రాజకీయ లబ్ధి కోసమే నాటకాలు ఆడుతున్నారు అంటూ తీవ్రంగా మండిపడ్డారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక వసతులు కల్పిస్తూ.. కార్పోరేట్ పాఠశాలలకు దీటుగా తీర్చుదిద్దుతోంది ఏపీ ప్రభుత్వం. అయితే కొందరు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపిస్తూ అక్కడే క్వాలిటీ ఎడ్యుకేషన్ లభిస్తుందని భావిస్తున్నారు. ఇలాంటి అనుమానాలను పటాపంచలు చేస్తూ ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించి ఆదర్శంగా నిలిచారు. టీచర్ల చొరవపై ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేశాడు. Also Read:Love: వరుసకు అన్నాచెల్లెళ్ళు.. అయినా…
ఆ యువతికి రెండేళ్ల క్రితమే పెళ్లైంది. భర్తను విడిచిపెట్టి తల్లిదండ్రులతో ఉంటుంది. ఈ క్రమంలో వరుసకు అన్న అయే వ్యక్తితో ప్రేమలో పడింది. చివరకు ఇరుకుటుంబాల్లో వీరి వ్యవహారం తెలిసిపోయింది. ఏడాదిగా వీరిద్దరు ప్రేమించుకుంటున్నా వరుసకు అన్నాచెల్లెళ్లు కావటంతో పెళ్లికి ఒప్పుకోలేదు తల్లిదండ్రులు. దీంతో ప్రేమ జంట ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అక్కపల్లె సమీపంలో చోటుచేసుకుంది. మృతి చెందిన ప్రేమికులది నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం మాధవరంగా గుర్తించారు.…