ఏపీలో విద్యా వ్యవస్థపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు.. రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందనడానికి ఏపీఈసెట్ అడ్మిషన్లే పెద్ద ఉదాహరణ అని విమర్శించారు. ఈసెట్ రిజల్ట్స్ వచ్చి దాదాపు 45 రోజులు అవుతున్నా ఇప్పటికీ కౌన్సిలింగ్ ప్రారంభం కాలేదన్నారు.
ఇంద్రకీలాద్రిపై కొలువైన కనక దుర్గ అమ్మవారిని దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణరెడ్డి దర్శించుకున్నారు. ఆషాడ మాసాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ వారి ఆధ్వర్యంలో విజయవాడ కనకదుర్గ అమ్మవారికి బంగారు బోనాన్ని సమర్పించే ఊరేగింపు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
CM Chandrababu: టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. గతంలో అభివృద్ధి పేరుతో రాజకీయాలు మర్చిపోయాం.. దీంతో మనపై దుష్ప్రచారం చేశారు.. అందుకే ప్రతి ఇంటికి వెళ్లి ఏమి చేశామో చెప్పాలి అన్నారు. ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమం ప్రజలకు వివరించాలి.. గతంలో కూడా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి.
Palnadu: పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం తుమ్మల చెరువు దగ్గర విశాఖ ఎక్స్ ప్రెస్ లో దుండగులు చోరీకి యత్నించారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు మూడు రౌండ్లు గాల్లో కాల్పులు జరిపారు. ఒక్కసారిగా భయపడిన దొంగలు అక్కడి నుంచి పారిపోయారు.
CM Chandrababu: ఈరోజు ఉదయం 11గంటలకి టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ కన్వీనర్లు హాజరుకానున్నారు.
దశాబ్దాల కలగా మిగిలిన కొల్లేరు సమస్యల పరిష్కారం ఎదురు చూస్తున్నారు ఇక్కడి ప్రజలు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో త్వరలోనే అది సాధ్యమవుతుందని కూడా నమ్ముతున్నారట. ఈ క్రమంలో ఇప్పుడు వైసీపీ నేతలు కొందర్ని అనుమానాలు, అసంతృప్తి వెంటాడుతున్నట్టు తెలుస్తోంది. అందుకు కారణాలు కూడా గట్టిగానే ఉన్నాయి. కేంద్ర సాధికారిక కమిటీ ఇటీవల కొల్లేరు గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించింది. రెండు రోజుల పాటు అయా ప్రాంతాల ప్రజల నుంచి పెద్ద ఎత్తున వినతి పత్రాలు స్వీకరించింది.
ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాలపై టీడీపీ అధిష్టానం శీతకన్ను వేసిందంటూ తెగ ఫీలవుతున్నారట తమ్ముళ్లు. విజయవాడ పశ్చిమ, అవనిగడ్డ, కైకలూరు సెగ్మెంట్స్లో ఇప్పటి వరకు పార్టీ ఇన్ఛార్జ్లు లేరు. ఈ మూడింటిలో రెండు చోట్ల బీజేపీ, అవనిగడ్డలో జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 16 నియోజకవర్గాలు ఉంటే అందులో 13 చోట్ల టీడీపీ గెలవగా... మిగతా మూడింటిని మిత్రపక్షాలు కైవసం చేసుకున్నాయి. ఎన్నికల సమయంలో ఇక్కడ నుంచి పోటీ చేయటానికి కొందరు…
రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోందని ఘాటైన వ్యాఖ్యలు చేశారు మాజీ టీడీపీ నేత సుగవాసి బాలసుబ్రమణ్యం.. అవినీతి జరగలేదని 164 మంది ఎమ్మెల్యేలలో ఏ ఒక్కరైనా కాణిపాకానికి వచ్చి ప్రమాణం చేస్తారా ? అంటూ ఆయన సవాలు విసిరారు.. ఈ మధ్యే టీడీపీకి గుడ్బై చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ జడ్పీ చైర్మన్ సుగవాసి బాలసుబ్రమణ్యం.. కూటమి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు..