TDP: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలినట్టు అయ్యింది.. టీడీపీకి రాజీనామా చేశారు సిరివెళ్ల మండలం గుంపరమందిన్నె ఎంపీటీసీ తులసమ్మ, ఆమె భర్త నీటి సంఘం చైర్మన్ కుందూరు మోహన్ రెడ్డి.. తమ రాజీనామా పత్రాన్ని సిరివెళ్ల ఎంపీడీవోకు అందజేశారు ఎంపీటీసీ తులసమ్మ.. మరోవైపు, నీటి సంఘం చైర్మన్ పదవికి రాజీనామా చేసేందుకు కేసీ కెనాల్ డీఈని సంప్రదించారు కుందూరు మోహన్ రెడ్డి.. తెలుగుదేశం పార్టీలో తమకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదని, సరైన న్యాయం జరగడం లేదని ఆరోపించారు కుందూరు మోహన్ రెడ్డి. టీడీపీలో ఉండడం ఇష్టం లేకే.. పదవులతో పాటు పార్టీకి రాజీనామా చేశామని చెబుతున్నారు తులసమ్మ, మోహన్‌రెడ్డి.. అయితే, టీడీపీ నేతల ఒత్తిడి కారణంగా.. సిరివెళ్ల ఎంపీడీవో.. ఎంపీటీసీ తులసమ్మ రాజీనామాను ఆమోదించలేదని తెలుస్తోంది.. అయితే, టీడీపీ అధికారంలో ఉండగానే.. అధికార పార్టీకి ఇద్దరూ రాజీనామా చేయడం చర్చగా మారింది..