Gopireddy Srinivasa Reddy: గత ప్రభుత్వ హయాంలో అంతా వాలంటీర్ వ్యవస్థ ద్వారే నడిపించారు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. అయితే, ఆ వ్యవస్థే పార్టీకి నష్టం చేసింది.. ఎన్నికల్లో ఓటమికి అది కూడా కారణమని ఆ పార్టీ నేతలే కొందరు వ్యాఖ్యానించారు.. తాజాగా, పల్నాడు జిల్లా… వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి.. వాలంటీర్ వ్యవస్థపై హాట్ కామెంట్స్ చేశారు.. నరసరావుపేటలో వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొని మాట్లాడిన ఆయన.. వాలంటీర్ వ్యవస్థని నమ్ముకొని గత ఐదేళ్లు పూర్తిగా నష్ట పోయాం అన్నారు.. ఏ పార్టీకైనా కార్యకర్తలు మూల స్తంభాలు.. కానీ, వాలంటీర్లు కాదు అని స్పష్టం చేశారు..
Read Also: Gold Rates: గోల్డ్ లవర్స్‌కి షాక్.. మళ్లీ పెరిగిన ధరలు
ప్రజలు – పాలకులకు మధ్య కార్యకర్తలను ఉంచాలి.. ఈ విషయాన్ని పార్టీ ఓడిపోయాక అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని మొదటిసారి కలిసినప్పుడు చెప్పాను అని గుర్తుచేసుకున్నారు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి.. వైసీపీ హయాంలో ప్రభుత్వ పథకాల లబ్ధిని ప్రజలకు వాలంటీర్ల ద్వారా అందించారు.. అదే కార్యకర్తల ద్వారా ఆ లబ్ధిని అందిస్తే ఇలా జరిగేది కాదన్నారు.. వాలంటీర్ల వల్ల వైసీపీ పార్టీ పూర్తిగా చిన్నాభిన్నం అయ్యిందన్న ఆయన.. ఇంటికి వచ్చి వాలంటీర్లు పథకాలు ఇస్తే.. మన పార్టీ నాయకుల్ని మర్చిపోయారన్నారు.. ఇప్పుడు కేసులు కార్యకర్తలపై మాత్రమే పెడుతున్నారు.. వాలంటీర్ల మీద కాదన్నారు.. కేవలం కార్యకర్తలను పట్టించుకోకపోవడం వల్లనే గత ఎన్నికల్లో ఓడిపోయామని వ్యాఖ్యానించారు పల్నాడు జిల్లా వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి..