గన్నవరం ఎయిర్పోర్ట్లో ఇండిగో విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది.. 222 మంది ప్రయాణికులతో బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి.. దీంతో, గన్నవరం ఎయిర్పోర్ట్లో అత్యవసరంగా విమానాన్ని ల్యాండ్ చేశాడు పైలెట్.. విమానంలో ఒక్కసారిగా సాంకేతిక లోపం తలెత్తడంతో ఈ పరిస్థితి వచ్చిందంటున్నారు..
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా... ఇంటింటికి ప్రజా ప్రతినిధులు, పార్టీల నేతలు వెళ్ళి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించాలని నిర్ణయించారు.దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ సమావేశం నిర్వహించింది. తమ ఏడాది ఘనతను జనంలోకి దూకుడుగా తీసుకువెళ్ళాలని డిసైడయ్యారు టీడీపీ లీడర్స్.
గుంటూరు జిల్లా జైలు నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్ విడుదలయ్యారు.. టీడీపీ కార్యకర్త రాజుపై దాడికేసులో సోమవారం రోజు సురేష్కు బెయిల్ మంజూరు చేసింది గుంటూరు కోర్టు. అయితే, షూరిటీలు సమర్పించడంలో అలస్యం కావడంతో ఈ రోజు జైలు నుంచి విడుదలయ్యారు నందిగం సురేష్..
గోదావరి పుష్కరాలను మహా కుంభమేళా తరహాలో నిర్వహిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. వరుసగా మూడోసారి గోదావరి పుష్కరాలను ముఖ్యమంత్రిగా నిర్వహించే బాధ్యత నాకేదెక్కిందని హర్షం వెలిబుచ్చారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే అవకాశం దేవుడు తనకే కల్పించాడని ఆశాభావం వ్యక్తం చేశారు.
Harish Rao: సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. ఏపీ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్ట్ బనకచర్ల విషయంలో కాంగ్రెస్ పార్టీని మొద్దు నిద్ర లేపింది బీఆర్ఎస్ అన్నారు. ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు తిరస్కరించే వరకు అలుపెరుగని పోరాటం చేసింది బీఆర్ఎస్ పార్టీ.. గోదావరిలో 1000 టీఎంసీలు, కృష్ణాలో 500 టీఎంసీలు చాలు అని చెప్పిన రేవంతుకు.. మిగులు జలాల్లోనూ తెలంగాణకు వాటా ఉంటుందని జ్ఞానోదయం చేసింది తమ పార్టీ అని ఆయన…
వైఎస్ జగన్ భద్రత వ్యవహారంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది వైసీపీ.. వైఎస్ జగన్ నెల్లూరు జిల్లా పర్యటనలో జడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పించేటట్లు ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ హైకోర్టులో వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్ వేసింది.. ఈ లంచ్ మోషన్ పిటిషన్ ను వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి దాఖలు చేశారు..
పాయకరావుపేట బీసీ బాలికల కాలేజ్ హాస్టల్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సమయంలో ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనితకు ఊహించని ఘటన ఎదురైంది.. హాస్టల్లో బాలికలతో కలిసి భోజనం చేస్తుండగా.. ఆమె తన ఫ్లేట్ వైపు చూసి.. కొంత ఆశ్చర్యానికి గురయ్యారు.
Telangana CM: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు. 90 టీఎంసీలు పట్టిసీమకు తీసుకెళ్లారు.. దాంట్లో మాకు 45 టీఎంసీలు రావాలని డిమాండ్ చేశారు. ఇక, పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకి నీళ్ళ కేటాయింపులు కావాలి అంటే ఇవ్వడం లేదు.. ఏపీ ప్రభుత్వం అభ్యంతరం ఎందుకు చెప్తున్నారు అని ప్రశ్నించారు.
తెలంగాణ హక్కులు కాపాడాలనేది మా ఆలోచన అన్నారు. అయితే, కేసీఆర్, హరీష్ రావుల దగ్గరే తొమ్మిదిన్నరేళ్ల పాటు నీటి పారుదల శాఖ ఉంది.. వాళ్ళ మీద పెట్టిన నమ్మకం వమ్ము చేశారు.. వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు తెలంగాణకి గుది బండలాగా మారింది.. నికర జలాల మీద కేటాయింపుల్లో స్పష్టత ఉందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.