2024 ఎన్నికల్లో ఈవీఎంలపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని, రానున్న ఎన్నికలు బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ)ను ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కోరారు. ఎన్నికల నిర్వహణపై ఈసీ పునరాలోచించాలన్నారు. సాయంత్రం 6 తర్వాత ఏపీలోని ఎన్నో నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం పెరిగిందని, నాలుగు కోట్ల ఓట్లలో 51 లక్షల ఓట్లు సాయంత్రం 7 తర్వాతే పోలయ్యాయన్నారు. సాయంత్రం 6 తర్వాత పెరిగిన ఓట్లపై ఈసీని విచారణ అడిగాం అని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ఈవీఎంలపై…
విద్యార్థులకు అలర్ట్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ స్కూళ్లకు సెలవు. ప్రైవేట్ స్కూళ్ల బంద్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్స్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ప్రైవేటు పాఠశాలలపై తీసుకుంటున్న ఏకపక్ష చర్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలను మూసివేసినట్లు యాజమాన్యాల సంఘాలు ప్రకటించాయి. ఈ నిర్ణయం తమ ఆవేదనను తెలిపేందుకే తప్ప.. ప్రభుత్వానికి అస్సలు వ్యతిరేకం కాదని వెల్లడించాయి. స్కూళ్ల బంద్‌తో సమిష్టి ఐక్యతను అందరి దృష్టికి తీసుకెళ్లే చిరు ప్రయత్నం మాత్రమే అని…
2024 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి... కేవలం 11 అసెంబ్లీ సీట్లకు పరిమితమైన వైసీపీ.... ఈసారి మాత్రం ఛాన్స్ తీసుకోదల్చుకోవడం లేదట. అంత ఓటమిలో కూడా... 40 శాతం వరకూ ఓట్లు పడ్డ విషయాన్ని గుర్తుంచుకోవాలని, ఆ ఓట్ బ్యాంక్‌ని కాపాడుకుంటూ.... సహజంగా వచ్చే ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకోగలిగితే.... మళ్ళీ పవర్లోకి రావడం ఖాయమని లెక్కలేసుకుంటోందట పార్టీ అధిష్టానం.
ఆంధ్రప్రదేశ్‌లో అధికార మార్పిడి జరిగి ఏడాది పూర్తయిపోయింది. ఈ టైంలో అమలైన హామీలు, జరిగిన పనుల గురించి విస్తృత చర్చ మొదలైంది రాష్ట్రంలో. ఆ చర్చ దిశగానే తెలుగుదేశం పార్టీ కూడా కార్యక్రమాలు రూపొందించుకుంటోంది. అయితే... రాజకీయంగా చూసుకుంటే... ఇది కూటమి పార్టీల మధ్య బాగా సున్నితమైన అంశంగా మారుతున్న సౌండ్ వినిపిస్తోందని అంటున్నారు పొలిటికల్ పండిట్స్. ఎన్నికల ప్రచారంలో సూపర్ సిక్స్ హామీలిచ్చింది టీడీపీ. అధికారంలోకి వచ్చాక వాటి అమలుపై దృష్టి సారించింది.
కర్నూలు జిల్లాలో తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారనే అనుమానంతో ఓ వృద్ధున్ని దారుణంగా హత్య చేశాడో వ్యక్తి.. కాలు నరికి బైక్ లో తీసుకువెళ్లి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. నరికిన కాలు చేతిలో పట్టుకొని బైక్ పై వెళ్తున్న భయానక దృశ్యాలు సెల్ ఫోన్ లో చిత్రీకరించారు.
తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పుడు బనకచర్ల పొలిటికల్ హాట్ టాపిక్. ఈ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఒకే తాను ముక్కలుగా అభివర్ణిస్తూ.. ఇద్దర్నీ ఏక కాలంలో టార్గెట్ చేస్తోంది తెలంగాణ ప్రతిపక్షం బీఆర్ఎస్.
ఏపీ బీజేపీ వైఖరి మారుతోందా అంటే.... లేటెస్ట్ వాయిస్ వింటుంటే అలాగే అనిపిస్తోందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. మరీ ముఖ్యంగా... పదవుల విషయంలో వాళ్లు తీవ్రంగా రగిలిపోతున్నట్టు కనిపిస్తోందని, రాష్ట్ర పార్టీ కొత్త అధ్యక్షుడి పదవీ స్వీకార కార్యక్రమం వేదికగా ఆ అసంతృప్తి బయటపడిందని చెప్పుకుంటున్నారు. ఎంతసేపూ.... తమను ఫైవ్ పర్సంట్ వాటాదారుగానే చూస్తున్నారని, ఆ కోణం మారి ప్రాధాన్యం పెంచాలన్నదే ఏపీ కాషాయ నేతల అభిప్రాయంగా తెలుస్తోంది.
వైద్య విద్యార్థుల ఆందోళనకు మద్దతు పలికారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో వైఎస్ జగన్ ను కలిశారు వైద్య విద్యార్ధులు.. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. విదేశాల్లో చదువుకున్న వైద్య విద్యార్థుల ఆందోళనకు మద్దతు తెలుపుతున్నట్టు ప్రకటించారు.
విద్యార్థులకు అలర్ట్.. రేపు రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ స్కూళ్ల బంద్‌కు పిలుపునిచింది ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్స్.. మన వేదన అందరికీ తెలియచేసే కార్యక్రమానికి అందరి సహకారంతో కార్పొరేట్ స్కూళ్లలో సహా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.. ఈ రోజున జరిగిన జూమ్ సమావేశంలో తెలియచేసిన విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అధికారులకు మన సభ్యులందరూ వినతి పత్రాలు సమర్పించాలని సూచించారు