కుప్పం పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కుప్పం నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం అయ్యారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ శ్రేణులకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.. అభివృద్ధి, సంక్షేమం అంతా కార్యకర్త ద్వారానే జరగాలని ఆకాక్షించిన ఆయన.. ప్రజలకు మంచి జరిగితే టీడీపీ కార్యకర్తే గుర్తుకు రావాలన్నారు.. ప్రజలకు దగ్గరైన వారు నాకు దగ్గరగా ఉంటారు.. లేదా, ప్రజల్లో చెడ్డ పేరుంటే నమస్కారం పెట్టి పక్కన పెట్టేస్తాను.. కుప్పంలోనే కాదు.. రాష్ట్ర…
కాకాణి గోవర్ధన్ రెడ్డికి మరోషాక్ తగిలింది.. ఇప్పటికే కేసులు ఎదుర్కొంటున్న కాకాణికి మరో కేసులో రిమాండ్ విధించింది కోర్టు.. గత ఎన్నికల సమయంలో ముత్తుకూరు మండలం పంటపాలెంలో దొరికిన మద్యం డంపు కేసులో ఆయన నిందితులుగా ఉండగా.. ఈ నేపథ్యంలో ఆయన్ని ఎక్సైజ్ పోలీసులు పీఈ వారెంట్ పై న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు.
ఈవీఎం మాయాజాలం తోడై కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచిందని ఆరోపించారు ఆర్కే రోజా.. కళ్ల బొల్లి మాటలు, వాగ్దానాలకు ప్రజలు నమ్మి ఓటు వేశారు, గెలిచాక మాటమార్చారని విమర్శించారు.. కుక్కతోక వంకర తరహాలో చంద్రబాబు ఎన్నికలు ముందు మారాను అని చెప్పి, అధికారంలోకి వచ్చాక మళ్లీ అదే విధంగా ఆలోచన చేస్తున్నారు అని దుయ్యబట్టారు
మామిడి రైతులు పల్ప్ పరిశ్రమ కలిసి పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. కుప్పంలోని తన నివాసంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా మామిడి రైతులు, పల్ప్ పరిశ్రమల ప్రతినిధులు, ప్రాసెసింగ్ యూనిట్లతో సమావేశం నిర్వహించారు సీఎం. రైతుల నుంచి తక్షణం మామిడి కొనుగోలు చేసి వారిని ఆదుకోవాలని ప్రాసెసింగ్, పల్ప్ పరిశ్రమలను ఆదేశించారు.
వైఎస్ జగన్ భద్రత వ్యవహారంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది వైసీపీ.. వైఎస్ జగన్ నెల్లూరు జిల్లా పర్యటనలో జడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పించేటట్లు ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ హైకోర్టులో వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్ వేసింది.. జగన్ నెల్లూరు పర్యటనలో హెలిపాడ్ అనుమతి పిటిషన్ కూడా దాఖలు కాగా.. దీనిపై విచారణ చేపట్టింది హైకోర్టు.. పిటిషనర్ తరఫున వాదనలు వినిపించారు మాజీ ఏజీ శ్రీరాం.. హెలిప్యాడ్‌కు అనుమతి ఇవ్వడం లేదని కోర్టులో పిటిషన్ వేసిన వెంటనే…
నంద్యాల జిల్లాలో జరిగిన బిచ్చగాడు దస్తగిరి హత్య.. ఎంతో మంద్రి క్రిమినల్స్ బిచ్చగాళ్ల రూపంలో తిరుగుతున్నారనే సంచలన విషయాన్ని బయటపెట్టింది.. 120 మంది బిచ్చగాళ్లలో 30 మందికి నేరచరిత్ర ఉన్నట్లు పోలీసులకు నివేదిక అందింది.. డేటా సేకరించి పోలీసులు.. వారిని మందలించి పంపినట్టుగా తెలుస్తోంది..
గత వారం సింగయ్య కేసులో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పిటిషన్ ను అనుమతించిన వ్యవహారంలో జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగిన వ్యవహారంపై స్పందించిన ఆయన.. ఈ రోజు తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి ఉపయోగించే కల్తీ నెయ్యి కేసులో నిందితులకు బెయిల్ ఇచ్చిన తర్వాత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జస్టిస్ శ్రీనివాస్‌రెడ్డి.. నన్ను గత రెండు రోజులు నుంచి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.. సారీ స్టేట్ ఆఫ్ అఫ్ఫైర్స్…