T20 World Cup 2026: గుడ్‌న్యూస్.. రింకు సింగ్ ఈజ్ బ్యాక్.. !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్ 2026లో సూపర్-8 దశలో ఉన్న టీమ్ ఇండియాకు భారీ ఊరట లభించింది. వ్యక్తిగత కారణాలతో స్వల్ప విరామం తీసుకున్న స్టార్ ఫినిషర్ రింకూ సింగ్ (Rinku Singh) తిరిగి జట్టుతో చేరనున్నారు. గురువారం (ఫిబ్రవరి 26) జింబాబ్వేతో జరగనున్న కీలక పోరుకు ముందు అతను జట్టులోకి రావడం భారత శిబిరంలో ఉత్సాహాన్ని నింపింది. అయితే, రింకూ సింగ్ తండ్రి ఖంచంద్ సింగ్ తీవ్ర అనారోగ్యం పాలవ్వడంతో, కుటుంబ అత్యవసర పరిస్థితి కారణంగా రింకూ.. మంగళవారం జట్టును వీడి ఇంటికి వెళ్లారు. దీనితో జింబాబ్వేతో జరిగే మ్యాచ్‌లో అతను ఆడటంపై సందిగ్ధత నెలకొంది. అయితే, తాజా సమాచారం ప్రకారం అతని తండ్రి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉండటంతో, రింకూ తిరిగి జాతీయ విధుల్లో చేరాలని నిర్ణయించుకున్నాడు.
భారత బ్యాటింగ్ కోచ్ సీతాన్షు కోటక్ (Sitanshu Kotak) బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో రింకూ సింగ్ తిరిగి జట్టులో చేరడాన్ని ధృవీకరించారు. “రింకూ సింగ్ బుధవారం (ఫిబ్రవరి 25) సాయంత్రం కల్లా తిరిగి జట్టులో చేరుతాడు. అతని తండ్రి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. ఇది పూర్తిగా వ్యక్తిగత విషయం. అతను తిరిగి రావడంతో జట్టులో తుది ఎంపికకు మరిన్ని అవకాశాలు మెరుగుపడతాయి,” అని కోటక్ పేర్కొన్నారు.
Also Read
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
వరల్డ్ కప్‌లో రింకూ ప్రదర్శన
ప్రస్తుత ప్రపంచకప్‌లో రింకూ ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. గత ఐదు ఇన్నింగ్స్‌ల్లో అతను కేవలం 24 పరుగులు మాత్రమే చేశాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన గత మ్యాచ్‌లో డకౌట్ అయినప్పటికీ, డెత్ ఓవర్లలో అతని హిట్టింగ్ సామర్థ్యంపై యాజమాన్యం పూర్తి నమ్మకంతో ఉంది. ఈ టోర్నీలో USA: 6 పరుగులు, నమీబియా: 1 పరుగు, పాకిస్తాన్: 11 పరుగులు, నెదర్లాండ్స్: 6 పరుగులు చేసిన రింకూ సింగ్.. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు..
జింబాబ్వేపై తిరుగులేని రికార్డు
గతంలో జింబాబ్వేపై రింకూ సింగ్ ఆడిన రికార్డులు అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా హరారే వేదికగా జరిగిన మ్యాచ్‌లో అతను చేసిన 48 నాటౌట్ ఇన్నింగ్స్ జట్టును ఆదుకుంది. రేపటి మ్యాచ్ చెన్నైలోని చేపాక్ స్టేడియంలో జరగనుండటంతో, స్పిన్‌ను సమర్థవంతంగా ఎదుర్కోగల రింకూ ఉనికి జట్టుకు కీలకం కానుంది. భారత్ ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిస్తేనే సెమీఫైనల్ రేసులో తమ అవకాశాలను మెరుగుపరుచుకుంటుంది. ఈ నేపథ్యంలో రింకూ ‘మిడాస్ టచ్’ తిరిగి కనిపిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.
తాజావార్తలు
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Muhammad Yunus: “నువ్వు ఒక ఉగ్రవాదివి, వేలాది మందిని చంపావు”.. ముహమ్మద్ యూనస్‌కు చేదు అనుభవం..
-
Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
-
Rahul Gandhi: పరువు నష్టం కేసు.. సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్..
-
Buddha Prasad: జనసేన లేకుండా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి జెండా ఎగురదు!
ట్రెండింగ్
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!