Vijayawada: విజయవాడలో పబ్‌ల పేరుతో యువత రాత్రిళ్లు నానా రచ్చ చేస్తుండటంపై పోలీసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని ప్రముఖ పబ్‌లో అర్ధరాత్రి 2 గంటలు దాటిన తరువాత కూడా పార్టీలు కొనసాగుతున్న విషయాన్ని గుర్తించిన పోలీసులు, అకస్మాత్తుగా దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా, పబ్‌లో సుమారు 150 మందికిపైగా యువకులు, యువతులు మద్యం మత్తులో మునిగిపోయినట్లు గుర్తించారు.
Read Also: Air India Plane Crash: విమాన ప్రమాదానికి అసలు కారణమేంటి?.. అమెరికా మీడియాకి ఎలా లీకైంది?
అయితే, పబ్ బయటకు వచ్చిన కొంత మంది యువతి, యువకులు బందరు రోడ్డుపై బాహాబాహీకి దిగారు. ఈ సమయంలో నైట్ డ్యూటీలో ఉన్న పోలీసులకు కనిపించడంతో మద్యం మత్తులో ఉన్న వారిని అదుపులోకి తీసుకుని స్థానిక ఎమ్మార్వో ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇక, పరిస్థితి అదుపు తప్పుతుండడంతోనే పోలీసులు పబ్‌లోనే లాఠీ ఛార్జ్ చేయగా.. పోలీసుల మెరుపు దాడితో కొంత మంది మందుబాబులు బిల్లు చెల్లించకుండానే పరారయ్యారు.