కుటుంబ సభ్యుల మధ్య ఆస్తుల పంపకాల డీడ్ రిజిస్ట్రేషన్లల్లో కోల్పోతున్న ఆదాయంపై ఏపీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఫోకస్ పెట్టింది. వాటాల విలువను తగ్గించి చూపుతున్న కారణంగా స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఆదాయం కోల్పోతున్న లావాదేవీల్లో నిబంధనలు సవరిస్తూ మెమో జారీ చేసింది. పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తుల వాటాల పంపకాల్లో సరైన స్టాంపు డ్యూటీ చెల్లించక పోవడంతో ఖజానాకు నష్టం వాటిల్లుతోందని గుర్తించిన ప్రభుత్వం… హిందూ వారసత్వ చట్టం, భారత వారసత్వ చట్టాలను అనుసరించకుండా…
మంత్రి బొత్స సత్యనారాయణపై సెటైర్లు వేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్… విశాఖ పర్యటనలో ఉన్న ఆయన.. ఇవాళ విజయనగరం జిల్లా జనసేన కార్యకర్తల సమావేశంలో పవన్ కళ్యాణ్ ఆసక్తికర కామెంట్లు చేశారు.. వైసీపీలో బొత్స పరిస్థితి చూస్తుంటే బాధేస్తోందన్న ఆయన.. ఉమ్మడి రాష్ట్రానికి సీఎం అయ్యే అవకాశాన్ని చిటికెలో కొల్పోయిన వ్యక్తి బొత్స.. అలాంటి గొప్ప నేత బొత్సకు కనీసం హోం మంత్రో.. పరిశ్రమల మంత్రో.. ఆర్థిక మంత్రో అవుతారు అనుకున్నా… కానీ, చివరికి మున్సిపల్…
హుజురాబాద్ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ విజయం 22వ రౌండ్ లో కూడా బీజేపీ హవా… బీజేపీ 1,07,022 ఓట్లు, టీఆర్ఎస్ 83,167 ఓట్లు. 23,855 ఓట్ల ఆధిక్యంతో గెలిచిన ఈటల 21వ రౌండ్ లోనూ బీజేపీ హవా. బీజేపీ 1,01,732 ఓట్లు, టీఆర్ఎస్ 78,997 ఓట్లు. 21వ రౌండ్ ముగిసే సరికి బీజేపీకి 22,735 ఓట్ల ఆధిక్యం. 20వ రౌండ్ లోనూ బీజేపీ హవా… 20వ రౌండ్ లో బీజేపీ కి 1,474 ఓట్ల ఆధిక్యం…
బద్వేల్ ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రాండ్ విక్టరీ కొట్టింది.. ఏకంగా 90,533 ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధ ఘన విజయం సాధించారు. ప్రతీ రౌండ్లోనూ వైసీపీ ఆధిక్యం సాదిస్తూ దూసుకెళ్లింది.. మొత్తంగా వైసీపీకి 1,12,211 ఓట్లు పోలుకాగా.. బీజేపీకి 21,678 ఓట్లు వచ్చాయి.. ఇక, కాంగ్రెస్ పార్టీకి 6,235 ఓట్లు వచ్చాయి. దీంతో.. బీజేపీ, కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోయాయి. ఇక, బద్వేల్ ఉప ఎన్నిక ఫలితంపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన…
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. జగన్ తీరును నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ఇదంతా బద్వేలులో వైసీపీ విజయం సాధించినందుకు అనుకుంటున్నారా? కాదండి. నవంబర్ 1న వైఎస్ఆర్ జీవన సాఫల్య పురస్కారాల ప్రదానోత్సవం సందర్భంగా సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జగన్ చేసిన ఓ పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Read Also: బీరువాలో లక్షదాచిన వృద్ధుడు… ఆ తర్వాత ఏమైంది? ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలు…
బద్వేల్ నియోజక వర్గానికి జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు మరికాసేపట్లో రాబోతున్నాయి. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయింది. పోస్టల్ బ్యాలెట్ లో అధికార వైసీపీ ఆధిక్యాన్ని కనబరిచింది. వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల త్రిముఖ పోటీ జరిగినప్పటికీ వైసీపీ గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని ఇప్పటికే సర్వేలు తెలిపాయి. ఎంత మెజారిటీ వస్తుంది అనే దానిమీదనే అందరి దృష్టి నిలిచింది. Read: లైవ్ అప్డేట్స్: హుజురాబాద్, బద్వేల్ ఎన్నికల ఫలితాలు బద్వేల్ ఉప…
బద్వేల్ ఉప ఎన్నికకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రారంభం అయింది. బద్వేల్లోని బాలయోగి గురుకుల పాఠశాలలో ఓట్ల లెక్కింపును నిర్వహిస్తున్నారు. లెక్కింపు సందర్భంగా మూడంచెల భద్రతను, కౌంటింగ్ కేంద్రాల వద్ధ 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభం అయింది. మొదటి అరగంటపాటు పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. తాజా సమాచారం ప్రకారం పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో వైసీపీ ఆధిక్యంలో ఉన్నది. Read: లైవ్ అప్డేట్స్:…
అక్టోబర్ 30 వ తేదీన కడప జిల్లా బద్వేల్ నియోజక వర్గానికి ఉప ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల ఫలితాలు ఈరోజు వెలువడనున్నాయి. ఈరోజు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. బద్వేల్లోని బాలయోగి గురుకుల పాఠశాలలో ఎన్నికల కౌంటింగ్‌కు సంబంధించి ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. 4 హాళ్లలో మొత్తం 28 టేబుల్స్‌ను ఏర్పాటు చేశారు. ఒక్కో హాల్లో 7 టేబుల్స్‌ను ఏర్పాటు చేశారు. సూపర్వైజర్, మైక్రో అబ్జర్వేటర్ల పర్యవేక్షణలో కౌంటింగ్…
ఢిల్లీలో టీడీపీ ఎంపీలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. సోమవారం సాయంత్రం లోక్‌సభ టీడీపీ ఎంపీ కేశినేని నాని, రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసి వైఎస్ఆర్సీపీ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో ప్రతిపక్ష పార్టీ నేతలు, కార్యకర్తలపై అధికార పార్టీ వైసీపీ దాడులు చేయిస్తోందని, బూతులు తిట్టిస్తోందని ఎన్నికల సంఘం అధికారులకు టీడీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు. Read Also: ఏపీలో…
ఏపీ రాజకీయాల్లో డ్రగ్స్, గంజాయి వ్యవహారంపై చేసిన విమర్శలు, ఆరోపణలు కాస్త శృతిమించి తీవ్ర వివాదానికి, కేసులకు దారి తీశాయి.. అయితే, మరోసారి డ్రగ్స్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. విశాఖ అర్బన్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గంజాయి సాగును కట్టడి చేసేందుకు ఏపీ పోలీసులకు పూర్తి అధికారం, చేసే పరిస్థితులు ఇవ్వండి.. 48 గంటల్లో కట్టడి చేస్తారన్నారు. కానీ, ఈ ప్రభుత్వం వారికి అధికారాలు ఇవ్వదని ఆరోపించారు. ఇక, రోడ్ల…