సీఎం జగన్‌తో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చింది నీతి ఆయోగ్ బృందం.. ఈ సందర్భంగా సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డితో సమావేశం అయ్యారు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్.. రెండు రోజుల పాటు ఏపీలో జరిగే వివిధ కార్యక్రమాలలో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్, నీతి ఆయోగ్ బృందం పాల్గొననుండగా.. ఇవాళ మర్యాదపూర్వకంగా సీఎం జగన్‌ను కలిశారు. ఇక, ఈ సందర్భంగా ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డా.రాజీవ్ కుమార్.. ప్రభుత్వ పని తీరు పై ప్రశంసలు కురిపించిన ఆయన.. సహజ వ్యవసాయం పురోగతి చాలా అద్భుతంగా ఉందని అభినందించారు.. రైతు భరోసా కేంద్రాల పనితీరు చాలా బాగుంది.. ముఖ్యమంత్రి తీసుకుని వచ్చిన అద్భుతమైన కార్యక్రమం ఇదంటూ కొనియాడారు.
Read Also: ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ నుంచి రూ.400 కోట్లు బదిలీ..
Also Read
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- OTR: లోకల్ ఎలక్షన్స్‌లో జనసేనకు టీడీపీ షాక్? సీట్లపై కోల్డ్ వార్
- Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
- CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు..
ఇక, ఉదయం ఢిల్లీ నుంచి నీతి ఆయోగ్ సభ్యుల బృందం గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంది. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డా. రాజీవ్ కుమార్ ఆధ్వర్యంలో ఆరుగురు సభ్యులు రాగా.. వారందరికి ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి కృష్ణా జిల్లాలోని గన్నవరం మండలం వీరపనేనిగూడెంలో ప్రకృతి వ్యవసాయాన్ని నీతి ఆయోగ్ బృందానికి చేరుకున్నారు. వీరపనేనిగూడెం గ్రామ సచివాలయాన్ని నీతి ఆయోగ్ బృందం సందర్శించింది.. గ్రామ సచివాలయం పనితీరును జిల్లా కలెక్టర్ జె.నివాస్ నీతి ఆయోగ్ బృందానికి వివరించారు. నీతి ఆయోగ్ బృందానికి సేంద్రీయ పద్ధతిలో పండించిన పంటలతో తయారు చేసిన ఆహారపదార్ధాలను వీరపనేని గూడెం గ్రామస్తులు అందజేశారు. ఈ సందర్భంగా నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ డా.రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. వీరపనేని గూడెం గ్రామస్తులుప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యం ఇవ్వడం నిజంగా అభినందనీయమన్నారు. భవిష్యత్తులో ఇలాగే మరింత మంది ప్రకృతి వ్యవసాయం వైపు అగుడులేయాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..