అమరావతి : ఇవాళ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ పర్యటించనున్నారు. ఆయన తో పాటు.. నీతి ఆయోగ్ సభ్యులు కూడా ఏపీకి రానున్నారు. కృష్ణా జిల్లా వీరపనేని గూడెంలో రైతులతో ఈ సందర్భంగా నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ మాట్లాడనున్నారు. అనంతరం… రైతు భరోసా కేంద్రం, గ్రామ సచివాలయాన్ని సందర్శించి డ్వాక్రా మహిళల బృందాలతో భేటీ కానుంది నీతి ఆయోగ్ బృందం.
ఇక ఆ తర్వాత… మధ్యాహ్నం సీఎం జగన్ తో భేటీ కానుంది నీతి ఆయోగ్ బృందం. సాయంత్రం 4 గంటలకు మంగళగిరి లో ఏపీఐఐసి భవనంలో కొంత మంది పారిశ్రామికవేత్తలతోనూ భేటీ కానున్నారు నీతిఅయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్. అనంతరం నాగార్జున విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్ సహా విద్యావేత్తలతో సమావేశం కానుంది నీతి ఆయోగ్ బృందం.