ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ నుంచి రూ.400 కోట్లు బదిలీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిధుల వ్యవహారంలో ఉద్యోగులు నిరసన బాట పట్టారు.. మరోవైపు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీలో నిధుల బదలాయింపు ప్రక్రియ పూర్తి చేశారు అధికారులు.. రూ. 400 కోట్ల మేర వర్శిటీ నిధులను ఫైనాన్షియల్ సర్వీసు కార్పొరేషనులోకి బదలాయించారు వీసీ.. బదలాయింపు ప్రక్రియను వ్యతిరేకిస్తూ ఓవైపు యూనివర్శిటీ ఉద్యోగుల ఆందోళన చేస్తున్నా.. ఈ ప్రక్రియను మాత్రం ఆపలేకపోయారు.. ఇక, ఈ వ్యవహారాన్ని తప్పుబడుతున్న ఉద్యోగులు విధులు బహిష్కరించి.. యూనివర్శిటీ ప్రారంగణంలో బైఠాయించారు. ఫైనాన్స్ కార్పొరేషన్ క్రెడిబిలిటీపై ఉద్యోగులు నమ్మకం లేదంటున్నారు. ఆ సంస్థకు వందల కోట్లు ఇవ్వడం ఏంటని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: పెట్రోల్ ధరలపై సర్కార్ కీలక నిర్ణయం.. అక్కడ లీటర్‌పై రూ.8 తగ్గింపు..
Also Read
- AP Liquor Shops: మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు పెంపు.. ఫీజులు, తేదీలు ఇవే
- AP: వారంలో ఆరు రోజులు గుడ్లు, మూడ్రోజులు చికెన్.. విద్యార్థులకు చంద్రబాబు సర్కార్ దసరా గిఫ్ట్!
- OTR: కూటమి ఎమ్మెల్యేలకు రెడ్ అలర్ట్! 95 మంది డేంజర్ జోన్లో ఉన్నారా?
- Nara Lokesh: నెల రోజుల్లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్.. ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి లోకేష్!
యూనివర్శిటీని మరింత అభివృద్ధి చేయాల్సిన అధికారులే దెబ్బ కొడుతున్నారని ఉద్యోగుల మండిపడుతున్నారు.. నిబంధనలు పట్టించుకోకుండా ఏకపక్షంగా రూ. 400 కోట్లు బదలాయించేశారని.. వీసీకి ఇలా నిధులు మళ్లించే అధికారం లేదంటూ ఫైర్ అవుతున్నారు. రూ. 400 కోట్ల ద్వారా వచ్చే వడ్డీ ద్వారానే యూనివర్శిటీ కార్యకలాపాలు జరిగేవని.. ప్రతియేటా రూ. 30 కోట్లు ఖర్చు అవుతుంటే.. ప్రభుత్వం రూ. 5 కోట్లు మాత్రమే ఇస్తుందని ఆరోపిస్తున్నారు.. ఇలాగైతే యూనివర్శిటీ మనుగడ ప్రశ్నార్ధకమే అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. విద్యార్థుల భవిష్యత్తు కూడా దెబ్బ తింటుందని.. నాణ్యమైన విద్య, ప్రాక్టికల్స్‌ను కూడా అందించలేం అంటున్నారు.. కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలు నిలిచిపోతున్నాయి.. ఉద్యోగుల పరిస్థితికి ఇప్పుడు ఎవరు భరోసా ఇస్తారు..? అని ప్రశ్నిస్తున్నారు.. ప్రభుత్వం నిధులు వెనక్కిచ్చేంత వరకు మా పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు ఉద్యోగులు.
తాజావార్తలు
-
2027 ODI World Cup: భారత్, పాకిస్థాన్ మూడు సార్లు ఢీకొట్టే ఛాన్స్.. అదెలాగంటే?
-
Pulsar NS400Z: Pulsar NS400Z కొత్త వెర్షన్ లాంచ్.. TFT డిస్ప్లే, Google Maps సహా మరిన్ని స్మార్ట్ ఫీచర్లు
-
Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
-
Blood Donation Camp: రక్తదాన శిబిరంలో ‘కులం’ కలకలం.. తమిళనాడులో వివాదం
-
Vaishnav Tej: 100 కోట్ల హిట్టు కొట్టినా.. ‘ఉప్పెన’ హీరో ఏం చేస్తున్నాడు?.. ఇంత గ్యాప్ ఎందుకు?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?