స్కూళ్లకు సెలవులు పొడిగించాల్సిందే.. నారా లోకేష్ డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న సందర్భంగా స్కూళ్లకు సెలవులు పొడిగించాలని టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం జగన్‌కు తాను లేఖ రాశానని లోకేష్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలు సెలవులు ప్రకటించాయని ఏపీ ప్రభుత్వానికి లోకేష్ గుర్తు చేశారు. తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు రెండు వారాల పాటు స్కూళ్లకు సెలవులు ప్రకటించాయని లోకేష్ వివరించారు.
Read Also: విద్యార్థులకు అలర్ట్.. ఈనెల 30 వరకు అన్ని పరీక్షలు వాయిదా
Also Read
- OTR: శ్రీకాకుళం మేయర్ సీటు కోసం గుండ లక్ష్మీదేవి ప్రయత్నాలు
- AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
- Polavaram Hydel Project: పోలవరం జల విద్యుత్ కేంద్రంలో కీలక ముందడుగు..
- Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
అటు 15 ఏళ్ల పిల్లలకు ఇంకా వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదని.. ఈ సమయంలో స్కూళ్లు నిర్వహించడం చాలా రిస్క్‌తో కూడుకున్న పని అని లోకేష్ వ్యాఖ్యానించారు. కరోనా థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్ల జీవితాలతో చెలగాటం ఆడొద్దని ఆయన సూచించారు. ప్రస్తుతం ఏపీలో కరోనా కేసులు 500 నుంచి 5వేలకు పెరిగాయని.. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు కూడా 10 శాతానికి పెరిగిందని లోకేష్ అన్నారు. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని స్కూళ్లకు సెలవులపై ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకోవాలని లోకేష్ డిమాండ్ చేశారు.
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యాసంస్థల సెలవులు పొడిగించాలని ముఖ్యమంత్రి @ysjagan గారికి లేఖ రాసాను. దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాయి.
తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు రెండు వారాల పాటు స్కూల్స్ కి సెలవులు ప్రకటించాయి.(1/2) pic.twitter.com/iCWaMJiPOt— Lokesh Nara (@naralokesh) January 17, 2022
తాజావార్తలు
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
-
Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
-
OTR: కాంగ్రెస్-బీఆర్ఎస్ కలుస్తాయా? SIRపై కలిసి పోరాడతారా?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!