Donald Trump: నన్ను చంపడానికి ట్రై చేస్తే 1,000 క్షిపణులు సిద్ధంగా ఉన్నాయ్.. ట్రంప్ షాకింగ్ ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తనను గనక ఇరాన్ టార్గెట్ చేయాలని చూస్తే.. ఆ దేశంపై మునుపెన్నడూ చూడని రీతిలో అత్యంత భీకరమైన సైనిక దాడి జరుగుతుందని హెచ్చరించారు. ఈ మేరకు తానే స్వయంగా అమెరికా సైన్యానికి ముందస్తు ఆదేశాలు జారీ చేశానని, ఇరాన్ వైపు సుమారు 1,000 క్షిపణులు (మిసైళ్లు) ఇప్పటికే గురిపెట్టి సిద్ధంగా ఉన్నాయంటూ సోషల్ మీడియా వేదికగా తీవ్ర హెచ్చరికలు పంపారు. తన ప్రాణాలకు ఇరాన్ నుంచి చాన్నాళ్లుగా ముప్పు పొంచి ఉందన్న ట్రంప్.. ఒకవేళ తనను హతమార్చడానికి ఇరాన్ ప్రయత్నించినా అమెరికా బలగాలు క్షణాల్లో విరుచుకుపడతాయని స్పష్టం చేశారు. తొలి విడతగా వెళ్లే వెయ్యి మిసైళ్లతో పాటు, ఆ వెంటనే మరో వేల సంఖ్యలో క్షిపణులు ఇరాన్‌ను ముంచెత్తుతాయని స్పష్టం చేశారు. ఇరాన్ మొత్తాన్ని పూర్తిగా నామరూపాల్లేకుండా తుడిచిపెట్టేందుకు అమెరికా సైన్యం సిద్ధంగా, పట్టుదలగా ఉందని.. ఈ వినాశకరమైన ఆదేశాలు ఏడాది పాటు అమల్లో ఉంటాయని, అవసరమైతే ఆ గడువును మరింత పొడిగిస్తామని ట్రంప్ పేర్కొన్నారు. ఒక ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ ఆయన ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారు.
“ఇరాన్ హిట్ లిస్ట్‌లో నేను చాలా కాలంగా మొదటి స్థానంలో ఉన్నాను. ఒకవేళ నాకు ఏదైనా జరిగితే.. ఊహించని స్థాయిలో ఇరాన్‌పై బాంబుల వర్షం కురిపించాలని నా సైన్యానికి స్పష్టమైన సూచనలు ఇచ్చాను” అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే, తనపై ఇరాన్ దాడి చేసేందుకు తక్షణమే ఏదైనా ప్లాన్ వేస్తోందన్న కొత్త సమాచారమేదీ ప్రస్తుతానికి లేదని ట్రంప్ క్లారిటీ ఇచ్చారు. ఇరాన్ కుట్రలకు సంబంధించి ఇజ్రాయెల్ కొత్తగా సమాచారాన్ని సేకరించిందంటూ వస్తున్న వార్తలను కొట్టిపారేశారు. ఇజ్రాయెల్ ఎలాంటి కొత్త విషయాలనూ కనుగొనలేదు, ఇరాన్ కిల్లర్ లిస్ట్‌లో నేను ఎప్పటి నుంచో నంబర్ వన్ టార్గెట్‌గా ఉన్నాను, అది నాకు తెలుసని తేల్చి చెప్పారు. అలాగే, ఇరాన్ ఎప్పటికీ అణు ఆయుధాలను తయారు చేయకుండా అడ్డుకుంటామని స్పష్టం చేస్తూనే.. భవిష్యత్తులో ఇరాన్‌తో ఎలాంటి ఘర్షణ వచ్చినా అది సుదీర్ఘ కాలం సాగే యుద్ధంగా మారబోదని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. ఈ ఇరు దేశాల మధ్య శత్రుత్వానికి బలమైన కారణం ఉంది. 2020లో ట్రంప్ ఆదేశాల మేరకు బాగ్దాద్‌లో జరిగిన అమెరికా డ్రోన్ దాడిలో ఇరాన్ అగ్రశ్రేణి సైనిక కమాండర్ ఖాసిం సులేమానీ హతమయ్యాడు. అప్పటి నుంచి ట్రంప్‌పై పగ తీర్చుకుంటామని ఇరాన్ ప్రతిజ్ఞ చేస్తూనే ఉంది. గతంలోనూ ట్రంప్‌ను టార్గెట్ చేస్తూ ఇరాన్ ప్లాన్ చేసిన కొన్ని కుట్రలను అమెరికా అధికారులు బయటపెట్టారు. అయితే, ఈ ఆరోపణలను ఇరాన్ ఎప్పటికప్పుడు తోసిపుచ్చుతోంది.
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!