పాలడుగు గ్యాంగ్ రేప్ ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పాలడుగు ఘటనలో మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ముఠాను పట్టుకున్నామని గుంటూరు జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ వెల్లడించారు. గత ఏడాది సెప్టెంబరులో మేడికొండూరు పీఎస్ పరిధిలోని పాలడుగు అడ్డరోడ్డు వద్ద సత్తెనపల్లికి చెందిన ఓ జంటపై 8 మంది ముఠా సభ్యులు దాడి చేశారు. ఈ ఘటనలో భర్తను కొట్టి అతడి ముందే భార్యను సామూహిక అత్యాచారం చేశారు. తాజాగా ఈ కేసులో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ముఠా చాలా డేంజరస్ అని… 18 కేసుల్లో వీరు నిందితులుగా ఉన్నారన్నారు. బైకులపై వెళ్తున్న జంటలపై దాడి చేయడమే ఈ ముఠా పని అన్నారు. ఈ దాడులకు పాల్పడేముందు ఆయా ప్రాంతాలను రెక్కీ చేస్తారన్నారు.
Read Also: మంచులో కూరుకుపోయి 22 మంది పర్యాటకులు మృతి
Also Read
- Land Fraud: కృష్ణా జిల్లాలో సంచలనం.. ఇలా కూడా స్థలాలు కబ్జా చేస్తారా?
- Secretariat Employees: సచివాలయ ఉద్యోగుల ఆందోళన.. ధర్నాచౌక్ వద్ద ఉద్రిక్తత!
- Tribal Boy: అత్యవసర పరిస్థితి.. తాడు పట్టుకుని వాగు దాటిన గిరిజన బాలుడు!
- Chintur Rains: చింతూరు ఏజెన్సీలో తగ్గుముఖం పట్టిన వర్షాలు.. కూనవరం వద్ద 30 అడుగులకు చేరిన గోదావరి!
నిందితులు సాధారణ సమయంలో మిర్చి పొలాల్లో కుటుంబ సభ్యులతో కలిసి కూలీ పనులు చేసుకుంటారని జిల్లా ఎస్పీ తెలిపారు. గుంటూరు రూరల్ పరిధిలో ఆరు కేసులు.. అర్బన్ పరిధిలో 18 కేసుల్లో వీరు నిందితులుగా ఉన్నారని పేర్కొన్నారు. వీరు మెయిన్‌రోడ్డుపై అసలు ప్రయాణించరని… అందుకే సీసీ కెమెరాల్లో ఎక్కడా ముఠా కదలికలు రికార్డు కాలేదన్నారు. ఈ ముఠా సభ్యులది కర్నూలు జిల్లా పాణ్యం అని.. వీరు ఎక్కువగా రైలులోనే ప్రయాణిస్తారన్నారు. మొత్తం 30 మంది పోలీస్ సిబ్బంది ఈ కేసు దర్యాప్తులో పాల్గొన్నారని జిల్లా ఎస్పీ వెల్లడించారు. నిందితుల నుంచి రూ.1.73 లక్షలు విలువైన బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామన్నారు.
తాజావార్తలు
-
Pongal 2027 : ఇది అసలైన పోటీ అంటే.. సంక్రాంతి బరిలో సూపర్ స్టార్ రజనీ
-
Land Fraud: కృష్ణా జిల్లాలో సంచలనం.. ఇలా కూడా స్థలాలు కబ్జా చేస్తారా?
-
PM Modi Mann Ki Baat: సర్జికల్ స్ట్రైక్‌కు 10 ఏళ్లు.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
-
Virat Kohli Records: 110 పరుగులు, 2 సెంచరీలు.. సచిన్ నాలుగు రేర్ రికార్డులపై ‘కింగ్’ కోహ్లీ కన్ను!
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?