ఆంధ్రప్రదేశ్ లో రోజు కరోనా కేసులు పెరుగుతూ… తగ్గుతూ వస్తున్నాయి. ఇక తాజా బులిటెన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 31, 158 శాంపిల్స్ పరీక్షించగా.. 135 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరో ముగ్గురు కరోనా బాధితులు మృతిచెందారు. ఇక, ఇదే సమయంలో 164 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 3,10,98,568 కు చేరుకోగా… మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య…
ఆ మాజీ మంత్రి నోట కొత్త పలుకులు వినిపిస్తున్నాయ్. ఎప్పుడూ రాజకీయాలు, ఎత్తుగడలు మాట్లాడే ఆయన.. ఈసారి కులం కెపాసిటీ గురించి చర్చిస్తున్నారు. అదీ ఎన్నికలకు రెండున్నరేళ్ల ముందు నుంచీ. అంతర్మథనంలో ఉన్న సామాజికవర్గానికి దిక్సూచిగా మారాలనే ఆలోచన ఉందా? లేక రాజకీయాల్లో చురుకైన పాత్రకు వేసిన వ్యూహమా? గంటా చూపు జనసేన వైపు అని పుకార్లు షికారు..! గంటా శ్రీనివాసరావు. మాజీ మంత్రి. టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన రెండున్నరేళ్లుగా మౌనంగా ఉంటున్నారు. అధికారం…
ఏపీలో ప్రస్తుతం సినిమా టిక్కెట్ల రేట్ల అంశం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఎంతోమంది కార్మికులు ఆధారపడ్డ సినిమా థియేటర్ల కంటే వాటి పక్కన ఉండే కిరాణాషాప్ వాళ్లు ఎక్కువ సంపాదిస్తున్నారంటూ హీరో నాని చేసిన కామెంట్లు అధికార పార్టీలో వేడిని పుట్టించాయి. మార్కెట్లో ప్రతిదానికి ఎమ్మార్పీ ఉన్నట్లే సినిమా టిక్కెట్లకు కూడా ఎమ్మార్పీ అవసరమని.. ఇష్టం వచ్చినట్లు టిక్కెట్ రేట్లను పెంచుకుంటామంటే ఎలా అని హీరో నానికి మంత్రి బొత్స కౌంటర్ ఇచ్చారు. అయితే హీరో…
చిత్తూరు జిల్లాలో మొత్తం 37 సినిమా థియేటర్ల మూసివేతకు ఆదేశాలు ఇచ్చారు. మదనపల్లిలో 7, కుప్పంలో 4, వి కోట 3, బి.కొత్తకోట 2, పీలేరు 4, పుంగనూరు 4, పలమనేరు 4, రొంపిచర్ల 2, కలికిరి 2, సదుం మొలకల చెరువు, గుర్రంకొండ, కలకడ, తంబల్ల పల్లిలలో ఒక్కే థియేటర్ కు నోటీసులు ఇచ్చారు. అయితే ఈ మధ్యాహ్నం నుంచే 30కి పైగా థియేటర్లు మూతపడ్డయి. అయితే ఈ విషయం పై మీడియాతో మదనపల్లె సబ్…
బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఏపీలో వైసీపీ సర్కారుపై తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్ర పథకాలకు సొంత పేర్లు పెట్టుకుని రాష్ట్ర పథకాలుగా జగన్ సర్కారు ప్రచారం చేసుకుంటోందని జీవీఎల్ మండిపడ్డారు. దేశంలో ఉత్తరప్రదేశ్ తర్వాత కేంద్రం నుంచి అత్యధిక నిధులు పొందుతున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని జీవీఎల్ వెల్లడించారు. అయినా ఏపీ ప్రభుత్వం ఆర్థికంగా వైఫల్యం చెందుతోందని ఆయన విమర్శలు చేశారు. Read Also: రాష్ట్రాలకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు కేంద్ర పథకాలు అమలు…
శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం గురువారం నాడు కబడ్డీ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడి ఆటగాళ్లలో ఉత్సాహం నింపేందుకు ఆయన కాసేపు కబడ్డీ ఆడారు. ఈ క్రమంలో స్పీకర్ తమ్మినేని సీతారాం ఒక టీమ్ తరఫున కబడ్డీ ఆడుతూ కాలు స్లిప్ కావడంతో కింద పడిపోయారు. స్పీకర్ కిందపడగానే ఆయన సిబ్బందితో పాటు ప్లేయర్లు అప్రమత్తమయ్యారు. వెంటనే ఆయన్ను పైకి లేపారు. Read Also: హీరో నానికి థాంక్స్ చెప్పిన మహిళా…
తిరుమల తిరుపతి దేవస్థానం ఉదయాస్తమాన సేవా టిక్కెట్లపై క్లారిటీ ఇచ్చింది. ఈ సేవను 1982లోనే ప్రారంభించినట్టు అదనపు ఈఓ ధర్మారెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న 531 సేవా టికెట్లను మాత్రమే భక్తులకు కేటాయిస్తున్నట్టు పేర్కొన్నారు. చిన్న పిల్లల కార్డిక్ ఆసుపత్రి ఏర్పాటుకు 500 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నట్టు ఆయన తెలిపారు. Read: హీరో నానికి థాంక్స్ చెప్పిన మహిళా నేత.. చిన్న పిల్లల హాస్పటల్‌కు కోటి రూపాయల విరాళంగా అందించిన…
ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల ధరలపై టాలీవుడ్ హీరో నాని తాజాగా చేసిన కామెంట్లు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి.. ఏపీ మంత్రులు.. హీరో నానిపై కౌంటర్ ఎటాక్ చేస్తుంటే.. టీడీపీ మహిళా అధ్యక్షురాలు అనిత మాత్రం ఆయనకు బాసటగా నిలిచారు.. టిక్కెట్ ధరలపై హీరో నాని కామెంట్లపై స్పందించిన అనిత… హీరో నానికి థాంక్స్ చెబుతున్నాను.. సినీ ఇండస్ట్రీలో వాళ్లకి ఇప్పటికైనా నొప్పి తెలిసిందని వ్యాఖ్యానించారు.. రెండున్నరేళ్లుగా ప్రభుత్వం చేస్తున్న విధానాలపై సినీ ఇండస్ట్రీ స్పందించలేదన్న అనిత.. ఈ…