ఏపీ వ్యాప్తంగా సినిమా థియేటర్లపై దాడులు జరుగుతున్నాయి. వివిధ రకాల అనుమతుల పేర్లతో అధికారులు తనిఖీలు చేశారు. చిన్న లోపాలకు సైతం జరిమానాలు విధించిన అధికారులు… నిబంధనలు పాటించని థియేటర్లను సీజ్ చేస్తున్నారు. దాంతో ప్రభుత్వ తీరుపై ఎగ్జిబిటర్ల ఆందోళనకు దిగారు. కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఇబ్బందులు పెడుతున్నారని ఎగ్జిబిటర్ల చెబుతున్నారు. విజయవాడలో ఎగ్జిబిటర్ల అత్యవసర సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నారు. బీసీ సెంటర్లలో ప్రస్తుత టికెట్ ధరలతో థియేటర్లను నడపలేమని యజమానులు చెబుతున్నారు. నష్టాలతో నడిపే బదులు…
విజయనగరం రామతీర్థం బోడికొండపై జరిగిన పరిణామాలు చివరకు కేసుల వరకు వెళ్లాయి.. ఈవో ప్రసాద్ ఫిర్యాదు మేరకు నెల్లిమర్ల పోలీస్ స్టేషన్లో కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతి రాజుపై కేసు నమోదైంది.. 473, 353 సెక్షన్ల కింద అశోక్ గజపతిపై కేసు నమోదు చేశారు పోలీసులు.. అయితే, ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అశోక్ గజపతి రాజు.. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ ఘటనలోకి టీడీపీ అధినేత చంద్రబాబును లాగడంపై అభ్యంతరం వ్యక్తం…
ప్రత్యేక దర్శనం టోకెన్లను ఆన్లైన్లో జారీ చేసేందుకు సిద్ధమైంది తిరుమల తిరుపతి దేవస్థానం. టీటీడీ రేపు ఉ. 9 గంటలకు 300 ప్రత్యేక దర్శనం టిక్కెట్లు విడుదల చేయనుంది. రోజుకి 20 వేల చొప్పున 6 లక్షల 20 వేల టిక్కెట్లు విడుదల చేస్తుంది. అలాగే ఈరోజు సాయంత్రం సర్వదర్శనం టోకెన్లు విడుదల చేయనున టీటీడీ.. వచ్చే నెల నుండి ఆఫ్‌లైన్‌లో 5 వేల టోకెన్లు జారీ చేయనున్నారు టీటీడీ అధికారులు. రోజుకి 5వేల చొప్పున లక్షా…
ప్రజాప్రతినిధులకు ప్రొటోకాల్ ఉంటుంది. తమతోపాటు బంధుగణానికి ప్రత్యేక మర్యాదలను కోరుకుంటారు నాయకులు. గుళ్లూ.. గోపురాల్లో ఆ హంగామా మరీ ఎక్కువ. ఈ కోవలోనే ఓ మంత్రిగారి వియ్యంకుడు ఆలయానికి వెళ్లారు. అమాత్యుడికి దక్కే గౌరవమే తనకు లభిస్తుందని వియ్యంకుడు ఆశించారు. కానీ.. అలా జరగలేదు. దీంతో మినిస్టర్ పేషీనే కదిలింది. వియ్యంకుడికే అవమానమా.. అంటూ సిబ్బందిపై వేటు వేసింది. ఆ రగడేంటో లెట్స్ సిబ్బందిని అమరావతికి పిలిచి అక్షింతలు..! సింహాచలం ఆలయంలో ఈ మధ్య భక్తుల రద్దీ…
కేంద్ర మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజుపై కేసు నమోదు చేశారు పోలీసులు.. నిన్న రామతీర్థం ఘటన నేపథ్యంలో ఆలయ ఈవో ప్రసాద్ ఫిర్యాదు మేరకు నెల్లిమర్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.. రామతీర్థంలో శంకుస్థాపన కార్యక్రమానికి, తమ విధులకు ఆటంకం కలిగించారంటూ అశోక్‌గజపతిరాజుపై ఫిర్యాదు చేశారు ఈవో ప్రసాద్.. దీంతో.. 473, 353 సెక్షన్ల కింద అశోక్ గజపతిపై కేసు నమోదు చేశారు పోలీసులు.. కాగా, విజయనగరం రామతీర్థం బోడికొండపై బుధవారం…
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సొంత జిల్లాలో పర్యటించనున్నారు.. నేటి నుంచి 3 రోజుల పాటు కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన కొనసాగనుంది… నేడు ప్రొద్దుటూరు మండలం బొల్లవరంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం… బొల్లవరంలో నిర్వహించే బహిరంగసభలో ప్రసంగించనున్నారు.. బద్వేలు రెవెన్యూ డివిజన్ కార్యాలయానికి శంకుస్థాపన చేయనున్నారు.. నేటి నుంచి ఈ నెల 25వ తేదీ వరకు మూడు రోజుల సీఎం పర్యటనకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే.. ఇవాళ ఉదయం 10.30 గంటలకు గన్నవరం…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 28,670 శాంపిల్స్ పరీక్షించగా.. 103 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరో ఇద్దరు కోవిడ్ బాధితులు మృతి చెందారు. ఇక, ఇదే సమయంలో 175 మంది కోవిడ్ నుంచి పూర్తి స్థాయిలో కోలుకున్నారు. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 3,10,67,410…
ఏపీలో విచిత్రమయిన పరిస్థితి ఏర్పడింది. థియేటర్లలో టికెట్ల రచ్చ కొనసాగుతుండగా వివిధ జిల్లాల్లో థియేటర్ల సీజ్ వివాదం రేపుతోంది. థియేటర్లపై రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేపడుతున్నారు. ఎక్కడైనా ఉల్లంఘించినట్లు తేలితే థియేటర్లను మూసేస్తున్నారు. ఎక్కడికక్కడ నోటీసులు జారీ చేయడంతో పాటు లైసెన్స్, ఉల్లంఘనపై పూర్తిగా నిఘా పెట్టారు. క్యాంటీన్లను కూడా వదిలిపెట్టడం లేదు. దీంతో థియేటర్ల యాజమాన్యాలు బెంబేలెత్తుతున్నాయి. థియేటర్లలో వరుసగా తనిఖీలు నిర్వహిస్తున్నారు అధికారులు, పోలీసులు. కలెక్టర్లు స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ప్రతీ చోటా థియేటర్ కు…
విజయనగరం రామతీర్థంలో తీవ్ర ఉద్రిక్త నెలకొన్న సంగతి తెలిసిందే.. బోడికొండపై రామాలయ పునర్నిర్మాణ శంకుస్థాపన జరుగుతున్న సమయంలో ఆలయ ధర్మ కర్త అశోక్ గజపతిరాజుకు మంత్రి వెల్లంపల్లికి మధ్య వాగ్వాదం జరగడం.. తనను కొబ్బరికాయ కూడా కొట్టకుండా మంత్రి వెల్లంపల్లి అడ్డుకున్నారని అశోక్ గజపతి రాజు అసహనం వ్యక్తం చేయడం, ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. అయితే, ఈ పరిణామాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. వీధి రౌడీల్లా అశోక్ గజపతిరాజుపై…
ఒమిక్రాన్ వేరియంట్ మన దేశంలో క్రమ క్రమంగా విజృంభిస్తూనే ఉంది. ఇప్పటికే మన దేశంలో 200 కు పైగా ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా.. ఏపీలో మరో ఒమిక్రాన్ కేసు వెలుగు చూసింది. కెన్యా నుంచి తిరుపతి వచ్చిన మహిళకు ఒమిక్రాన్ నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. 39 ఏళ్ల సదరు మహిళ ఈ నెల 12 వ తేదీన కెన్యా నుంచి చెన్నై వచ్చారు. అక్కడి నుంచి తిరుపతి చేరుకున్న మహిళ నమూనాలను…