అమరావతి కార్పొరేషన్ పేరుతో జగన్ ప్రభుత్వం మరో కుట్రకు తెరలేపిందని మాజీ మంత్రి, టీడీపీ పొలిటిబ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆరోపణలు చేశారు. అమరావతి రాజధానిని 29 గ్రామాల పరిధి నుంచి 19 గ్రామాలకు పరిమితం చేసేందుకే అమరావతి క్యాపిటల్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారని… కార్పొరేషన్ పేరులోనే క్యాపిటల్ సిటీ అని పేర్కొని కొత్త కుట్రకు తెరలేపారని విమర్శించారు. రాజధాని పరిధిలో ఎలా ముందుకెళ్లాలన్నా తమ అనుమతి అవసరం అని స్పష్టం చేసిన హైకోర్టు…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి బహిరంగ లేఖ రాశారు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. ఈ సారి లేఖలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు వ్యవహారాన్ని ప్రస్తావించారు.. పోలవరం నిర్వాసితుల సమస్యలు తక్షణమే పరిష్కరించి, వారి దీక్షలు విరమింపజేయాలని లేఖలో కోరిన ఆయన.. అందరికీ చట్టప్రకారం పునరావాసం కల్పించాలని కోరారు.. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అందరికీ ఇవ్వాలని కోరిన ఆయన.. సీఎం వైఎస్ జగన్ గతంలో ప్రకటించి రూ. 10 లక్షల ప్యాకేజీ…
ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు అల్లుడు నరసింహంపై ఫోర్జరీ, చీటింగ్ కేసులు నమోదయ్యాయి. ఈ వార్తలపై సోము వీర్రాజు స్వయంగా స్పందించారు. తనకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారని… వీరిలో పెద్దమ్మాయికి తాను పెళ్లిచేయలేదని వివరణ ఇచ్చారు. తనకు ఇద్దరే అల్లుళ్లు ఉన్నారని సోము వీర్రాజు స్పష్టం చేశారు. తన పెద్దమ్మాయి తానే పెళ్లిచేసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయిందన్నారు. ఆమె పెళ్లిచేసుకున్న వ్యక్తికి తాను కాళ్లు కడిగి కన్యాదానం చేయలేదని… కాబట్టి అతడిని తన అల్లుడిగా ఎప్పటికీ…
ఏపీలో ఓటర్ల లెక్కలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఏపీలో మొత్తం 4,07,36,279 మంది ఓటర్లు ఉన్నట్లు సీఈసీ వెల్లడించింది. పురుష ఓటర్లు 2 కోట్ల ఒక లక్ష 34 వేల 664 మంది ఉండగా, మహిళా ఓటర్లు 2 కోట్ల 5 లక్షల 97 వేల 544 మంది ఉన్నారు. దీంతో పురుషుల కంటే 4,62,880 మంది మహిళా ఓటర్లు ఎక్కువ ఉన్నట్లు స్పష్టమైంది. మొత్తం ఓటర్లలో 4,06,61,331 మంది సాధారణ ఓటర్లు, 7,033 మంది…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే సంక్రాంతి పండగ ఏర్పాట్లు జరుగుతున్నాయి.. ఓవైపు సర్కార్, పోలీసులు నిఘా పెడుతున్నా కోడి పందాల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.. పని చేస్తున్న ప్రాంతాన్ని వదిలి.. సొంత ఊరికి పరుగులు పెడుతున్నారు.. దీని కోసం ప్రత్యేక రైళ్లు, ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.. ఇక, సంక్రాంతి పండుగ నేపథ్యంలో రేషన్ షాపుల ద్వారా పండగకు అవసరమైన సరుకులను కూడా పంపిణీ చేస్తూ ఉంటుంది సర్కార్.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేకంగా రేషన్…
★ నేడు ఉద్యోగ సంఘాలతో ఏపీ సీఎం జగన్ చర్చలు… తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం★ చిత్తూరు జిల్లాలో నేటి నుంచి మూడు రోజుల పాటు చంద్రబాబు పర్యటన.. కుప్పం మండలం దేవరాజపురం నుంచి పర్యటించనున్న చంద్రబాబు.. నేడు రామకుప్పం మండలంలో చంద్రబాబు రోడ్ షో★ అమరావతి రాజధాని నగరపాలక సంస్థ ఏర్పాటుపై నేడు రెండో రోజు గ్రామసభలు… నేడు కృష్ణాయపాలెం, వెంకటపాలెం, లింగాయపాలెం, ఉద్ధండరాయునిపాలెంలో గ్రామసభలు★ పశ్చిమగోదావరి జిల్లాలో నేటి నుంచి…
సముద్రాన్ని నమ్ముకుని జీవిస్తున్న మత్స్యకారులు. అయితే, ఓ వర్గం నిబంధనల్ని తుంగలోకి తొక్కి చేపల్ని వేటాడుతోంది. దీంతో మరో వర్గం ఆకలితో అలమటిస్తోంది. ప్రకాశం జిల్లాలో తమిళనాడు మత్స్యకారుల దోపిడీ హాట్ టాపిక్ అవుతోంది. ప్రకాశం జిల్లా మత్స్యకారులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. తమిళనాడు నుంచి వస్తున్న మెకనైజ్డ్ బోట్లు మత్స్య సంపదను దోచుకుపోతుండడంతో ఆకలితో అలమటిస్తున్నారు స్థానిక జాలర్లు. కడుపు కాలి ప్రతిఘటించేందుకు ప్రయత్నిస్తే వలల్ని, బోట్లను ధ్వంసం చేస్తున్నారు. భౌతిక దాడులకు సైతం పాల్పడుతున్నారు…
ఏపీ సర్కార్, సీఎం వైఎస్ జగన్‌పై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. రాష్ట్ర విభజన కంటే వైఎస్ జగన్ చేసిన డామేజ్ నుంచి రాష్ట్రం కోలుకోవడం చాలా కష్టం అన్నారు.. కరోనా వైరస్‌కి మందుందేమో కానీ.. జగన్ వైరస్‌కి మందు లేదని మండిపడ్డారు.. ఏపీ అప్పు రూ. 7 లక్షల కోట్లకు చేరిందన్న బాబు.. ఉద్యోగులకు చరిత్రలో ఎవ్వరూ ఇవ్వనంత ఫిట్మెంట్ టీడీపీనే ఇచ్చిందన్నారు.. చెత్త మీద పన్నేసిన చెత్త ప్రభుత్వం…
ఏపీలో క్రమంగా ఒమిక్రాన్ వేరియంట్ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఏపీలో బుధవారం మధ్యాహ్నం మరో నాలుగు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అమెరికా నుంచి వచ్చిన ఒకరికి, యూకే నుంచి వచ్చిన ఇద్దరితో పాటు విదేశాల నుంచి వచ్చిన వ్యక్తి నుంచి మరో మహిళకు ఒమిక్రాన్ సోకినట్లు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 28కి చేరింది. Read Also: పావురం కాలికి చైనా ట్యాగ్……
ఏపీ ప్రభుత్వం చేస్తున్న అప్పుల సంఖ్య మరింత పెరుగుతోంది. తాజాగా మరో రూ.2,500 కోట్ల రుణాన్ని ఏపీ ప్రభుత్వం సమీకరించింది. రిజర్వుబ్యాంకు నిర్వహించిన సెక్యూరిటీల వేలంలో పాల్గొని ప్రభుత్వం ఈ రుణాన్ని పొందింది. రాబోయే 20 ఏళ్ల కాలపరిమితితో రుణం తిరిగి చెల్లించేలా 7.22 శాతం వడ్డీతో రూ.వెయ్యి కోట్లు తీసుకుంది. మరో వెయ్యి కోట్లను 18 ఏళ్ల కాలపరిమితికి 7.18 శాతం వడ్డీకి స్వీకరించింది. మరో రూ.500 కోట్లను 16 ఏళ్ల కాలపరిమితితో 7.24 శాతం…