ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. కేసులు పెరుగుతున్నాయి. ఈరోజు నుంచి ఏపీలో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. కరోనా థర్డ్ వేవ్ కారణంగా వైద్యులకు, వైద్యసిబ్బందికి జనవరి 10 నుంచి బూస్టర్ డోసులు అందిస్తున్నారు. సాధారణ ప్రజలతో పాటు వైద్యులు, వైద్యసిబ్బంది కరోనా బారిన పడుతున్నారు. తాజాగా విజయవాడలోని జీజీహెచ్‌లో కరోనా కలకలం రేగింది. జీజీహెచ్‌లో 50 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది. 20 మంది జూనియర్ వైద్యులు, సిబ్బంది కరోనా బారిన పడ్డారు.…
ఎన్టీఆర్ 26వ వర్థంతి సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన సమాధికి నందమూరి కుటుంబసభ్యులు నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి కూడా నివాళులర్పించిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ చనిపోయినప్పుడు ఆయన ఆత్మతో మాట్లాడానని ఆమె వెల్లడించారు. 26 ఏళ్ల తర్వాత ఒక రహస్యం చెబుతున్నానని… ఎన్టీఆర్ చనిపోయినప్పుడు జీవిత, రాజశేఖర్ తనను మద్రాస్ తీసుకెళ్లి ఒక అమ్మాయితో మాట్లాడించారన్నారు. ఎన్టీఆర్ ఆత్మ 16ఏళ్ల అమ్మాయిలో ప్రవేశించి…
తెలుగు దేశం పార్టీకి కరోనా టెన్షన్ పట్టుకుంది. ఆ పార్టీలో సీనియర్ నేతలు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. ముందుగా టీడీపీ అధినేత తనయుడు నారా లోకేష్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా… ఒక్కరోజు తేడాలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా కరోనా వలలో చిక్కుకున్నారు. అంతకుముందు కూడా పలువురు టీడీపీ నేతలు కరోనా బారిన పడ్డా… ఇప్పుడు వరుసగా సీనియర్ నేతలకు కరోనా సోకడం ఆ పార్టీలో కలకలం రేపుతోంది. తాజాగా టీడీపీ సీనియర్ నేత,…
ఏపీలో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం సీనియర్ కేటగిరీలో అసిస్టెంట్, స్టెనో, అకౌంటెంట్, ట్రాన్స్‌లేటర్ తదితరులకు రూ.17,500 నుంచి రూ.21,500కు జీతం పెరిగింది. మరోవైపు జూనియర్ విభాగంలో అసిస్టెంట్, స్టెనో, డ్రైవర్, టైపిస్ట్, మెకానిక్, ఫిట్టర్ తదితరులకు జీతాన్ని రూ.15వేల నుంచి 18,500కి పెంచుతున్నట్లు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. వీరితో…
ఏపీలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు కరోనా బారిన పడ్డారు. తనలో కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టులు చేయించుకున్న చంద్రబాబుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని చంద్రబాబు స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం తాను సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నట్లు ఆయన తెలిపారు. వైద్యుల సూచన మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల తనను కలిసినవారందరూ కరోనా టెస్టులు చేయించుకోవాలని చంద్రబాబు సూచించారు. Read Also:…
కొత్త పీఆర్సీపై ఏపీ ప్రభుత్వం సోమవారం రాత్రి జారీ చేసిన ఉత్తర్వులు చూసి ఉద్యోగులు షాకవుతున్నారు. హెచ్ఆర్ఏలో సానుకూల నిర్ణయం వెలువడుతుందని ఎదురుచూసిన ఉద్యోగులకు షాకిస్తూ… ప్రభుత్వం హెచ్ఆర్ఏలో కోత విధించింది. సచివాలయం, హెచ్‌వోడీ ఉద్యోగుల హెచ్ఆర్ఏను 30 శాతం నుంచి 16 శాతానికి తగ్గించింది. ఇప్పటివరకు జిల్లా కేంద్రాలు, నగరపాలక సంస్థల్లో 20 శాతం, పురపాలిక సంఘాలు, 50వేల జనాభా ఉన్న ప్రాంతాల్లో 14.5 శాతం, మిగతా ప్రాంతాల్లో 12 శాతం ఇస్తున్నారు. కొత్త విధానంలో…
ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి నైట్ కర్ఫ్యూ అమలులోకి రానున్నది. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా నైట్ కర్ఫ్యూను అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలు జరుగుతుంది. జనవరి 18 నుంచి 31 వరకు ఈ నైట్ కర్ఫ్యూ అమలు జరుగుతుంది. నైట్ కర్ఫ్యూతో పాటు కొన్ని కొత్త నిబంధనలను కూడా ప్రభుత్వం అమలు చేస్తున్నది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ప్రభుత్వం…
★ ఏపీలో నేటి నుంచి నైట్ కర్ఫ్యూ… కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ప్రకటించిన ఏపీ ప్రభుత్వం★ నేడు టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ 26వ వర్థంతి… ఏపీ వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని టీడీపీ నిర్ణయం… ఆస్పత్రుల్లో పండ్లు పంపిణీ, రక్తదాన శిబిరాలు నిర్వహించనున్న టీడీపీ శ్రేణులు★ నేడు ఏపీలోని 37 గ్రామ సచివాలయాల్లో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు ప్రారంభం… క్యాంప్…