ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 24,066 శాంపిల్స్ పరీక్షించగా 896 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో ఆరుగురు కోవిడ్ బాధితులు కన్నుమూశారు.. అనంతపురంలో ఇద్దరు, చిత్తూరు, తూర్పు గోదావరి, గుంటూరు, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.. ఇక, ఇదే సమయంలో 8,849 మంది కరోనా నుంచి కోలుకున్నారు.. దీంతో.. రాష్ట్రంలో ఇప్పటివరకు 23,12,029 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. అందులో 22,72,881 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 24,454 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనాతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 14,694కి పెరిగింది. ఇక, తాజా కేసుల్లో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 206, గుంటూరు జిల్లాలో 141, కృష్ణా జిల్లాలో 130, పశ్చిమ గోదావరి జిల్లాలో 113 కేసులు నమోదు అయ్యాయి.
Read Also: IPL 2022 Auction: దుమ్ములేపిన ఇషాన్ కిషన్.. రూ.15.25 కోట్లు..