తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది.. అయితే, గత బులెటిన్‌తో పోలిస్తే మాత్రం.. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గగా.. తెలంగాణలో మాత్రం స్వల్పంగా పెరిగాయి.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన కోవిడ్ బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 30,886 శాంపిల్స్ పరీక్షించగా 4,198 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో ఐదుగురు మృతి చెందారు, ఇదే సమయం 9,317 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.. ప్రస్తుతం రాష్ట్రంలో…
పీఆర్సీ ఉద్యమం ఉధృతమైంది.. సమ్మెకు సిద్ధం అవుతున్నారు ఉద్యోగులు.. ఇప్పటికే పెన్ డౌన్ అంటూ.. ఆందోళనను ఉధృతం చేశారు.. అయితే, ఉద్యోగ సంఘాల నేతల తీరుపై సీరియస్ గా స్పందించారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. మాటలు, వాటికి కౌంటర్లు చేస్తూ వెళితే అసలు సమస్య డైవర్ట్ అవుతుందని.. దీని వల్ల ఉద్యోగులకే నష్టం అన్నారు.. ఉద్యోగ సంఘాల నాయకులు ఏం చేయాలనుకుంటున్నారో నాకు అర్ధం కావడం లేదన్న ఆయన.. ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత…
ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పదవులు చిచ్చు పెడుతున్నాయి.. తాజాగా, జరిగిన పరిణామాలపై ఆవేదనకు గురైన ఫైర్ బ్రాండ్, ఎమ్మెల్యే ఆర్కే రోజా.. అవసరం అయితే రాజీనామాకైనా సిద్ధమంటున్నారు.. ఇంతకీ ఆమె అసంతృప్తి కారణం ఏంటంటే.. శ్రీశైలం బోర్డు చైర్మన్ నియామకమే. తాజాగా, శ్రీశైలం బోర్డు చైర్మన్‌గా చెంగారెడ్డి చక్రపాణిరెడ్డిని నియమించారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. అయితే, ఈ వ్యవహారం రోజాకు మింగుడుపడడం లేదు.. చక్రపాణిరెడ్డికి పదవి ఇవ్వడంపై రోజా కినుకు వహించారు.. కాగా,…
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్.. కేసీఆర్.. ఈ మధ్య రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే కాగా.. ఇవాళ తాడేపల్లిలో ఏపీ ఎస్సీ, ఎస్టీ గెజిటెడ్ అధికారుల సంక్షేమ సంఘం డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో.. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ప్రభుత్వ సలహాదారు సజ్జలతో కలిసి పాల్గొన్న మంత్రి ఆదిమూలపు సురేష్.. కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు.. కొంత మంది కుహనా మేధావులు రాజ్యాంగం మార్చాలని అంటున్నారని ఆగ్రహం…
ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. తాడేపల్లిలో జరిగిన ఏపీ ఎస్సీ, ఎస్టీ గెజిటెడ్ అధికారుల సంక్షేమ సంఘం డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ సలహాదారు సజ్జల, పలువురు ప్రజా ప్రతినిధులతో కలిసి పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చంద్రబాబు ఓట్ల కోసం మాల, మాదిగల్లో చీలికలు తీసుకుని వచ్చారని ఆరోపించారు.. తమ సమస్యలు పరిష్కారించాలనే గెజిటెడ్ ఉద్యోగులు మనల్ని ఇక్కడకు పిలిచారన్న ఆయన.. అమ్మ ఒడి…
ఆంధ్రప్రదేశ్‌లో పీఆర్సీ ఉద్యమం ఉధృతం రూపం దాల్చింది.. ఇవాళ నిర్వహించిన ఛలో విజయవాడ కార్యక్రమం విజయవంతం కావడంతో.. వారిలో మరింత పట్టుదల పెరిగింది.. రేపు సమావేశమై… భవిష్యత్ కార్యాచరణ ప్రకటించడానికి సిద్ధం అయ్యారు.. ఇదే సమయంలో సమ్మెకు సిద్ధం అవుతున్నారు.. ఇక, ఉద్యోగులకు క్రమంగా మద్దతు పెరుగుతోంది.. ఇవాళ ఉద్యోగుల ఉద్యమానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ మద్దతు పలికారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా ఆ కష్టాలు తనకు తెలుసునని.. ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారని ఇన్నాళ్లు…
పీఆర్సీ విషయంలో ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించిన ఉద్యోగులు.. ఇవాళ ఛలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం నిర్వహించారు.. విజయవాడలోని రోడ్లు.. ఉద్యోగులతో కిక్కిరిసిపోయాయి.. పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా.. ఉద్యోగుల కార్యక్రమాన్ని అడ్డుకోలేకపోయారు.. పెద్ద ఎత్తున అరెస్ట్ లు, నిర్బంధాలు కూడా వారిని ఆపలేకపోయాయి.. ఇక, ఛలో విజయవాడపై స్పందించిన స్టీరింగ్ కమిటీ సభ్యుడు బండి శ్రీనివాసరావు.. రాష్ట్రం నలుమూలల నుంచి ఛలో విజయవాడకు లక్షలాదిగా ఉద్యోగులు తరలివచ్చారని తెలిపారు.. ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా ఛలో విజయవాడను…
పీఆర్సీ విషయంలో ఆందోళన బాటపట్టిన ఉద్యోగులు.. ఇవాళ ఛలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించారు.. అయితే, సమ్మె విరమించండి.. సమస్యలు చర్చల ద్వారానే పరిష్కారమవుతాయని ఉద్యోగులను కోరారు సీఎస్ సమీర్ శర్మ… మా కుటుంబంలో కోపం ఉంటే మాట్లాడుకుంటాం.. కొన్ని ఇబ్బందులు ఉంటాయి.. వాటి మీద చర్చించడానికి సిద్ధంగా ఉన్నామన్న ఆయన.. అసలు సమ్మె చేస్తే ఏమి వస్తుందని ప్రశ్నించారు.. ఇప్పుడు ఇచ్చిన ఐఆర్ సుమారు 30 నెలల పాటు ఇచ్చాం.. ఐఆర్ అనేది ఇంట్రస్ట్ ఫ్రీ లోన్…