రాష్ట్రంలోని చిరు వ్యాపారులకు గుడ్‌న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ‘జగనన్న తోడు’ మూడో విడత కింద లబ్ధిదారులకు ఈరోజు సొమ్ము విడుదల చేయనున్నారు.. జగనన్న తోడు పథకం మూడో విడత సొమ్ము ఇప్పటికే విడుదల కావాల్సి ఉన్నా… మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మృతితో వాయిదా వేశారు సీఎం వైఎస్ జగన్.. ఇక, ఇవాళ 5.10 లక్షల మందికి వడ్డీ లేని రుణాలను పంపిణీ చేయనున్నారు.. తొలి విడతలో 5.35 లక్షల మంది, రెండో విడతలో 3.70 లక్షల మందికి రుణాలు అందించింది వైఎస్ జగన్ సర్కార్.. మూడో విడతతో కలిపి మొత్తం 14.16 లక్షల మందికి ఈ పథకం ద్వారా లభ్ది చేకూరనుంది..
Read Also: Ukraine Russia War: చర్చలకు సిద్ధమైన ఉక్రెయిన్
కాగా, జగనన్న తోడు పథకం కింద చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలను పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే.. అందులో భాగంగా ఇవాళ లబ్ధిదారుల ఖాతాల్లో సీఎం జగన్ రుణాలను జమ చేయనున్నారు. ఉదయం 11 గంటలకు తన క్యాంపు కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభించనున్నారు ఏపీ సీఎం.. చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, చేతి వృత్తుల వారికి రుణాలను అందిస్తారు.. ఈ పథకం కింద ఏటా రూ. 10 వేల చొప్పున వడ్డీలేని రుణాలను పొందే వెసులుబాటు ఉంది.