ప్రపంచ దేశాలకు గతంలో ఇండియా అంటే గాంధీ గుర్తుకు వచ్చేవారు.. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ గుర్తుకు వస్తున్నారని తెలిపారు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్.. ఏపీ పర్యటనలో ఉన్న ఆయన.. బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు.. కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. నరేంద్ర మోడీ లాంటి నేత మరెవరూ లేరన్న ఆయన.. ప్రపంచంలోనే అతి పెద్ద పొలిటికల్ పార్టీ బీజేపీ అన్నారు. అతి చిన్న పార్టీగా ప్రస్ధానం మొదలు పెట్టి.. అతి పెద్ద పార్టీగా అవతరించిందని.. అతి పెద్ద పార్టీగా అవతరించినా సిద్ధాంతాలను ఏనాడూ వదల్లేదని.. చివరి వరుసలో కూర్చొన్న వాళ్లకూ సంక్షేమ ఫలాలు అందేలా చూడడం మోడీ లక్ష్యంగా తెలిపారు గజేంద్ర సింగ్ షెకావత్.
Read Also: Venkaiah Naidu: చట్టసభల గౌరవాన్ని కాపాడండి..
రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలో ప్రపంచమంతా భారత్ వైపే చూస్తోందన్నారు షెకావత్.. ప్రపంచ దేశాలకు గతంలో ఇండియా అంటే గాంధీ గుర్తొచ్చే వారని.. ఇప్పుడు మోడీ గుర్తొస్తున్నారని తెలిపారు. మోడీ ప్రధాని కాక ముందు ప్రతి రోజూ బాంబ్ బ్లాస్టులు జరిగేవి.. కానీ, ఇప్పుడా పరిస్థితి లేదన్న ఆయన.. గ్రామ, రైతులు, పీడిత ప్రజల అభివృద్ధే లక్ష్యంగా మోడీ పని చేస్తున్నారని తెలిపారు.. కేంద్ర పథకమైన జల్ జీవన్ మిషన్ పథకం అమలు ఏపీలో సరిగా జరగడం లేదని.. జల్ జీవన్ మిషన్ పథకం కింద ఏపీకి రూ. 7 వేల కోట్లు కేంద్రం కేటాయించిందని తెలిపారు. ఇందులో కేంద్రం వాటా రూ. 3800 కోట్లు.. ఇప్పటి వరకూ జల్ జీవన్ మిషన్ కింద ఏపీ కేవలం రూ. 190 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిందని.. కేవలం 20 శాతం మాత్రమే జల్ జీవన్ మిషన్ పథకాన్ని ఏపీలో అమలు చేశారన్నారు.. జల్ జీవన్ మిషన్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు..? అని ప్రశ్నించిన కేంద్ర మంత్రి.. బెంగళూరులో జరిగే దక్షిణాది రాష్ట్రాల సదస్సులో ఈ అంశంపై ఏపీని ప్రశ్నిస్తాం అన్నారు. ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ ఇలాంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉందన్న ఆయన.. నరేగా కింద రూ. 70 వేల కోట్ల నిధులను ఏపీకి ఇచ్చారని.. రైల్వే ప్రాజెక్టుల కోసం కేంద్రం రూ. 64 వేల కోట్లు ఏపీకి ఇచ్చామని.. పేదలు మోడీ నాయకత్వం పట్ల మొగ్గు చూపుతున్నారని.. అద్భుతమైన బ్యాంకింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసింది మోడీ ప్రభుత్వమేనని.. దేశంలోని నూటికి నూరు శాతం గ్రామాల్లో విద్యుత్ వెలుగులు విరజిమ్ముతున్నాయని తెలిపారు.