ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రాయలసీమ రాష్ట్ర సమితి (ఆర్ఆర్ఎస్) డిమాండ్ చేసింది. మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ప్రయత్నించడం సరికాదని ఆర్ఆర్ఎస్ అధ్యక్షుడు కుంచం వెంకట సుబ్బారెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ మేరకు మీడియా ప్రకటన విడుదల చేశారు. విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటు వల్ల రాయలసీమ ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతుందన్నారు. దీనికంటే అమరావతి రాజధానిగా ఉంటేనే రాయలసీమకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. రాయలసీమ ప్రాంత ప్రయోజనాల గురించి ఎవరూ ఆలోచించడం లేదని, కేంద్ర…
ఇటీవల ఏపీ డీజీపీగా గౌతమ్ సవాంగ్ స్థానంలో కొత్త డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో నూతన డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ రాశారు. తనపై సీఐడీ అధికారుల దాడి ఘటనపై త్వరగా దర్యాప్తు జరపాలని విజ్ఞప్తి చేశారు. దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. తప్పుడు కేసులు బనాయించి తనను చిత్రహింసకుల గురిచేశారని డీజీపీకి రఘరామకృష్ణంరాజు వెల్లడించారు. తనపై దాడి చేసిన…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. మాఘమాసంలో ఎక్కువ జరిగే పెళ్లిళ్లు, శుభకార్యాలకు రాజకీయ ప్రముఖులు కూడా హాజరవుతుంటారు. అయితే తమ పార్టీ నేతల అన్ని శుభకార్యాలకు హాజరుకావడం కీలక నేతలకు సాధ్యం కాని విషయం. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు చాలా మంది మాఘమాసంలో జరిగే శుభకార్యాలకు హాజరు కావాలని తమ నాయకుడు లోకేష్ను ఆహ్వానిస్తున్నారు. అందరి పెళ్లిళ్లకు వెళ్లడం టీడీపీ నేత…
మేషం :- రాజకీయనాయకులు పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. మీ కుటుంబానికి మీరు అవసరం కనుక వ్యసనాలకు దూరంగా ఉండండి. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షలకు సంబంధించిన సమాచారం అందుతుంది. వృషభం :- ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. యాదృచ్చికంగా ఒక పుణ్య క్షేత్రం సందర్శిస్తారు. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఆత్మీయుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. సభలు,…
తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి.. తెలంగాణతో పాటు ఏపీలోనూ నాలుగు వందలకు చేరువయ్యాయి రోజువారి పాజిటివ్ కేసులు.. ఏపీలో గత 24 గంటల్లో 19,769 శాంపిల్స్ పరీక్షించగా.. 425 మందికి పాజిటివ్గా తేలింది.. మరో ఇద్దరు కోవిడ్ బాధితులు కన్నుమూశారు.. ఇదే సమయంలో 1,486 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 23,15,950కి చేరుకోగా.. రికవరీ కేసులు 22,93,882కు చేరాయి.. ఇక, ఇప్పటి వరకు 14,710…
సినిమా టికెట్లతో పాటు.. సినీ పరిశ్రమకు చెందిన ఇతర సమస్యల పరిష్కారానికి ముందడుగు పడింది.. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వంతో చర్చలు గత కొన్ని నెలలుగా కొనసాగగా.. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ముందుండి పరిష్కారం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. సినీ పరిశ్రమ తరపున ముందుడి.. ఏపీ ప్రభుత్వ పెద్దలతో మాట్లాడారు.. ఇక, సీఎం జగన్తో ప్రత్యేకంగా సమావేశమైన చర్చించారు.. ఆ తర్వాత చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ తదితరులు కూడా వెళ్లి సమస్యల…
జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ శనివారం నాడు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా వైసీపీ శ్రేణులు దౌర్జన్యానికి పాల్పడి చింతా అనంతలక్ష్మీ పూరింటిని కూల్చివేశారని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. రాత్రికి రాత్రి 200 మంది రౌడీ మూకలతో ఈ ఘటన జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో ఆపదలో ఉన్న అనంతలక్ష్మీ కుటుంబాన్ని ఆదుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ…
గుంటూరు జిల్లా పేరేచర్ల-కొండమోడు రహదారి విస్తరణ పనులు చేపట్టాలంటూ సత్తెనపల్లి టీడీపీ కార్యాలయం నుంచి టీడీపీ నేత కోడెల శివరాం చేపట్టిన పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. ముందస్తుగా ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో టీడీపీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో సత్తెనపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంతకుముందు రాజుపాలెం నుంచి దేవరంపాడు గుడి వరకు పాదయాత్రను ప్రారంభించేందుకు ఎన్టీఆర్ భవన్కు వెళ్లిన కోడెల శివరాం టీడీపీ కార్యాలయంలో జెండా ఎగురవేశారు. అనంతరం…