గ్రామ స్వరాజ్యం అంటూ మహాత్మా గాంధీ చెప్పిన విషయాన్ని చేసి చూపిన వ్యక్తి సీఎం వైఎస్ జగన్ అంటూ ప్రశంసలు కురిపించారు మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి.. ఎంపీటీసీ సభ్యులకు, కో-ఆప్షన్ సభ్యులకు ఏర్పాటు చేసిన ట్రైనింగ్ ప్రొగ్రామ్‌లో ఆయన మాట్లాడుతూ.. అందరికీ అభినందనలు తెలిపారు.. ఇక, గతంలో స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశారని.. స్థానిక సంస్థలు అందరికీ ఉపయోగకరంగా ఉండాలంటే సభ్యులకు బాధ్యతను గుర్తు చేయాలని సీఎం సూచించారని.. అందుకే ఎంపీటీసీ సభ్యులకు, కో-ఆప్షన్ సభ్యులకు ట్రైనింగ్ ఏర్పాటు చేశామన్నారు.. ఇప్పటికే 1.35 లక్షల మంది వార్డు మెంబర్లకు ట్రైనింగ్ ఇచ్చామని.. 13,086 మంది సర్పంచ్‌లకు కూడా ట్రైనింగ్ క్లాసులు నిర్వహించామన్న ఆయన.. ఎంపీపీలకి ప్రత్యేకంగా మూడు రోజులు ట్రైనింగ్ ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు.. అదేవిధంగా జెడ్పీటీసీలకు కూడా ట్రైనింగ్ నిర్వహించనున్నట్టు వెల్లడించారు.
Read Also: TDP: విశాఖలో ‘వీజే’ టాక్స్.. తుఫాన్ కంటే వేగంగా వైజాగ్‌ను ధ్వంసం చేస్తున్నారు..!
గతంలో ఎప్పుడూ లేని విధంగా 50 శాతం మంది మహిళా సభ్యులు ఉన్నారని తెలిపారు మంత్రి పెద్దిరెడ్డి.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 శాతం పదవులు ఇచ్చిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్న ఆయన.. గ్రామ స్వరాజ్యం అంటూ మహాత్మా గాంధీ చెప్పిన విషయాన్ని చేసి చూపిన వ్యక్తి వైఎస్ జగన్ మోహన్ రెడ్డే అన్నారు.. ప్రతి 2000 మందికి సచివాలయం ఏర్పాటు చేశారు.. సచివాలయ వ్యవస్థలో ప్రజాప్రతినిధులు అందరూ భాగస్వాములే.. ఇదే విషయం అన్ని సచివాలయాలకు తెలియజేస్తామన్న ఆయన.. గ్రామాల పరిశుభ్రతపై ఎంపీటీసీ సభ్యులు శ్రద్ద వహించాలని.. ప్రతీ పంచాయతీకి ట్రాక్టర్ ఇస్తున్నాం, అందరూ శ్రద్ద తీసుకుని చెట్లు నాటించాలని సూచించారు.. ఇబ్బందులు ఏమైనా ఉంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలి.. ఎంపీటీసీలు చేసే అభివృద్ధి గ్రామాల్లో గుర్తుండి పోవాలన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.