వైఎస్ జగన్ పర్యటనలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్.. శ్రీ సత్యసాయి జిల్లా పర్యటనలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వైఎస్ జగన్ పరామర్శ పేరుతో దండయాత్రలు చేస్తున్నారని విమర్శించారు.. పోలీసులు రక్షణ ఇవ్వకపోతే ఇవ్వలేదంటారు.. ఎక్కువ మంది పోలీసులను పెడితే.. 2 వేల మంది పోలీసులను పెట్టారని మళ్లీ ఇప్పుడు కామెంట్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఘటన కలకలం రేపింది.. బయో కెమిస్ట్రీ ల్యాబ్ అటెండెంట్ కళ్యాణ్ చక్రవర్తి, మైక్రో బయాలజీ టెక్నీషియన్ జిమ్మీ రాజు, బయో కెమిస్ట్రీ ఎల్ టీ గోపాలకృష్ణ, పాదాలజీ ఎల్టీ ప్రసాద్ తమ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని ఫిర్యాదు చేశారు విద్యార్థినులు.. మెయిల్ ద్వారా ఒకేసారి ఫిర్యాదు చేశారు 50 మంది విద్యార్థినులు.. అయితే, ఈ ఘటనపై సీరియస్ అయ్యారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. నిందితులపై కఠిన…
పల్నాడు జిల్లా... వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి.. వాలంటీర్ వ్యవస్థపై హాట్ కామెంట్స్ చేశారు.. నరసరావుపేటలో వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొని మాట్లాడిన ఆయన.. వాలంటీర్ వ్యవస్థని నమ్ముకొని గత ఐదేళ్లు పూర్తిగా నష్ట పోయాం అన్నారు.. ఏ పార్టీకైనా కార్యకర్తలు మూల స్తంభాలు.. కానీ, వాలంటీర్లు కాదు అని స్పష్టం చేశారు..
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలినట్టు అయ్యింది.. టీడీపీకి రాజీనామా చేశారు సిరివెళ్ల మండలం గుంపరమందిన్నె ఎంపీటీసీ తులసమ్మ, ఆమె భర్త నీటి సంఘం చైర్మన్ కుందూరు మోహన్ రెడ్డి.. తమ రాజీనామా పత్రాన్ని సిరివెళ్ల ఎంపీడీవోకు అందజేశారు ఎంపీటీసీ తులసమ్మ.. మరోవైపు, నీటి సంఘం చైర్మన్ పదవికి రాజీనామా చేసేందుకు కేసీ కెనాల్ డీఈని సంప్రదించారు కుందూరు మోహన్ రెడ్డి.
వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం పర్యటనపై మరో కేసు నమోదైంది.. జగన్ పర్యటనపై ఇప్పటి దాకా మొత్తం 4 కేసులు నమోదు అయ్యాయి.. అనుమతి లేక పోయినా వైఎస్ జగన్ టూర్ లో రోడ్ షో చేపట్టారని కేసు నమోదు చేశారు పోలీసులు.. హెలిప్యాడ్ వద్దకు అనుమతి లేకుండా వందలాది మంది కార్యకర్తలను తీసుకొచ్చారని మరో కేసు పెట్టారు..
శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది.. ఇన్ ఫ్లో రూపంలో 1,48,696 క్యూసెక్కుల నీరు వచ్చి డ్యామ్‌లో చేరుతుండగా.. మూడు గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు.. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం.. 882.80 అడుగులుగా ఉంది.. శ్రీశైలం డ్యామ్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు అయితే.. ప్రస్తుతం 203.4290 టీఎంసీలుగా ఉంది..
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మరోసారి ఎర్రచందనం స్మగ్లర్లు బరితెగించారు.. ఎర్రచందనం అక్రమ రవాణాకు పోలీస్ స్టిక్కర్లు తమ వాహనాలకు వేసుకొని మరి స్మగ్లింగ్ చేస్తుండగా కల్లూరు రైల్వే బ్రిడ్జి సమీపంలో అటవీశాఖ అధికారులు అరెస్టు చేశారు.. పట్టుబడిన ఇద్దరు స్మగ్లర్లు తిరుపతి రుయా ఆసుపత్రిలో సమీపంలో ఉండే ఆంబులెన్స్ డ్రైవర్లుగా గుర్తించారు..
కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో తమ పట్ల ల్యాబ్ టెక్నీషియన్, మరొక ఎంప్లాయ్ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు.. దీనిపై ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశారు.. ల్యాబ్ టెక్నీషియన్ కల్యాణ్ చక్రవర్తి, జిమ్మి అనే ఇద్దరు ఉద్యోగులు.. తమ పట్ల లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు చెప్తున్నారు స్టూడెంట్స్.