నేడు ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. తుళ్లూరు మండలం వెలగపూడి సచివాలయం సమీపంలో ప్రపంచ జనాభా దినోత్సవం నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు.. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు..
గురు పౌర్ణమి సందర్భంగా ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు గోశాలకు వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎన్నికల్లో కూటమి ఇచ్చిన హామీలను పూర్తి చేసి ముందుకు వెళ్తున్నామని.. ఏపీని దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా కూటమి ప్రభుత్వం చేస్తుందని అన్నారు.. సనాతన ధర్మం గురించి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్తో చర్చించానని తెలిపారు.
మానవ అక్రమ రవాణా ముఠాల చెరలో మగ్గుతున్న తమ కుమారులను రక్షించాలంటూ ఓ మహిళ విజ్ఞప్తి చేయడంతో వెంటనే స్పందించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఈ వ్యవహారాన్ని వెంటనే కేంద్ర విదేశీ వ్యవహారాల దృష్టికి తీసుకెళ్లారు..
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయానికి ఉన్న ప్రాముఖ్యత, ప్రాశస్త్యం గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ...రెండు రాష్ట్రాల మధ్య ఉన్న, నలుగుతున్న ఆలయ భూముల గురించి మాత్రం రామయ్య భక్తగణంలో తీవ్ర ఆవేదన వ్యక్తం అవుతోంది. ఈ విషయంలో రాజకీయ పార్టీలు అనుసరిస్తున్న వైఖరి ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతూనే ఉంది.
వంగవీటి మోహన రంగా... ఆయన భౌతికంగా దూరమై దశాబ్దాలు గడుస్తున్నా... ఆ పేరు మాత్రం ఎప్పటికప్పుడు ఏపీ పాలిటిక్స్ని ప్రభావితం చేస్తూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా ఎన్నికలు వచ్చినప్పుడైతే... రకరకాల ఈక్వేషన్స్ వంగవీటి చుట్టూనే తిరుగుతుంటాయి. కులాలకు అతీతంగా ఆయన్ని అభిమానించే వాళ్ళు ఉన్నా... ప్రత్యేకించి కాపులు మాత్రం ఎక్కువగా ఓన్ చేసుకుంటారు. ఆయన జయంతి, వర్ధంతి కార్యక్రమాల్లో పొలిటికల్ హంగామా కూడా ఎక్కువగానే జరుగుతూ ఉంటుంది.
పుట్టపర్తి నియోజకవర్గం, కొత్తచెరువు గ్రామంలో మెగా పేరెంట్-టీచర్ మీటింగ్లో పాల్గొన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్.. అయితే, ఉపాధ్యాయుడిగా మారారు ముఖ్యమంత్రి చంద్రబాబు.. పీటీఎం కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు విద్యా బోధన చేశారు.. వనరుల అనే సబ్జెక్ట్ పై విద్యార్థులకు క్లాస్ తీసుకున్నారు.. అయితే, విద్యార్థులతో కలిసి పాఠాలు విన్నారు మంత్రి నారా లోకేష్..