బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఉత్తరాంధ్ర సహా.. దక్షిణ తీర ప్రాంత జిల్లాలు, రాయలసీమలోనూ అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి.. అయితే, రేపు ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని అధికారులు అంచనా వేస్తున్నారు.. దీని ప్రభావంతో వచ్చే నాలుగు రోజులు పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.. ఈ సమయంలో ఉత్తర కోస్తా వెంబడి గంటకు 50 నుంచి 60 కిలో మీటర్లు వేగంతో బలమైన గాలులు వీస్తాయని తెలిపింది..
Investopia Global-AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన ముందడుగు వేసింది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టోపియా గ్లోబల్- ఏపీ పేరిట ఏర్పాటు చేసిన ప్రత్యేక సదస్సు విజయవాడలో ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది.
CPI Ramakrishna: సీపీఐ రాష్ట్ర మహాసభల్లో రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ టీడీపీ, వైసీపీ పార్టీలపై హాట్ కామెంట్స్ చేశారు. ఆదాని పవర్స్ తో 17 వందల కోట్ల రూపాయల లంచం తీసుకుని వైసీపీ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుంది. ఇక, టీడీపీ అధికారంలోకి వచ్చాక యూజర్ చార్జీల పేరుతో మరో రూ. 15 వందల కోట్లు ప్రజలపై భారం వేసింది అని ఆరోపించారు.
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి కోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై ఏసీబీ న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. మిథున్ రెడ్డి రాజమండ్రి జైలులో అవసరమైన కొన్ని సదుపాయాలు కల్పించాలంటూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
Bhumana Karunakara Reddy: మద్యం కుంభకోణం పేరుతో అక్రమ అరెస్టులకు కూటమీ ప్రభుత్వం పాల్పడుతొందని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. చంద్రబాబు మీదా ఏ సెక్షన్ లు అయితే పెట్టారో వాటినే వైసిపి నేతలపై పెడుతున్నారు.
Wipha Cyclone: మరో 24 గంటల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ తెలిపింది. విఫా తుఫాన్ చైనా, హాంకాంగ్ ప్రాంతాల్లో బీభత్సం సృష్టించిన తర్వాత.. అది తీరం దాటి బంగాళాఖాతంలోకి ప్రవేశించడంతో.. ప్రస్తుతం ఇది తుఫానుగా మారిపోయింది.
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు ఈ నెల 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఒక రోజు ముందుగానే ప్రీమియర్స్ వేస్తామని నిర్మాత రత్నం ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే ఆంధ్రప్రదేశ్లో పర్మిషన్ వచ్చేసింది. ఇక తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రీమియర్స్ సహా టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతిస్తూ జీవో జారీ చేసింది. తాజాగా ఈ రోజు కొద్దిసేపటి క్రితమే తెలంగాణ జీవో జారీ అయింది. Also Read:Mumbai: ముంబైలో దారుణం.. భర్తను…
పల్నాడు జిల్లా శావల్యపురం మండలం కనుమర్లపూడి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అశోక్ లే ల్యాండ్ వ్యాన్, ఆటోఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. సంఘటన ప్రాంతానికి చేరుకున్న రూరల్ సిఐ ప్రభాకర్ రావు పరిస్థితిని సమీక్షించారు. మృతులంతా శావల్యాపురం మండలం కారుమంచి వాసులుగా గుర్తించారు. మృతులు బత్తుల బ్రహ్మయ్య, నాగమూర్తమ్మ,…