నేడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కౌలు రైతు భరోసా యాత్ర నిర్వహించనున్నారు. తొలుత హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్న పవన్ కళ్యాణ్ అనంతరం రోడ్డు మార్గంలో కలపర్రు టోల్‌గేటు మీదుగా జానంపేట, అక్కడి నుంచి జాతీయ రహదారి మీదుగా విజయరాయి, పెదవేగి, ధర్మాజీగూడెం, లింగపాలెంకు వెళ్లనున్నారు. అక్కడి నుంచి మళ్లీ ధర్మాజీగూడెం మీదుగా చింతలపూడికి వెళ్తారు. చింతలపూడికి చేరుకునే మధ్యలో పలు గ్రామాల్లో కొందరు కౌలు రైతుల కుటుంబాలను…
రాష్ట్రంలో నూతనంగా కాలుష్యరహిత ఎలక్ట్రిక్ బస్సులను తీసుకువస్తామని రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ వెల్లడించారు. కోనసీమ జిల్లా మామిడికుదురులో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల నుంచి తిరుపతికి నడిపేందుకు పైలట్ ప్రాజెక్టుగా 100 ఎలక్ట్రిక్ బస్సులను సిద్ధం చేస్తున్నట్లు మంత్రి విశ్వరూప్ తెలిపారు. అనంతరం దశల వారీగా విశాఖపట్నం, విజయవాడతో పాటూ ప్రధాన నగరాల మధ్య ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతామని పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రంలో రవాణా వ్యవస్థను పటిష్టం…
★ నేడు ఏలూరు జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన.. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు భరోసా ఇవ్వనున్న పవన్.. ★ విశాఖ: నేటి నుంచి మూడురోజుల పాటు వైసీపీ ఆధ్వర్యంలో జాబ్ మేళా… ఈ జాబ్ మేళా ద్వారా 23,935 మందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ★ నేడు విశాఖ స్టీల్‌ప్లాంట్ గుర్తింపు సంఘం ఎన్నికలు.. 10,589 మంది ఓటర్ల కోసం 17 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు.. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్..…
ఓ వైపు తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుసే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించగా.. మరోవైపు.. ఆంధ్రప్రదేశ్‌లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని.. అవసరం అయితేనే బయటకు రండి అంటూ ఐఎండీ హెచ్చరించింది. ఐఎండీ సూచలన ప్రకారం రాబోవు నాలుగు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలిపారు. ఈ సమయంలో.. వీలైనంతవరకు ఇంట్లోనే ఉండాలని.. డీహైడ్రేట్ కాకుండా…
తిరుమలలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రసారం చేసే టీటీడీ స్క్రీన్ పై ఒక్కసారిగా సినిమా పాటలు ప్రత్యక్షం కావడంతో శ్రీవారి భక్తులు షాక్ తిన్నారు.. శ్రీవారి దర్శనార్ధం వచ్చే భక్తులలో ఆధ్యాత్మికతతో పాటు భక్తిభావం పెంచేందుకు టీటీడీ తిరుమలలోని భక్త జన సంచారం అధికంగా వుండే శ్రీవారి ఆలయం, కళ్యాణకట్టతో పాటు పలు ప్రదేశాల్లో ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేసింది. ఈ స్క్రీన్ల పై టీటీడీ ఎస్వీబీసీ ఛానల్ లో ప్రసారమయ్యే ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు శ్రీవారి ఆలయంలో…
జీవితా రాజశేఖర్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది చిత్తూరు జిల్లా నగరి కోర్టు.. జ్యోస్టర్ ఎండీ హేమ… జీవితపై ఫిర్యాదు చేశారు… ఒకే ఆస్తిని ఇద్దరికి విక్రయించారని జీవితారాజశేఖర్‌పై ఆరోపణలు చేశారు.. ఆమె తనకు ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయని హేమ చెబుతున్నారు. రూ.26 కోట్లు ఎగ్గొట్టారని జీవితారాజశేఖర్‌పై హేమ ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే కాగా.. ఈ వ్యవహారం కోర్టు వరకు చేరింది.. ఇవాళ నగరి జేఎఫ్‌సీఎం కోర్టు.. జీవితా రాజశేఖర్‌కి నాన్ బెయిలబుల్…
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఎదిగిన ఎంపీ విజయసాయి రెడ్డిని.. అనుబంధ సంఘాల ఇంచార్జ్‌కే పరిమితం చేశారు పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. దీనిపై స్పందించిన విజయసాయిరెడ్డి.. ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.. ప్రాంతీయ పార్టీలలో అధినేత ఆదేశాలను పాటించడమే శిరోధార్యం… నాకు ఇది కావాలి, ఇది వద్దు అనే ప్రస్తావన ఎక్కడ రాకూడదన్నారు.. ఛార్టర్డ్ అకౌంటెంట్ అయిన నాకు జగన్ మోహన్ రెడ్డి అనేక అవకాశాలు ఇచ్చారన్న ఆయన.. సాక్షిలో ఫైనాన్స్ డైరెక్టర్ నుంచి…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన ప్రతిపాదన చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కలిసి ముందు సాగితే బాగుంటుందనే ప్రతిపాదన తీసుకొచ్చారు.. అయితే, వైసీపీ, కాంగ్రెస్ దోస్తీ విషయంలో ప్రశాంత్ కిషోర్ ప్రతిపాదనలపై ఘాటుగా స్పందించారు మంత్రి గుడివాడ అమర్నాథ్.. కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసేందుకు పుట్టిందే వైసీపీ అన్న ఆయన.. వ్యూహకర్తలు సలహాలు ఇస్తారు.. కానీ, అమలు చేయాలో లేదో నిర్ణయం…
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుకు నోటీసులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్.. ఈ నెల 27వ తేదీన కమిషన్ ముందు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది… విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో అత్యాచార ఘటన కలకలం సృష్టించగా.. ఇవాళ అత్యాచార బాధితురాలిని పరామర్శించేందుకు నేతలు క్యూ కట్టారు.. ఏపీ మంత్రులతో పాటు.. టీడీపీ నేతలు కూడా ఆస్పత్రికి వెళ్లారు.. ఈ క్రమంలో.. ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి…
ఆంధ్రప్రదేశ్‌లో రేషన్‌కార్డుదారులకు రేషన్ బియ్యానికి బదులు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధం అయ్యింది ప్రభుత్వం.. బియ్యం తీసుకోవాలా, డబ్బులు తీసుకోవాలా అనేది లబ్ధిదారుల ఇష్టమని తెలిపింది.. అయితే, ఇప్పుడు నగదు బదిలీని వాయిదా వేసినట్టు తెలిపారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.. పౌర సరఫరాల శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు మంత్రి.. 26 జిల్లాల జేసీలు, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో.. రేషన్ కార్డుదారులకు నగదు బదిలీని ప్రస్తుతానికి పక్కన పెట్టినట్టు వెల్లడించారు.. యాప్‌లో సాంకేతిక లోపం…