ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ మహిళా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత తనదైన శైలిలో సెటైర్లు వేశారు. జగన్ రెడ్డీ… ప్యాక్ యువర్ బ్యాగ్స్, నీ ఖేల్ ఖతం అంటూ ఎద్దేవా చేశారు. 151 ఎమ్మెల్యేలు ఉండి పరదాలు, బ్యారికేడ్లు లేకుండా బయట కాలు పెట్టలేని యువ నాయకుడని పిలవబడే వృద్ధుడు ఒక వైపు, అర్ధరాత్రి అవుతున్నా అశేష జన సందోహం ప్రేమాభిమానాల మధ్య అలసట లేని ముఖంతో మా నాయకుడు ఓ వైపు అంటూ వంగలపూడి అనిత సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.
Andhra Pradesh: తెగని గన్నవరం పంచాయతీ.. త్వరలో మరోసారి సమావేశం
చచ్చేంత ప్రేమ ఉన్న ఈ జనం సాక్షిగా.. జగన్ రెడ్డీ ప్యాక్ యువర్ బ్యాగ్స్. నీ ఖేల్ ఖతం అంటూ వంగలపూడి అనిత విమర్శలు సంధించారు. దీంతో పాటుగా అశేష జనం మధ్య చంద్రబాబు ఉన్న వీడియోను కూడా ఆమె పోస్ట్ చేశారు.
151 MLA లు ఉండి పరదాలు, బ్యారికేడ్లు లేకుండా బయట కాలు పెట్టలేని యువ నాయకుడని పిలవబడే వృద్ధుడు ఒక వైపు, అర్ధరాత్రి అవుతున్నా అశేష జన సందోహం ప్రేమాభిమానాల మధ్య అలసట లేని ముఖంతో ఠీవీగా నా నాయకుడు. చచ్చేంత ప్రేమ ఉన్న ఈ జనం సాక్షిగా.. జగన్ రెడ్డీ! ప్యాక్ యువర్ బ్యాగ్స్. నీ ఖేల్ ఖతం. pic.twitter.com/CVtRCDPBMz
— Anitha Vangalapudi (@Anitha_TDP) May 19, 2022