Andhra Pradesh: తెగని గన్నవరం పంచాయతీ.. త్వరలో మరోసారి సమావేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ నేతల పంచాయతీ హాట్ టాపిక్‌గా మారింది. టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్, వైసీపీ నేత దుట్టా రామచంద్రరావు మధ్య కొంతకాలంగా గ్రూప్ తగాదాలు ఉన్నా.. ఇప్పుడు అవి పీక్స్‌కు చేరాయి. ఈ విషయం సీఎం ఆఫీసు వరకు వెళ్లింది. దీంతో వీరిద్దరి వ్యవహారం త్వరగా తేల్చాలని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఈరోజు సాయంత్రం క్యాంప్ కార్యాలయానికి పిలిపించారు. వల్లభనేని వంశీమోహన్, దుట్టా రామచంద్రరావుతో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎంవో అధికారులు ప్రత్యేకంగా సమావేశమై గన్నవరం పంచాయతీపై చర్చించారు.
Andhra Pradesh: సీఎంవోకు చేరిన గన్నవరం పంచాయతీ
Also Read
- Quba Pub Fight: విశాఖ 'క్యూబా' పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
- CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
- Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
ఈ సమావేశం ముగిసిన తర్వాత ఎన్టీవీతో దుట్టా రామచంద్రరావు మాట్లాడారు. తమను సజ్జల, ధనుంజయ్ రెడ్డి రమ్మని పిలిచారని.. వారికి గన్నవరం నియోజకవర్గంలో జరుగుతున్న విషయాలన్నీ చెప్పామని తెలిపారు. తన అల్లుడు మీద వంశీ ఆరోపణలు చేశారని.. అందుకే తాను కూడా కలెక్టర్‌కు మట్టి తవ్వకాలపై లేఖ రాసినట్లు వివరించారు. అధిష్టానానికి తాము చెప్పాల్సింది చెప్పామని.. అయితే మరోసారి కలుద్దామని వాళ్లు చెప్పారని దుట్టా రామచంద్రరావు వెల్లడించారు.
తాజావార్తలు
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
-
The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై ‘ది ప్యారడైజ్’లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
-
Srikanth Odela: “ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?”.. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!