తిరుమల గిరులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు భక్తులు.. వరుస సెలవులు రావడానికి తోడు.. పెళ్లిల సీజన్ కూడా కావడంతో.. తిరుమలకు తరలివస్తున్నారు భక్తజనం.. శ్రీవారి సర్వదర్శనానికి ఏకంగా 20 గంటల సమయం పడుతుందంటే.. భక్తులు ఏ స్థాయిలో వస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.. ప్రస్తుతం వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లని నిండిపోయి.. ఆస్థాన మండపం వరకు క్యూ లైనులో వేచివున్నారు భక్తులు.. ఇక, ఇవాళ రెండో శనివారం, రేపు ఆదివారం…
గోదావరి ప్రవాహం భద్రాచలం, ధవళేశ్వరం వద్ద నిలకడగా ఉంది. గోదావరి వరద తగ్గుముఖం స్వల్పంగానే ఉంటుందని చెబుతున్న అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు.
విశాఖ గురించి ఏ మాత్రం పరిచయం ఉన్న వాళ్ళకైనా ఇక్కడ నీలి సముద్రం అందాలు సుపరి చితం. 35కిలోమీటర్ల తీరంలో బంగారపు రంగులో మెరిసిపోయే ఇసుక తిన్నెలు.. వాటిని బలంగా తాకే అలలు కనిపిస్తాయి. కానీ, రెండు రోజులుగా ఇక్కడ సముద్రం కొంత మేర రంగు మారింది. నల్లటి ఇసుక మేటలు వేస్తోంది. కోస్టల్ బ్యాటరీ నుంచి వుడా పార్క్ మధ్య తీరం నల్లగా మారడం తో సందర్శకులు అందోళనకు గురైయ్యారు.. నల్లటి ఇసుక కొట్టుకుని రావడం…
* నేటి నుంచి మునుగోడులో కాంగ్రెస్ పాదయాత్ర, నారాయణపురం నుంచి చౌటుప్పల్ వరకు పాదయాత్రకు నిర్ణయం.. పాల్గొననున్న పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, మధుయాష్కీ, 16వ తేదీ నుంచి పాదయాత్రకు రేవంత్ * విశాఖలో రేపటి నుంచి ఈ నెల 31వ తేదీ వరకు అగ్నిపథ్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ, * విజయవాడ: ప్రకాశం బ్యారేజ్ దగ్గర తగ్గిన వరద ఉధృతి, మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ, 70 గేట్ల ద్వారా…
CM Jagan Review Meeting on Education Department: ఏపీలో విద్యాశాఖపై అధికారులతో శుక్రవారం నాడు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ కీలక సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన కీలక ఆదేశాలను జారీ చేశారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నెట్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. అంతేకాకుండా పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నాడు-నేడు కార్యక్రమాన్ని సమర్ధవంతంగా అమలు చేసేందుకు పాఠశాలల నిర్వహణ కోసం…
India Today Survey: మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇండియా టుడే నిర్వహించిన లేటెస్ట్ సర్వేలో దేశంలో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు మరోసారి మోదీకే పట్టం కడతారని స్పష్టమైంది. అయితే 2019లో వచ్చిన సీట్ల కంటే బీజేపీకి మెజారిటీ తగ్గుతుందని ఇండియా టుడే-సీ ఓటర్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. బీజేపీకి 2019 ఎన్నికల్లో 303 సీట్లు వచ్చాయి. కానీ వచ్చే ఎన్నికల్లో బీజేపీ 286 సీట్లకే పరిమితం అవుతుందని సర్వే అంచనా వేసింది. గత…
MPDO Association leaders meets cm jagan: అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ను ఎంపీడీవోల సంఘం ప్రతినిధులు కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. దాదాపు 25 ఏళ్ళుగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న 237 మంది ఎంపీడీవోలకు డిప్యూటీ సీఈవోలుగా, డీడీవోలుగా ఒకేసారి పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు కాకర్ల వెంకటరామిరెడ్డి, ఎంపీడీవోల సంఘం అధ్యక్షుడు వై.బ్రహ్మయ్య ముఖ్యమంత్రి జగన్‌ను కలిసి…
హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారంపై ఇంకా రచ్చ సాగుతూనే ఉంది.. ఆంధ్రప్రదేశ్‌లో ఓవైపు నేతల మధ్య మాటల తూటాలు పేలుతుండగా.. మరోవైపు.. ఈ వ్యవహారం కేంద్రం వరకు వెళ్లింది.. ఓ ఎంపీ ప్రధాని దృష్టికి తీసుకెళ్తే.. జాతీయ మహిళా కమిషన్ … లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాసి.. ఆ సంగతి తేల్చమని కోరింది.. అయితే, ఈ వ్యవహారంపై స్పందించిన సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు.. ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ లేకుండానే.. ఆ…
ఓ వైపు గోదావరి.. మరో వైపు కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చుతున్నాయి.. ఇప్పటికే కృష్ణాబేసిన్‌లోని శ్రీశైలం, నాగార్జున సాగార్, పులిచింతల ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో పెద్ద ఎత్తున వరద నీరు దిగువకు వెళ్తుందో.. దీంతో క్రమంగా ప్రకాశం బ్యారేజ్ దగ్గర వరద పెరుగుతూ పోతోంది.. విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ కు వరద తాకిడి పెరిగింది.. అప్రమత్తమైన అధికారులు.. దిగువ ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేశారు.. ప్రకాశం బ్యారేజ్ దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.. ఇన్‌ఫ్లో రూపంలో…
* నేడు తెలంగాణ ఎంసెట్, ఈసెట్ ఫలితాలు విడుదల, ఫలితాలను విడుదల చేయనున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి * హైదరాబాద్: నేడు ఉదయం 10 గంటలకు గోషామహల్లో బీజేపీ ర్యాలీ, ఆకాశ్‌పురి నుంచి ధూల్‌పేట్ వరకు బీజేపీ బైక్ ర్యాలీ, 2 వేలకు పైగా జాతీయ జెండాలు పంపిణీ చేయనున్న బీజేపీ నేతలు * ఈ నెల 20న మునుగోడులో టీఆర్ఎస్ బహిరంగ సభ, నేడు బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించనున్న నల్గొండ నేతలు * ప్రకాశం…