Heavy Rains in Andhra Pradesh: ఏపీలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే వర్షాలు దంచికొడుతున్నాయి.. ఆంధ్రప్రదేశ్‌తో పాటు హైదరాబాద్ సహా తెలంగాలోని కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి.. అయితే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ చెబుతోంది.. పశ్చిమ మధ్య మరియు ఆనుకుని ఉన్న తూర్పుమధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది… ఇది రానున్న 48 గంటల్లో పశ్చిమ మధ్య మరియు ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం ఉత్తరాంధ్ర – దక్షిణ ఒడిశా తీరాల వెంబడి బలపడుతోందని తెలిపారు ఏపీ విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్.. దీని ప్రభావంతో శనివారం వరకు రాష్ట్రంలో విస్తృతంగా పిడుగులతో కూడిన వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.. ఇక, కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉంటుందని.. మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లరాని హెచ్చరించారు. మరోవైపు.. తెలంగాణను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి.. హైదరాబాద్‌కు సెప్టెంబర్ ముప్పు తప్పుదు అనే తరహాలో.. గత రెండు మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.. మరో రెండు రోజుల పార్టీ భారీ నుంచి అతి భారీ వర్షాలు తెలంగాణలో కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది.
Read Also: Heavy Rain in Telangana: అలర్ట్.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేడు భారీ వర్షాలు..
Also Read
- CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
- Jana Sena - TDP: ఏలూరు మేయర్ సీటుపై జనసేన పట్టు..! అప్పలనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
- Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
- Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!