నేను క్షేత్ర స్థాయి నుండి భారత దేశ రెండో అత్యున్నత పదవి వరకు వెళ్లాను.. నాకు ఇచ్చిన బాధ్యత నేను సమర్ధవంతంగా నిర్వహించాను.. కానీ, నాకు నచ్చిన పదవులు రాజ్యాంగ పదవులు కాదు.. ప్రజలతో మమేకమయ్యే పదవులు నాకు ఎంతో ఇష్టం అంటూ మరోసారి తన మనసులోని మాటలను బయటపెట్టారు భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు.. ఏపీలో పర్యటిస్తున్న ఆయన.. పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ.. తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.. నిన్నటి నిన్నే ఆయన.. తాను తల్లి ప్రేమకు నోచుకోలేదు.. నన్ను పార్టీయే పెంచిందని వ్యాఖ్యానించిన ఆయన.. ఇవాళ గుంటూరులో మిత్రులు నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో చిరకాల మిత్రులు, శ్రేయోభిలాషులు, ఆత్మీయులు, పురప్రముఖులను కలిశారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. తనకు రాజ్యాంగ పదవులు నచ్చవంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.. చట్ట సభలు చాలా ముఖ్యమైనవి… వాటిని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉందని.. చట్ట సభల స్థాయి తగ్గడం సమాజానికి మంచిది కాదని.. వాటి పరిధిలు, హక్కులు రాజ్యాంగంలో పొందు పరిచారని.. చట్టాలు అమలు చేయాల్సిన వారు గాడి తప్పి వ్యవహరిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు.
కొంత మంది చేస్తున్న పనులు వల్ల చట్ట సభల స్థాయి తగ్గి పోతుంది.. దీనిపై చర్చ జరగాలని సూచించారు వెంకయ్యనాయుడు.. ప్రభుత్వాన్ని విమర్శించే ప్రతిపక్షాలు హుందాగా వ్యవహరించాలి.. కానీ, చట్ట సభల్లో దుర్భాషలాడటం ఒక ట్రెండ్ గా మార్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఇక, సెప్టెంబర్ 9 ఆంధ్రపత్రిక ఆవిర్భావ దినోత్సవం.. ఆంధ్ర పత్రిక ఆవిర్భావం ఆ నాటికి సాహసం.. ఈ నాటికి దుస్సాహసం.. కానీ, రాజకీయ ప్రయోజనాల కోసం ఈ రోజు పత్రికలు నడుపుతున్నారు.. ఆ విధానం మారాలని సూచించారు.. మరోవైపు, స్వాతంత్ర్య పోరాటం లో సుభాష్ చంద్రబోస్ పాత్ర అనిర్వచనీయం.. మహాత్మ గాంధీ నాయకత్వంలో స్వతంత్రం ఉద్యమంలో ఎంతో మంది పోరాడారు.. వారి పేర్లతో నూతన నిర్మాణాలు చేయాలని పేర్కొన్నారు.. కుటుంబ పాలకుల నాయకుల పేర్లు కాదు… మాతృ భాష ను కాపాడుకోవాలి.. పరిపాలన కూడా ప్రజల భాషలో జరగాలన్నారు. కోర్టు తీర్పులు కూడా తెలుగులోనే ఉండాలి.. మాతృ భాషలో చదువుకున్న వారు దేశంలో శక్తి వంతమైన భాద్యతలు నిర్వహించారని.. ప్రధాని మోడీ, సుప్రీం కోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రమణ, నేను ఊర్లలో మాతృ భాషలో చదువుకున్న వాళ్లమే అని గుర్తుచేసుకున్నారు ఎం. వెంకయ్యనాయుడు.