వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. పార్టీ సోషల్ మీడియా వింగ్‌పై ప్రత్యేకంగా దృష్టిసారించారు.. ఇప్పటికే రాష్ట్రస్థాయిలో సామాజికి మాధ్యమాల సామూహాన్ని పటిష్టం చేశారు.. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా బాధ్యతల్ని సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవ్‌కు అప్పగించిన విషయం తెలిసిందే.. పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీకి అనుబంధంగా ఉన్న సోషల్ మీడియా బాధ్యతల్ని ఎంపీ విజయసాయిరెడ్డి పర్యవేక్షిస్తూ రాగా.. ఈ మధ్యే.. సజ్జల భార్గవ్‌కు సోషల్ మీడియా బాధ్యతలు కట్టబెట్టారు.. వైఎస్సార్సీపీ అధికారంలోకి…
ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ సహా నాలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం… పట్టణాల అభివృద్ధి కోసం రాష్ట్రాలకు కేంద్రం ఆర్థిక సహాయం ప్రకటించింది… ఈ విడతలో ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, మహారాష్ట్రలోని పట్టణ స్థానిక సంస్థల విభాగం కింద కేంద్రం ఆర్ధిక సహాయం చేసింది… ఆంధ్రప్రదేశ్‌కి తాజాగా రూ.136 కోట్లు విడుదల చేసింది కేంద్రం.. రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం అభివృద్ధి కోసం కేంద్ర ఈ సహాయం చేసింది… 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను ఇప్పటి వరకు…
జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖ పర్యటనపై విమర్శలు వచ్చాయి.. ఓవైపు మంత్రుల కాన్వాయ్‌పై దాడులు చేశారంటూ జనసైనికులపై కేసులు కూడా పెట్టారు. అయితే, విశాఖ చేరుకున్న పవన్.. ఎయిర్పోర్ట్ నుంచి నిర్వహించిన రోడ్‌షోతో ఎంతో మంది ఇబ్బంది పడ్డారని విమర్శిస్తోంది అధికార పార్టీ.. ఇక, విశాఖ పర్యటనలో తనపై ఆంక్షలు, జనసైనికుల అరెస్ట్‌లపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు పవన్ కల్యాణ్.. దీంతో, ఆయన కామెంట్లకు గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు వైసీపీ నేతలు. విశాఖలో పవన్ చేసిన పనివల్ల…
ప్రధాని నరేంద్ర మోడీ చేతిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలుబొమ్మలా మారిందంటూ సంచలన ఆరోపణలు చేశారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ… ఆయన చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర ప్రస్తుతం ఏపీలో కొనసాగుతుండగా.. అందులో భాగంగా కర్నూలు జిల్లా ఆదోని మండలం ఆరేకల్‌లో నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడారు.. ఏపీ ప్రభుత్వ రిమోట్ కంట్రోల్ బీజేపీ దగ్గర ఉంది… అంతే కాదు రాష్ట్రంలోని అన్ని పార్టీల రిమోట్ కంట్రోల్ కూడా భారతీయ జనతా పార్టీ చేతిలోనే ఉందని ఆరోపించారు.. ఇక,…
ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు.. ఢిల్లీ నుంచి మళ్లీ రాష్ట్రానికి వచ్చారు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ప్రవీణ్ ప్రకాష్.. ప్రస్తుతం ఏపీ భవన్ ప్రిన్సిపాల్ రెసిడెంట్ కమిషనర్‌గా ఉన్న ప్రవీణ్ ప్రకాష్‌ను.. ఆంధ్రప్రదేశ్ రవాణా, రోడ్లు భవనాల శాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరీగా బదిలీ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. ఇక, పొర సరఫరాల కార్పొరేషన్ వీసీ అండ్ ఎండీగా వీర పాండ్యన్‌ను బదిలీ చేసింది.. మరోవైపు.. దేశ రాజధాని ఢిల్లీలోని ఏపీ భవన్…
YS Jagan Mohan Reddy: మరోసారి అధికారంలోకి రావడం కాదు.. ఈ సారి ఏకంగా 175కి 175 స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. అందుకు గాను గడగడపకు ప్రభుత్వం పేరుతో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ప్రజల్లోకి వెళ్లేలా చేశారు.. ఇక, కుదిరినప్పుడల్లా.. వరుసగా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు.. ఇవాళ బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గ కార్యకర్తలతో భేటీ అయిన సీఎం… ఈ…
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్… రేణిగుంట విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి దిగజారుడు మాటలు తగవు అంటూ పవన్ కల్యాణ్‌కు హితవు పలికారు.. ఇక, రాజకీయ నాయకుడు ఎలా ఉండాలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూసి నేర్చుకోవాలని సూచించిన ఆయన… అలాగే ఓ రాజకీయ నేత ఎలా ఉండకూడదో పవన్ కల్యాణ్‌ని చూసి నేర్చుకోవాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.. ఆరు…
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఢిల్లీ నుంచి పిలుపువచ్చిందనే ప్రచారం సాగుతోంది.. తన విశాఖ పర్యటనలో చోటు చేసుకున్న పరిణామాలపై సీరియస్‌గా స్పందించిన పవన్ కల్యాణ్.. ఢిల్లీకి పోం.. ఇక్కడే తేల్చుకుంటాం అని ప్రకటించిన విషయం తెలిసిందే.. అయితే.. హస్తిన నుంచి పవన్‌కు పిలుపు వచ్చినట్టుగా తెలుస్తోంది.. గత రెండు రోజులుగా జరిగిన పరిణామాలతో పవన్ కల్యాణ్‌ను ఢిల్లీకి రావాల్సిందిగా బీజేపీ పెద్దలు ఆహ్వానించినట్టు సమాచారం. అయితే, ప్రస్తుతం జనసేనాని హైదరాబాద్‌లో ఉన్నారు.. దీంతో, ఆయన ఢిల్లీ…
విశాఖ ఎయిర్‌పోర్టులో మంత్రులపై దాడి కేసులో అరెస్ట్ అయిన జనసేన కార్యకర్తలకు కోర్టులో షాక్ తగిలింది… జనసేన కార్యకర్తలను అరెస్ట్ చేసి ఆదివారం రాత్రి జిల్లా కోర్టు జడ్జి ముందు పోలీసులు ప్రవేశపెట్టారు. ఈ మేరకు విచారణ చేపట్టిన కోర్టు అరెస్ట్ అయిన వారిలో 61 మంది జనసేన నాయకులకు రూ.10వేల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే కాగా.. మరో 9 మంది నేతలకు ఈనెల 28 వరకు రిమాండ్ విధించారు.. అయితే, బెయిల్…
Andhra Pradesh: ఏపీ బీజేపీలో లుకలుకలు బహిర్గతం అవుతున్నాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ మాజీ చీఫ్ లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీలో ఏం జరుగుతుందో కూడా తమకు తెలియడం లేదని కన్నా వ్యాఖ్యానించారు. ఏపీలో పార్టీ బలోపేతానికి హైకమాండ్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సమస్య అంతా సోము వీర్రాజుతోనే వచ్చిందని.. పార్టీలో వ్యవహారాలన్నీ ఆయన ఒక్కడే అన్ని చూసుకోవడంతో సమస్య ఉత్పన్నమైందని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన…