దొంగలు రెచ్చిపోతున్నారు. ఏ చిన్న అవకాశాన్ని వదలడం లేదు. ప్రకాశం జిల్లా పొదిలి మండలంలో జరిగిన దారిదోపిడీ సంచలనంగా మారింది. హైదరాబాద్ జాతీయ రహదారి పక్కనే అనుకుని రామాపురం వెళ్లే గురుగుపాడు మట్టిరోడ్డులో దారి దోపిడీకి ప్రయత్నించారు గుర్తు తెలియని వ్యక్తులు. రాత్రి సమయాలలో గురుగుపాడు గ్రామానికి వెళ్తున్న వాహనాలను ఆపి బెదిరింపులకు పాల్పడుతున్నారని గుర్తు తెలియని ముఠాపై పలువురు ఆరోపిస్తున్నారు ఆటో ఆపి ఆటోలో ప్రయాణిస్తున్న వ్యక్తిని బెదిరించడంతో ఈ విషయాన్ని గ్రామస్తులకు తెలిపాడు బాధితుడు.
అయితే, అతని దగ్గర నగదు లేకపోవడంతో బాధితుడిని వదిలేసారు దుండగులు. దారిదోపిడీ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో అక్కడేం జరిగిందనేది ఆరాతీస్తున్నారు. ఈ ఘటనతో వాహనదారులు ఆ దారిలో వెళ్లాలంటేనే భయాందోళనకు గురి అవుతున్నారు.ఈ ప్రాంతానికి సంబంధించిన పోలీస్ అధికారులు స్పందించి ఇలాంటి దారి దోపిడీ బెదిరింపులకు ప్రయత్నిస్తున్న ముఠా సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జనం కోరుతున్నారు. వాహనదారులపై ఎటువంటి దాడులు జరగకుండా చూడాలని పలువురు పోలీసులకు సూచిస్తున్నారు. ఈ ప్రాంతంలో పోలీస్ గస్తీ ఏర్పాటుచేయాలంటున్నారు.
Read ALso: Alien Birth: బీహార్లో వింత శిశువు జననం.. చూసేందుకు ఎగబడుతున్న జనం
కడియద్ద బాధితులకు చెక్కుల పంపిణీ
ఈ నెల 10వ తేదీన పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కడియద్ద గ్రామంలో జరిగిన బాణసంచా కర్మాగార పేలుడు ఘటనలో మృతి చెందిన కుటుంబాలను ఆదుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ ఘటనలో మృతి చెందిన ముగ్గురు వ్యక్తుల కుటుంబాలకు కుటుంబానికి 10లక్షలు చొప్పున ఎక్స్ గ్రేషియా చెక్కులను అందచేశారు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి. దేవాదాయ మంత్రి కొట్టు సత్యనారాయణ. ఇటువంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. ప్రమాదం జరిగి వారం రోజులు నిండకుండానే బాధితులను ఆదుకోవడం ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే సాధ్యం అయింది.